How To Clean Car Windshield Inside :మనం వాడే కారు కండిషన్‌కు, క్లీనింగ్‌కు సంబంధించి కొన్ని విషయాలు మరిచిపోయినా ఫర్వాలేదు. కానీ మురికిగా ఉన్న విండ్‌షీల్డ్ క్లీనింగ్‌ను మాత్రం మరిచిపోవద్దు. విండ్‌షీల్డ్ మురికిగా ఉంటే రోడ్డుపై చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. విండ్‌షీల్డ్ మసకగా ఉంటే డ్రైవింగ్ చేయడం కూడా కష్టమవుతుంది. ఎదురుగా వస్తున్న వాహనాలను సరిగా చూడలేం. తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల కారు లోపలి భాగంలో విండ్‌షీల్డ్‌ను ఎలా క్లీన్ చేయాలి? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
విండ్‌షీల్డ్ ఎందుకు మురికిగా అవుతుంది?
కారు లోపలి భాగంలో విండ్‌షీల్డ్‌ను తరచూ తాకినా, తాకకున్నా అది డర్టీగా అవుతుంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. మనం వాడే కారు ఫ్రెష్నర్స్ కెమికల్స్‌ను విడుదల చేస్తాయి. ఆ రసాయనాల అవశేషాలు విండ్షీల్డ్పై పేరుకుపోతాయి. దీంతో విండ్‌షీల్డ్ జిడ్డుగా, మసకగా తయారవుతుంది. అంతేకాకుండా కారులో పొగ తాగడం, దుమ్ము, ధూళి వంటి వాటి వల్ల కూడా విండ్‌షీల్డ్ మసకబారుతుంది. తద్వారా అద్దం గుండా చూడడానికి ఇబ్బంది అవుతుంది. మీరు కారు రెగులర్గా డ్రైవ్ చేయకున్నా, కారు ఇంటీరియర్స్ రిలీజ్ చేసే(ఆఫ్-గ్యాసింగ్) గ్యాస్‌ల వల్ల, దమ్ము, ధూళి వల్ల కూడా విండ్‌షీల్డ్ మసకబారుతుంది.
విండ్‌షీల్డ్ ఎలా క్లీక్ చేయాలి?
విండ్‌షీల్డ్ శుభ్రం చేసేముందు మీ వద్ద సరైనా క్లీనర్స్, మెటీరియల్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. కారులో లోపల విండ్‌షీల్డ్ క్లీన్ చేయడానికి లింట్-ఫ్రీ లేదా మైక్రోఫైబర్ క్లాత్‌ను ఉపయోగించాలి. పేపర్ టవల్స్ లాంటి మెటీరియల్స్‌ను వాడకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే, వాటి వల్ల క్లీనింగ్ చేసిన తర్వాత, విండ్షీల్డ్పై క్లీనర్స్‌కు సంబంధించిన అవశేషాలు మిగిలిపోతాయి.