తెలంగాణ

telangana

ETV Bharat / business

వర్క్​ ఫ్రమ్​ హోమ్​ చేస్తూ బాగా డబ్బులు సంపాదించాలా? ఈ ఫ్రీలాన్సింగ్ జాబ్స్‌ బెస్ట్ ఆప్షన్స్​! - HIGH PAYING FREELANCE JOBS

మీ దగ్గర మంచి టాలెంట్ ఉందా? ఈ ఫ్రీలాన్సింగ్ జాబ్స్‌ గురించి తెలుసుకోండి!

High Paying Freelance Jobs
High Paying Freelance Jobs (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 10 hours ago

High Paying Freelance Jobs :నేడు ఓ పక్క విద్యావంతుల సంఖ్య పెరుగుతుంటే, మరోవైపు నిరుద్యోగం అంత కంటే ఎక్కువగా పెరుగుతోంది. ఎంత తెలివి తేటలు ఉన్నప్పటికీ సరైన ఉద్యోగం దొరకడం లేదు. దీనితో ఆర్థికంగా చాలా ఇబ్బందిపడుతున్నారు. మరికొందరు తమ స్థాయి కంటే చాలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ బతుకీడుస్తున్నారు. కానీ వాస్తవానికి ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తరువాత, మనం మన ఇంట్లోనే ఉండి, ప్రపంచంలో ఎక్కడో ఉన్న ఏ కంపెనీకైనా లేదా క్లయింట్ కోసమైనా పని చేసి బాగా డబ్బులు సంపాదించవచ్చు. వీటినే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అంటారు. అందుకే ఈ ఆర్టికల్‌లో హై పేయింగ్‌ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ గురించి తెలుసుకుందాం.

  1. డేటా సైంటిస్ట్‌ : ప్రస్తుతం డేటా సైంటిస్ట్‌లు సంవత్సరానికి సుమారుగా రూ.14 లక్షలు - రూ.15 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వీరు చాలా వాస్ట్‌ డేటాను అనలైజ్‌ చేస్తారు. స్టాటిస్టికల్‌ మెథడ్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ ఉపయోగించి, టెక్ ఇండస్ట్రీ వాళ్లకు అవసరమైన ఇన్‌సైట్స్ ఇస్తారు.
  2. మొబైల్ యాప్‌ డెవలపర్‌ : ప్రస్తుతం యాప్ డెవలపర్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వీరు సంవత్సరానికి సుమారుగా రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వీరు ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ మొబైల్ యాప్స్‌ తయారు చేస్తారు.
  3. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్‌ :టెక్నాలజీ పెరుగుతున్న కొలదీ సైబర్ నేరగాళ్లు బాగా పెరిగిపోతున్నారు. వీరి ఆటకట్టించేవారే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్‌లు. వీరు స్కామర్ల నుంచి డిజిటల్ అసెట్స్‌ను రక్షిస్తూ ఉంటారు. అలాగే పెద్ద పెద్ద కంపెనీలకు చెందిన అతి సున్నితమైన, ముఖ్యమైన సమాచారం సైబర్ నేరస్థుల బారిన పడకుండా చూస్తారు. వీరు సంవత్సరానికి సుమారుగా రూ.5 లక్షలు - రూ.6 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వాస్తవానికిి ఈ పేమెంట్ ఇంకా చాలా ఎక్కువగానే ఉంటుంది.
  4. డిజిటల్ మార్కెటర్స్‌ : నేడు ఈ-కామర్స్ బిజినెస్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రజలు తమకు అవసరమైన వస్తు, సేవలను నేరుగా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. అందుకే డిజిటల్ మార్కెటర్స్‌కు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. వీరు సెర్చ్ ఇంజిన్ ఆప్టమైజేషన్‌ (ఎస్‌ఈవో), ఆన్‌లైన్ కాంపెయిన్స్‌, బ్రాండ్‌లకు సంబంధించిన సోషల్ మీడియా ప్రెజెన్స్‌ పెంచుతుంటారు. ప్రస్తుతం డిజిటల్ మార్కెటర్స్‌ నెలకు రూ.7 లక్షలు - రూ.8 లక్షలు వరకు సంపాదిస్తున్నారు.
  5. ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్ : ప్రస్తుతం చాలా మంది ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్‌, న్యూస్‌ పేపర్స్‌, మ్యాగజైన్స్‌కు కంటెంట్ రాస్తూ ఫ్రీలాన్స్‌ జర్నలిజం చేస్తున్నారు. వీరు సంవత్సరానికి సుమారుగా రూ.4 లక్షలు - రూ.5 లక్షల వరకు సంపాదిస్తున్నారు.
  6. కన్సల్టెంట్‌ : ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌, టెక్‌, ఫైనాన్స్‌ రంగాల్లో కన్సల్టెంట్‌లకు చాలా డిమాండ్ ఉంది. వీరు క్లయింట్లకు కావాల్సిన కీలకమైన సూచనలు, సలహాలు ఇస్తుంటారు. వీరు సంవత్సరానికి సుమారు రూ.10 లక్షల వరకు సంపాదిస్తున్నారు.
  7. వీడియో ఎడిటర్‌ :నేడు సోషల్ మీడియా ప్రాబల్యం విపరీతంగా పెరిగిపోయింది. ప్రజలు డిజిటల్ కంటెంట్‌ను, వీడియోలను విపరీతంగా చూస్తున్నారు. అందుకే వీడియో ఎడిటర్లకు బాగా పెరిగింది. ప్రస్తుతం ఒక సాధారణ వీడియో ఎడిటర్ సంవత్సరానికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సంపాదిస్తున్నారు. సినిమాలకు పనిచేసే వాళ్లకు అయితే భారీగా పేమెంట్స్ ఉంటున్నాయి.
  8. కంటెంట్ రైటర్‌ : కొంత మంది బాగా రాయగలిగేవారు వెబ్‌సైట్లు, బ్లాగ్స్‌కు ఆర్టికల్స్ రాస్తుంటారు. మరికొందరు మార్కెటింగ్ కోసం అవసరమైన మ్యాటర్ రాసిస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. కనుక బాగా రాయగలిగేవారు మంచి కంటెంట్ రైటర్‌గా రాణించే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సంపాదిస్తున్నారు.
  9. గ్రాఫిక్ డిజైనర్‌ : వీరు సంవత్సరానికి రూ.2.50 లక్షలు - రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వీరు వెబ్‌సైట్లు, బ్రాండ్లు, మార్కెటింగ్ కోసం విజువల్ కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు.

ABOUT THE AUTHOR

...view details