ETV Bharat / state

ముఖ్యమంత్రికి బర్త్​డే గిఫ్ట్ - పట్టువస్త్రంపై రేవంత్​రెడ్డి ముఖచిత్రం - CM REVANTH PIC ON SILK CLOTH

మరోసారి ప్రత్యేకత చాటుకున్న చేనేత కార్మికుడు హరి ప్రసాద్ - పట్టువస్త్రంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రం ఆవిష్కరణ - రేపు సీఎం జన్మదినం సందర్భంగా రూపొందించిన హరిప్రసాద్

CM REVANTH PIC ON SILK CLOTH
CM Revanth Reddy Picture On Silk Cloth (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 7, 2024, 10:37 PM IST

CM Revanth Reddy Picture On Silk Cloth : మన చేనేత కార్మికులు మగ్గంపై చేసే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. అగ్గిపెట్టెలో పట్టే చీరలు, దబ్బనంలో పట్టే చీర, బంగారం, వెండితో తయారీ చేసిన కోకలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో. ఎందరో కళాకారులు సందర్భానుసారంగా తమ టాలెంట్ బయట పెడుతూనే ఉంటారు. ఇలాగే ప్రధాన మంత్రి చేత ప్రశంసలు అందుకున్న సిరిసిల్ల చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతం చేశారు.

రేపు(నవంబర్​ 8న) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టు వస్త్రంపై తెలంగాణ ముఖ చిత్రంలో సీఎం ఫోటో వచ్చే విధంగా దాదాపు ఐదు రోజులపాటు శ్రమించి తయారు చేశారు. దీని పొడవు 32 ఇంచులు వెడల్పు 47 ఇంచులు. ఈ ముఖచిత్రాన్ని తయారు చేయడానికి రూ. 20 వేల వరకు ఖర్చు వచ్చిందని హరిప్రసాద్ తెలిపారు. నవంబర్​ 8న ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా అవకాశం కల్పిస్తే ఈ పట్టు వస్త్రాన్ని సీఎంకు కానుకగా అందిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

'నవంబర్​ 8న ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా అరుదైన కానుకగా అందించాలని పట్టువస్త్రంపై సీఎం రేవంత్​రెడ్డి చిత్రం వచ్చేలా తయారు చేశా. దాదాపు ఐదు రోజులపాటు శ్రమించి పట్టువస్త్రం తయారు చేశాను. నాకు అవకాశం కల్పిస్తే రేవంత్​రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు ఈ వస్త్రాన్ని అందిస్తా'- వెల్ది హరిప్రసాద్, చేనేత కార్మికుడు

మన్ కీ బాత్​లో హరిప్రసాద్​కు ప్రధాని మోదీ ప్రశంసలు : సిరిసిల్లకు చెందిన హరి ప్రసాద్ చేనేత రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఇటీవలే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హరిప్రసాద్‌ పేరును ప్రస్తావించడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. జీ-20 సదస్సు లోగోను పట్టు వస్త్రంపై రూపొందించిన హరిప్రసాద్ నైపుణ్యాన్ని ప్రధాని ప్రశంసించారు. అంతే కాదు 2022లో బీమా పథకం ప్రారంభోత్సవం సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో పాటు పథకం వివరాలను తెలుపుతూ పట్టు వస్త్రం తయారు చేశారు. 2021లో అగ్గిపెట్ట, దబ్బనంలో పట్టే చీరలు రూపొందించి హరిప్రసాద్ అందరి దృష్టిని ఆకర్షించారు.

PM Modi Mann Ki Baat : 'మన్‌ కీ బాత్‌'లో ప్రధాని నోట సిరిసిల్ల నేతన్న మాట

National Handloom Day: నేతన్న అద్భుతం... అగ్గిపెట్టెలో ఇమిడే అంగీ, లుంగీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.