తెలంగాణ

telangana

ETV Bharat / business

మీకు ఇంటి మీద ఆదాయం వస్తోందా? కచ్చితంగా ఈ 'ట్యాక్స్'​ వివరాలు తెలుసుకోండి!

Exemptions From Property Tax : మీకు సొంత ఇల్లు లేదా భూమి ఉందా? వాటి ద్వారా ప్రతినెలా ఆదాయం వస్తోందా? అయితే ఇది మీ కోసమే. హౌస్​ ప్రోపర్టీపై పన్నులను ఎలా లెక్కించాలి? ఐటీఆర్​ ఫైల్ చేసి, పన్ను మినహాయింపులు ఎలా పొందాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

How to calculate house property income
tax Exemptions From house Property income

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 1:14 PM IST

House Property Income Tax :మీరు మీ ఇంటిని రెంట్​కు లేదా లీజుకు ఇచ్చి ఆదాయం సంపాదిస్తున్నారా? అయితే ఇలా వచ్చిన రాబడిపై కచ్చితంగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం - భూమి, ఇల్లు, భవనం, కార్యాలయం, గోదాము లాంటి వాటన్నింటినీ 'హౌస్​ ప్రోపర్టీ'గానే పరిగణిస్తారు. కనుక వీటి నుంచి సంపాదించిన ఆదాయంపై పన్ను విధిస్తారు. కనుక ఇలాంటి స్థిరాస్తుల (హౌస్​ ప్రోపర్టీ)పై ఆదాయం సంపాదించే వారందరూ, ఐటీఆర్-1/ ఐటీఆర్-2/ ఐటీఆర్-3/ ఐటీఆర్-4 మొదలైన టాక్స్ రిటర్న్​లను దాఖలు చేయాల్సి ఉంటుంది.

హౌస్ ప్రోపర్టీ మీద వచ్చే ఆదాయం అంటే ఏంటి?
ఆదాయ పన్ను చట్టం ప్రకారం - ఇల్లు, భవనం, కార్యాలయం, గోదాము, స్థలాలను హౌస్​ ప్రోపర్టీగానే పరిగణిస్తారు. వీటిని అద్దెలకు, లీజులకు ఇచ్చి చాలా మంది ఆదాయం సంపాదిస్తూ ఉంటారు. కనుక ఈ రాబడిపై కచ్చితంగా ఇన్​కం టాక్స్ కట్టాల్సిందే. కానీ ఇక్కడ మూడు కండిషన్లు ఉన్నాయి. అవి ఏమిటంటే?

1. ప్రోపర్టీ అనేది బిల్డింగ్, ల్యాండ్ లేదా అపార్ట్​మెంట్​ అయి ఉండాలి.

2. పన్ను చెల్లింపుదారుడు సదరు ఆస్తికి యజమానిగా ఉండాలి.

3. ఆస్తిని వ్యాపారం లేదా వృత్తిపరమైన అవసరాలకు ఉపయోగించకూడదు.

ఈ నిబంధనలు అన్నీ అప్లై అయిన ఆస్తులపై వచ్చే ఆదాయాన్ని హౌస్ ప్రోపర్టీగా పరిగణిస్తారు.

హౌస్​ ప్రోపర్టీపై పన్నులు ఎలా లెక్కిస్తారంటే?
హౌస్​ ప్రోపర్టీని వివిధ రకాలుగా వర్గీకరిస్తారు. అవి : మీరు స్వయంగా నివాసం ఉంటున్న ఇల్లు, అద్దెకు ఇచ్చిన ఇల్లు, వారసత్వంగా మీకు లభించిన గృహం. వీటిపై విధించే ట్యాక్స్​లు భిన్నంగా ఉంటాయి.

1. లెట్- అవుట్ ప్రాపర్టీ :చాలా మంది తమ ఇంటిని ఇతరులకు రెంట్​కు ఇచ్చి, అద్దె రూపంలో ఆదాయం సంపాదిస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని లెట్​-అవుట్ ప్రాపర్టీ అంటారు.

2. స్వయంగా నివాసం ఉంటున్న ఇళ్లు :మీ ఇంట్లో మీరే నివసిస్తుంటే, అది స్వీయ ఆక్రమిత ఆస్తిగా పరిగణిస్తారు. వేరే ప్రదేశంలో ఉద్యోగం చేయడం లేదా వ్యాపారం చేస్తున్న కారణంగా మీరు అక్కడ నివసించలేకపోయినా, పన్ను ప్రయోజనాల కోసం మీరు దానిని స్వీయ ఆక్రమిత ఆస్తిగా చెప్పవచ్చు. ఆదాయపు పన్ను లెక్కల కోసం, మీరు రెండు ఇళ్లను సెల్ఫ్​-ఆక్యుపెయిడ్​ హౌసెస్​గా చెప్పవచ్చు.

డీమ్డ్ లెట్-అవుట్ ప్రాపర్టీ:వ్యక్తిగత ఉపయోగం కోసం మీరు రెండు ఇళ్లను కలిగి ఉండవచ్చు. అంత కంటే ఎక్కువ ఇళ్లు మీకు ఉంటే వాటిని డీమ్డ్​ లెట్-అవుట్ ప్రాపర్టీస్​గా పరిగణిస్తారు. వీటిపై మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.

మీరు మీ ఆదాయ పన్ను రిటర్న్ ఫారం నింపేటప్పుడు, మీ హౌస్​ ప్రోపర్టీ ఏ కేటగిరీలోకి వస్తుందో జాగ్రత్తగా చూసుకోవాలి. దీని వల్ల మీ ఆదాయాన్ని ఖచ్చితంగా నివేదించడానికి, సరైన పన్ను మినహాయింపులు పొందడానికి వీలవుతుంది.

'వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి నో ప్రమోషన్!'- ఐటీ కంపెనీ నయా షాక్!

దేశవ్యాప్తంగా పెట్రో ధరల్లో ఏపీ టాప్- పన్నుల బాదుడే కారణం- తెలంగాణ ర్యాంక్ ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details