తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ ఆధార్ యుసేజ్​​ హిస్టరీ తెలుసుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

How To Check Aadhaar Card Usage History : ఈ రోజుల్లో ప్రతి పనికీ ఆధార్ కార్డ్ తప్పనిసరి అవుతోంది. అయితే మనకు తెలియకుండానే, మరొకరు దానిని ఉపయోగిస్తే పరిస్థితి ఏమిటి? అందుకే ప్రతి ఒక్కరూ తమ ఆధార్ యుసేజ్ హిస్టరీని తెలుసుకోవడం ముఖ్యం. అందుకే ఈ ఆర్టికల్​ ద్వారా మీ ఆధార్​ యుసేజ్ హిస్టరీని చాలా ఈజీగా ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం.

How to check if your Aadhaar was misused
how to check aadhaar card usage history

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 3:01 PM IST

How To Check Aadhaar Card Usage History : ఈ రోజుల్లో అన్నింటికీ ఆధార్ తప్పనిసరి అయింది. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలకు, ఇలా అన్నింటికీ ఆధార్ వివరాలు తప్పనిసరి. అయితే ఆధార్ కార్డును మనం కాకుండా ఇంకెవరైనా వాడుతే పరిస్థితి ఏమిటి? అందుకే తరచుగా మన ఆధార్ యూసేజ్ హిస్టరీని చెక్​ చేసుకోవడం మంచిది.

ఎలా చెక్ చేసుకోవాలంటే?
Aadhaar Card Usage History Checking Process :
మన ఆధార్ కార్డును అనుమతి లేకుండా ఎవరైనా అక్రమంగా వాడుతున్నారా? లేదా? అనేది చాలా సులువుగా తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ముందుగా UIDAI అధికారిక పోర్టల్​ https://uidai.gov.in/en/ ఓపెన్​ వెళ్లాలి.
  • పైన ఎడమవైపున ఉన్న My Aadhaar ట్యాబ్​పై ట్యాప్​ చేసి, Aadhaar services పైన క్లిక్ చేయాలి.
  • Aadhaar Authentication History అనే ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  • వెంటనే లాగిన్ కోసం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • అందులో లాగిన్​పై క్లిక్ చేసి ఆధార్ నంబర్, క్యాప్చా, ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
  • తర్వాత కనిపించే స్క్రీన్​లో కిందకి స్క్రోల్ చేయగానే Authentication History అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • అక్కడ ALLని ఎంచుకొని డేటాని సెలెక్ట్ చేసుకొని Fetch Authentication History పై క్లిక్ చేయాలి.
  • వెంటనే గత ఆరు నెలలుగా మీ ఆధార్​ కార్డును ఏయే విషయాలకు ఉపయోగించారో డేటా మొత్తం కనిపిస్తుంది. అంతే సింపుల్​!

ఈ విధానం ద్వారా మీ ఆధార్​కు లింక్ చేసిన ఓటీపీ, బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ వివరాలను ఉపయోగించి, మీ ఆధార్ కార్డును ఆరునెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనేది తెలుసుకోవచ్చు. మీరు కాకుండా మరెవరైనా మీ ఆధార్ కార్డును వినియోగించినట్టు గుర్తిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవచ్చు.

Free Aadhar Update Deadline : ఆధార్​ వివరాలను ఉచితంగా అప్​డేట్​ చేసుకునేందుకు ఇచ్చిన గడవును UIDAI మరోసారి పొడిగించింది​. వాస్తవానికి మార్చి 14తోనే ఆధార్ ఫ్రీ అప్​డేట్ గడువు ముగిసింది. అయినప్పటికీ ఇంకా చాలా మంది ఆధార్ వివరాలను అప్​డేట్ చేసుకోలేదు. అందుకే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ ఉచిత అప్​డేట్​కు మరో 3 నెలల వరకు గడువు పొడిగించింది. అందువల్ల జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్​లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

సరైన క్రెడిట్ కార్డును ఎంచుకోవాలా? ఈ 5 టిప్స్​ పాటించండి!

మీకు ఇంటి మీద ఆదాయం వస్తోందా? కచ్చితంగా ఈ 'ట్యాక్స్'​ వివరాలు తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details