How To Check PF Balance : గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఉద్యోగి ప్రతి నెలా తన ప్రాథమిక జీతంలో 12 శాతాన్ని పీఎఫ్ అకౌంట్‌కు కంట్రిబ్యూషన్‌గా చెల్లిస్తారు. అంతే మొత్తాన్ని యాజమాన్యం కూడా పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. అయితే మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫీసుకు వెళ్లకుండా, మీరు పనిచేసే కంపెనీ యజమానిని అడగకుండానే, పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
How To Check PF Balance Online :మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
- ముందుగా EPFO అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- మీ UAN, పాస్‌వర్డ్ ఉపయోగించి సైన్-ఇన్ కావాలి
- బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటున్న నిర్దిష్ట PF ఖాతాను ఎంచుకోవాలి. (మీకు బహుళ పీఎఫ్ ఖాతాలు ఉంటే!)
- తరువాత PF పాస్‌బుక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అంతే సింపుల్.
- మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్, పీఎఫ్ హిస్టరీని అంతా కనిపిస్తుంది.
How To Check PF Balance In UMANG App :ఉమాంగ్ యాప్ ఉపయోగించి కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఎలా అంటే?
- ముందుగా ప్లేస్టోర్ నుంచి ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- తర్వాత మీ ఫోన్లో ఉమాంగ్ యాప్‌ను ఓపెన్ చేసి EPFOను ఎంచుకోండి.
- అనంతరం 'Employee Centric Services' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- తర్వాత మీ EPF బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి 'View Passbook' ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- అనంతరం మీ UAN నంబర్‌ను ఎంటర్ చేయండి.
- వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయండి.
- అప్పుడు మీ EPF బ్యాలెన్స్ వివరాలు కనిపిస్తాయి.
How To Check EPF Balance Offline : ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను ఆఫ్లైన్లోనూ చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే?