తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ క్రెడిట్ స్కోర్​ను ఫ్రీగా చెక్ చేసుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To Check CIBIL Score

How To Check Credit Score For Free : బ్యాంకులు లేదా రుణ సంస్థలు లోన్స్​ ఇచ్చే ముందు కచ్చితంగా మీ క్రెడిట్ స్కోర్​ను పరిశీలిస్తాయి. సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటే తక్కువ వడ్డీతోనే రుణాలు ఇస్తాయి. లోన్ ప్రక్రియ కూడా వేగంగా అయిపోతుంది. అందుకే ఆన్​లైన్​లో పూర్తి ఉచితంగా మీ క్రెడిట్ స్కోర్​ను ఎలా చెక్​ చేసుకోవాలో ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

Credit Score
CIBIL Score (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2024, 4:59 PM IST

How To Check Credit Score For Free :పర్సనల్‌ లోన్‌ నుంచి కార్‌ లోన్‌ వరకు ప్రతిదానికి కచ్చితంగా మంచి సిబిల్ స్కోర్‌ ఉండాల్సిందే. సిబిల్ స్కోర్‌ ఆధారంగానే బ్యాంకులు, రుణసంస్థలు లోన్లు ఇస్తుంటాయి. వ్యక్తుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో క్రెడిట్ స్కోర్​/ సిబిల్‌ స్కోర్‌ తెలియజేస్తుంది. తీసుకున్న లోన్లు సమయానికి చెల్లిస్తున్నారా? లేదా ఏమైనా బకాయిలు ఉన్నాయా? ఇలా అన్ని విషయాలు సిబిల్ స్కోర్‌ ద్వారా తెలిసిపోతాయి.

సిబిల్ స్కోరును సాధారణంగా 300 నుంచి 900 వరకు లెక్కిస్తారు. సిబిల్ స్కోరు ఎంత ఎక్కువ ఉంటే ఆర్థిక పరిస్థితి అంత బాగున్నట్లు భావిస్తాయి బ్యాంకులు. సిబిల్‌ స్కోర్‌ 700కిపైగా ఉంటే రుణాలు ఈజీగా పొందవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు సిబిల్‌ స్కోర్​ను చెక్ చేసుకోవాలి. అందుకే ఈ ఆర్టికల్​లో పూర్తి ఉచితంగా మీ సిబిల్‌ స్కోర్‌ను ఎలా చెక్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.

  • ముందుగా సిబిల్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://www.cibil.com/ ఓపెన్ చేయాలి.
  • వ్యక్తిగత సిబిల్ స్కోర్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • తరువాత Get Your Free CIBIL scoreపై క్లిక్ చేయాలి.
  • మీ ఈ-మెయిల్ ఐడీ ద్వారా అకౌంట్‌ను ఓపెన్‌ చేసుకోవాలి.
  • తర్వాత మీ పేరు ఎంటర్‌ చేయాలి.
  • పాన్‌ కార్డ్‌ నంబరు/ పాస్‌పోర్ట్​/ ఓటర్‌ ఐడీ/ డ్రైవింగ్ లైసెన్స్‌/ రేషన్​ కార్డ్​ నంబర్లలో ఏదో ఒక దానిని ఎంటర్ చేయాలి.
  • మీ పుట్టిన తేదీ, పిన్ కోడ్‌లను ఎంటర్ చేసి రాష్ట్రాన్ని ఎంచుకోండి.
  • తర్వాత మీ ఫోన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి, కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • వెంటనే మీ రిజిస్టర్డ్​ మొబైల్​​ నంబర్​కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేసిన కంటిన్యూ బటన్​పై క్లిక్‌ చేయాలి.
  • ఆ తర్వాత మీ అకౌంట్​ను మీరు వినియోగిస్తున్న సిస్టమ్‌తో యాడ్ చేయాలని అనుకుంటున్నారా? అని అడుగుతుంది.
  • మీ ప్రాధాన్యతలను బట్టి YES లేదా No ఆప్షన్‌పై క్లిక్ చేయండి. దీనితో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
  • ఆ తర్వాత Go To Dashboard ఆప్షన్​పై క్లిక్‌ చేయాలి.
  • వెంటనే మీ సిబిల్‌ స్కోర్‌ కనిపిస్తుంది. ఈ విధంగా మీరు పూర్తి ఉచితంగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు.

నోట్​ : సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇలా పూర్తి ఉచితంగా మీ సిబిల్ స్కోర్ చూడడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంకా ఎక్కువ సార్లు మీ క్రెడిట్ స్కోర్​ను చెక్​ చేసుకోవాలంటే, ప్రీమియం ప్లాన్స్​ను సబ్​స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా యాప్​లు, వెబ్​సైట్​లు కూడా ఉచితంగా క్రెడిట్ స్కోర్​ను చూపిస్తున్నాయి. వాటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, అవసరానికి మించి ఎక్కువ సార్లు చెక్ చేస్తూ ఉంటే, మీ క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.

కంపెనీ 'గ్రాట్యుటీ' ఇవ్వడానికి నిరాకరిస్తోందా? ఇలా చేస్తే ప్రోబ్లమ్ సాల్వ్​! - Gratuity Problems And Solutions

ఓలా బంపర్ ఆఫర్​ - ఈవీల ధరలు భారీగా తగ్గింపు - ఇకపై రూ.69,999కే S1X స్కూటర్​! - Ola EV Scooter Offers

ABOUT THE AUTHOR

...view details