తెలంగాణ

telangana

ETV Bharat / business

కార్ పెయింట్ కాపాడుకోవాలా? ఈ టిప్స్ మీ కోసమే! - car painting protection - CAR PAINTING PROTECTION

How To Protect Car Paint : కార్లకు పెయింటింగ్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అదే వాహనం బాహ్య స్థితిని తెలియజేస్తుంది. అలాంటి పెయింటింగ్ కాపాడుకోవడానికి టిప్స్ గురించి ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

car painting protection tips
car painting protection tips (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 9:59 AM IST

How To Protect Car Paint : కారు ఎంత కొత్తదైనా దాని మీద ఏదైనా చిన్న గీత పడితే చూడటానికి అంతగా బాగోదు. కారణం ఆ గీత వల్ల కారు పెయింటింగ్ పోవడమే. అందుకే కార్లలో పెయింటింగ్​ను చాలా మంది తేలికగా తీసుకుంటారు కానీ మిగతా భాగాల్లాగే అది చాలా ముఖ్యం. ఆ పెయింటింగ్ మంచిగా ఉంచుకుంటే ఎన్నేళ్లైనా కారు మెరుస్తూ కొత్తదానిలా కనబడుతుంది. మరి అంతటి ముఖ్యమైన పెయింటింగ్​ను ఎలా కాపాడుకోవాలో ఈ టిప్స్ ద్వారా తెలుసుకోండి.

1. కడిగేటప్పుడు జాగ్రత్త
కారును వాష్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మీరుండే ప్రాంతాన్ని బట్టి ఎన్ని రోజుల‌కోసారి కార్ వాష్ చేయాల‌ని అన్న‌ది ఆధార‌ప‌డి ఉంటుంది. ఒకవేళ బాగా దుమ్ము, ధూళి ప్రాంత‌మైతే రోజూ, ఒక‌వేళ సాధార‌ణ ఏరియా అయితే వారంలో రెండు లేదా మూడు సార్లు క‌డ‌గాలి. మీరు ఉప‌యోగించే నీటిని బ‌ట్టి పెయింటింగ్ స్థితి ఉంటుంది. హార్డ్ వాట‌ర్ ఉప‌యోగిస్తే దాని వ‌ల్ల పెయింటింగ్ మీద మ‌ర‌క‌లు ఏర్ప‌డ‌తాయి. వీటిని అంత సుల‌భంగా వ‌దిలించుకోలేం.

2. దుమ్ము చేర‌కుండా చూసుకోవ‌డం
కారు ఉప‌రితలాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోవ‌డం అల‌వాటు చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పెయింటింగ్ షైన్ అయి ఎన్ని రోజులైనా కారు కొత్త‌దిగా క‌నిపిస్తుంది. లేదంటే దాని మీద దుమ్ము, ధూళి చేరితే క‌డిగే స‌మ‌యంలో మ‌ర‌క‌లై వాటిని తొలగించ‌డానికి ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయి. అందుకే కారు క‌డిగే ముందే దుమ్ము లేకుండా చేసి వాష్ చేసుకోవాలి.

3. వాక్సింగ్ చేయ‌డం
కారుకు వాక్సింగ్ చేయ‌డం కొంచెం క‌ష్టంతో కూడుకున్న ప‌ని. చాలా మంది దీన్ని చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ఒక ప్యానెల్ ద్వారా కారుపై అంటుకుపోయిన గ్రీజు లాంటి మ‌ర‌క‌ల్ని తొల‌గించ‌డానికి ఉప‌యోగించే ప్ర‌క్రియ ఇది. మీకు ఈ వాక్సింగ్ గురించిన అవగాహ‌న ఉంటే స్ప్రే వ్యాక్స్ లేదా వెట్ వాక్స్‌తో సొంతంగా చేసుకోవ‌చ్చు. లేదా మీకు వీలు కుదిరిన‌ప్పుడ‌ల్లా ప్రొఫెష‌న్ కు లేదా స‌ర్వీసింగ్​కు గానీ ఇచ్చిన‌ప్పుడు చేయించుకోవ‌చ్చు.

4. మంచి వాషింగ్ టూల్స్ ఉప‌యోగించ‌డం
కారు వాష్​లో ఉప‌యోగించే టూల్స్ నాణ్య‌మైన‌వి వాడాలి. త‌ట‌స్థ‌ pH స్థాయిని కలిగి ఉండే షాంపూని ఉప‌యోగించాలి. కారును క‌డగ‌డానికి, ఆ త‌ర్వాత నీటి మ‌ర‌క‌ల్ని తుడిచేయ‌డానికి మంచి క్లాత్ వాడాలి. కారు పెయింటింగ్​ను కాపాడే మైక్రో ఫైబ‌ర్ క్లాత్ ఉండేలా చూసుకోవాలి. కారు ఆరే స‌మ‌యంలో నీడ‌లో ఉంచాలి.

5. పెయింటింగ్ ర‌క్ష‌ణ కోసం కోటింగ్
కారు పెయింటింగ్​ని ర‌క్షించ‌డానికి ప‌లు ర‌కాల కోటింగ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా టెఫ్లాన్, సిరామిక్, గ్రాఫేన్ అనేవి ఉత్త‌మం. టెఫ్లాన్ కంటే సిరామిక్ చాలా మన్నికైంది. ఇది సన్నని పొర. సిరామిక్ అనేది ఒక-మైక్రాన్ కోటింగ్. కారు తయారీ, మోడల్ ఆధారంగా టెఫ్లాన్ కోటింగ్‌కు రూ.5,000 నుంచి హై-ఎండ్ గ్రాఫేన్ కోటింగ్‌కి రూ.25,000 వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది.

6. నిర్ల‌క్ష్యం వ‌ద్దు
కారు అడుగు భాగాన్ని జాగ్ర‌త్త‌గా చేసుకోవ‌డం కూడా ముఖ్య‌మే. ఎందుకంటే ర‌వాణ‌, ప్ర‌యాణ స‌మ‌యంలో కొన్ని కార‌ణాల రీత్యా కారు అడుగుభాగం దెబ్బ‌తినే అవ‌కాశ‌ముంది. దీంతోపాటు కారును ఎండ‌లో ఉండే విధంగా పార్క్ చేయ‌కూడ‌దు. పైగా ర‌ద్దీగా ఉండే ప్ర‌దేశాల్లో నిలిపి ఉంచ‌డం మానేయాలి. ఇత‌ర వాహ‌నాల ద్వారా ప్ర‌మాదం జ‌రిగి పెయింటింగ్ దెబ్బ‌తినే ప్ర‌మాద‌ముంది.

ABOUT THE AUTHOR

...view details