How To Check PAN Card Fraud :నేటి కాలంలో మనం చేసే ఆర్థిక లావాదేవీలు అన్నింటికీ పాన్ కార్డ్తప్పనిసరి అయిపోయింది. అయితే ఈ పాన్ కార్డు దుర్వినియోగమయ్యే అవకాశాలూ ఉన్నాయి. సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో పాన్ కార్డు దుర్వినియోగం సహజమే. అందుకే మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అవుతుందో, లేదో చెక్ చేసుకోవడం తప్పనిసరి.
పాన్ నంబర్ అంటే ఏమిటి?
PAN కార్డ్ అనేది భారత ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన ఒక ప్రత్యేకమైన 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ ఐడెంటిఫైయర్. దీనిని లామినేటెడ్ కార్డ్ రూపంలో ఐటీ డిపార్ట్మెంట్ జారీ చేస్తుంది. పన్ను ప్రయోజనాల కోసం భారతదేశంలోని వ్యక్తులు, సంస్థలకు PAN కార్డ్ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా పనిచేస్తుంది.
అయితే కొన్ని కీలకమైన పనుల కోసం పాన్ కార్డు జిరాక్సు కాపీలను ఇవాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మీ పాన్ కార్డు దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీ పాన్ కార్డు దుర్వినియోగం అయ్యిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
How To Check PAN Card Misuse :పాన్ కార్డు దుర్వినియోగం అవుతుందో లేదో తెలుసుకోవాలంటే, మీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఖాతాలను తరచుగా చెక్ చేసుకోవాలి. బ్యాంక్ స్టేట్మెంట్లను, రసీదులను పరిశీలించాలి. ఏవైనా తప్పుడు లావీదేవీలు జరిగాయా, లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇంకా ఏమేమి పరిశీలించాలంటే?
ఫైనాన్సియల్ స్టేట్మెంట్స్ :మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు చూడాలి. వాటిలో ఏవైనా అనుమానాస్పద లేదా అనధికార ఆర్థిక లావాదేవీలు జరిగాయా, లేదా అనేది ఓసారి చెక్ చేసుకోవాలి.
సిబిల్ :క్రెడిట్ బ్యూరోల నుంచి మీ క్రెడిట్ రిపోర్టు కాపీని తీసుకోండి. మీ పాన్ కార్డ్‌తో అనుసంధానం అయిన ఏవైనా ఫేక్ అకౌంట్స్ లేదా క్రెడిట్ అప్లికేషన్‌లు ఉన్నాయా లేదా అనేది చూడండి. ఒకవేళ అలాంటి ఏమైనా ఉంటే, వెంటనే క్రెడిట్ బ్యూరోకు ఫిర్యాదు చేయండి.