ETV Bharat / lifestyle

మీ పిల్లలు పాలు తాగట్లేదా? ఇలా చేస్తే గ్లాసు మొత్తం ఖాళీ చేసేస్తారట! - HOW TO MAKE MILK TASTY FOR KIDS

-పాలతో పిల్లల ఆరోగ్యం ఎంతో మెరుగు -మరి వారిని పాలు తాగించడం ఎలానో తెలుసా?

How to Make Milk Tasty for Kids
How to Make Milk Tasty for Kids (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : Jan 19, 2025, 1:20 PM IST

How to Make Milk Tasty for Kids: పిల్లలు పుట్టగానే అందుకునే మొట్టమొదటి ఆహారం పాలు. పసితనంలో తాగే తల్లిపాలు రుచితోపాటు వారి ఎదుగుదలకు కావాల్సిన పోషకాలన్నీ అందిస్తాయని నిపుణులు అంటున్నారు. కానీ పెరిగే క్రమంలో ఇచ్చే సాధారణ పాలు మాత్రం అంతగా రుచించక చాలామంది పిల్లలు పాలు తాగకుండా తల్లిని సతాయిస్తుంటారు. ఫలితంగా పాల ద్వారా శరీర ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు అందకుండా పోతాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి రోజూ పిల్లలకు పాలు తాగించాలని సూచిస్తున్నారు. ఇందుకోసం వారు తాగే పాలను మరింత రుచికరంగా తయారు చేయాలని సలహా ఇస్తున్నారు. అప్పుడే వారు మరింత ఇష్టంతో పాలు తాగుతారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పిల్లలకు రుచికరమైన పాలు అందించడమెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లల ఎదుగుదలకు ఎంతగానో సాయం చేసే పాలను వారు ఇష్టంగా తాగాలంటే రకరకాల పండ్లతో స్మూతీలు, మిల్క్‌షేక్స్‌ తయారు చేసి ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటి తయారీలో పండ్ల పరిమాణం కాస్త తక్కువగా, పాల పరిమాణం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఫలితంగా ఎక్కువ మొత్తంలో పాలు వారికి అందించవచ్చని అంటున్నారు. అలాగే ఎక్కువ తియ్యగా ఉంటే త్వరగా తాగుతారు కదాని చక్కెర మరీ అధికంగా వేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మొదట వారికి ఎక్కువ తీపితో అందించి.. తర్వాత క్రమంగా తీపి తగ్గిస్తే వారు పాలను తాగకపోవచ్చని వివరిస్తున్నారు. అలాగే అధిక చక్కెర వినియోగించడం వల్ల ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

బలవర్థకమైనవే
ఇంకా చాలామంది పిల్లలు కేవలం పాలు మాత్రమే ఇస్తే తాగేందుకు ఇష్టపడరు. అందులో బాదం, పిస్తా, కుంకుమపువ్వు, చాక్లెట్ వంటి ఫ్లేవర్లతో కూడిన శక్తిమంతమైన, రుచికరమైన పదార్థాల్ని కలిపితేనే తాగుతారు. కానీ, కొంతమంది తల్లులు మాత్రం వీటిని పాలలో కలపడం వల్ల పాల నాణ్యత దెబ్బతింటుందని అనుకుంటారు. కానీ రుచి కోసం పిల్లల పాలలో కలపడానికి ప్రత్యేకంగా తయారు చేసిన కొన్ని ఉత్పత్తులు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయని.. వాటిని ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు. ఇందుకోసం పోషకాహార నిపుణుల సలహా తీసుకుని రుచి కోసం పాలలో కలిపే సరైన పదార్థాల్ని ఎంచుకోవచ్చని వివరిస్తున్నారు. ఫలితంగా పిల్లలకు అందించే పాలు రుచిగా మారడమే కాకుండా అందులో ఉండే క్యాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు పిల్లలకు సమృద్ధిగా అందుతాయని అంటున్నారు.

వెన్నతో పాటే
వెన్నతో కూడిన పాలు చాలా రుచిగా ఉంటాయి. అయితే పిల్లలకు వీటిని నేరుగా ఇస్తే అందులోని కొవ్వులు శరీరంలోకి చేరి.. లేనిపోని సమస్యలకు దారితీస్తాయని వెన్న తొలగించి అందిస్తారు కొంతమంది తల్లులు. కానీ ఇలా వెన్న తీసేసిన పాలు పిల్లలకు అస్సలు రుచించవట. అందుకే పాలు ఇవ్వడం ప్రారంభించినప్పుడు వెన్నతోనే ఇస్తూనే.. క్రమంగా అందులోని వెన్న శాతాన్ని తగ్గిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా వారికి పాలు రుచించడంతో పాటు కొన్ని రోజుల తర్వాత వెన్న తొలగించిన పాలను తాగడానికి కూడా పిల్లలు అలవాటుపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఇవి కలపొచ్చు
ఇంకా పిల్లలు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తినడానికి ఇష్టపడే కార్న్‌ఫ్లేక్స్, చాకోస్ వంటివి నేరుగా అందించకుండా.. పాలలో కలిపి ఇవ్వడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల వాటిలోని రుచి పాలలోకి చేరి.. మరింత రుచిగా మారతాయని చెబుతున్నారు. ఫలితంగా వారు ఆ పదార్థాల్ని తిని, అలాగే పాలు కూడా తాగేస్తారని వివరిస్తున్నారు. ఇలా మీరు అందించే ఆహారంతో అటు పాలు తాగడం, ఇటు బ్రేక్‌ఫాస్ట్ చేయడం రెండూ పూర్తవుతాయని వెల్లడిస్తున్నారు. అలాగే ఓట్‌మీల్, పాస్తా వంటి పదార్థాల్లో నీళ్లకు బదులుగా పాలను ఎక్కువగా ఉపయోగించడం కూడా మంచిదేనని సలహా ఇస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ జుట్టు తత్వాన్ని బట్టే తలస్నానం చేయాలట- ఆ షాంపూలు వాడొద్దని నిపుణుల సలహా!

ఎనిమిదేళ్లకే జుట్టంతా రాలిపోతుందా? ఇలా ఎందుకు జరుగుతుంది? ఏం చేస్తే తగ్గుతుంది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.