Date Of Birth Update In Aadhaar : భారత పౌరులకు ఆధార్ కార్డు ఒక నిత్యావసరంగా మారింది. ఆసుపత్రులు, రేషన్ దుకాణాలు, కాలేజీల వరకు, సిమ్ కార్డు తీసుకోవడం నుంచి బ్యాంక్ రుణం పొందడం వరకు ప్రతి దగ్గరా ఆధార్ కార్డు అవసరం ఉంటోంది. అందుకే ఆధార్ కార్డులోని వివరాలన్నీ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. పొరపాటున ఏవైనా తప్పులు ఉంటే, వాటిని సరిచేసుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.
ఒకే ఒక్క ఛాన్స్
2019లో ఆధార్ కార్డు సవరణలకు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకునే విషయంలో కొన్ని పరిమితులను విధించింది. దీని ప్రకారం, పుట్టిన తేదీని ఒకసారి మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. పాన్ కార్డు, జనన ధ్రువపత్రం, పాస్‌పోర్టు, బ్యాంక్ పాస్‌బుక్ లేదా మార్క్ షీట్లో, ఏదో ఒక పత్రాన్ని సమర్పించి పుట్టిన తేదీని మార్చుకోవచ్చు.
ఆధార్ కార్డ్‌లో పుట్టిన తేదీ ఎలా మార్చుకోవాలంటే?
How To Change Date Of Birth In Aadhar Card :
- మీ సమీపంలోని ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్‌కు వెళ్లి అక్కడ అప్డేట్/కరెక్షన్ ఫారమ్ తీసుకోవాలి.
- ఫారమ్‌లో మీరు అప్డేట్ చేయాలని అనుకుంటున్న పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి.
- దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా అందించాలి.
- బయోమెట్రిక్ వివరాలు అందించాలి.
- పుట్టిన తేదీ మార్చేందుకు రూ.50 రుసుము చెల్లించాలి.
- మీరు సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించి, ధ్రువీకరించుకున్నాక, మీ పుట్టిన తేదీని అప్డేట్ చేస్తారు.
- ఆధార్ కార్డులో మార్పుకోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఆధార్ కేంద్రం వాళ్లు మీకు ఒక స్లిప్ ఇస్తారు.
- ఈ స్లిప్‌లోని వివరాల సాయంతో మీ ఆధార్ అప్డేట్ను ట్రాక్ చేసుకోవచ్చు.
- మీ పుట్టిన తేదీ వివరాలు అప్డేట్ అయ్యాక, UIDAI వెబ్సైట్ నుంచి మీరే స్వయంగా ఆధార్ కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఆధారకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఉడాయ్ హెల్ప్‌లైన్ నంబర్ 1947ను సంప్రదించవచ్చు.
- లేదా help@uidai.gov.inకు మెయిల్ చేయవచ్చు.
అప్డేటెడ్ ఆధార్ కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోండిలా!
- ఆధార్ సెంటర్‌కు వెళ్లి, మీ ఫొటో, బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకున్న తరువాత, UIDAI అధికారిక పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.
- హోమ్ పేజ్‌లోని My Aadhar సెక్షన్లోకి వెళ్లాలి.
- Download Aadharపై క్లిక్ చేయాలి. తరువాత,
- ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ ఐడీ నమోదు చేయాలి.
- అక్కడ ఉన్న క్యాప్చాను కూడా ఎంటర్ చేయాలి.
- వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది.
- ఈ ఓటీపీని నమోదు చేసిన వెంటనే వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. తరువాత,
- మీ లేటెస్ట్ ఈ-ఆధార్ కార్డ్ కనిపిస్తుంది. దానిని సింపుల్‌గా డౌన్లోడ్ చేసుకోవాలి.