Hero Maverick 440 Launch : బైక్ ప్రియులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మేవ్రిక్ 440 బైక్‌ను ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటర్‌కార్ప్ లాంఛ్ చేసింది. హీరో వరల్డ్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఈ బైక్‌ను ఇది వరకే పరిచయం చేసింది. హీరో సంస్థ ఇప్పటి వరకు విడుదల చేసిన బైక్‌లలో అత్యంత ఖరీదైనది ఇదే.
Mavrick 440 Specifications And Features :
- హార్లే డేవిడ్సన్ తరహాలో ఇందులోనూ 440 సీసీ ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలెండర్ ఇంజిన్ ఉంది.
- ఈ బైక్‌లో 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.
- ఈ ఇంజిన్ 6000 rpm వద్ద 27 bhp పవర్, 4000 rpm వద్ద 36 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.
- సింగిల్ పీస్ లాంగ్ సీట్ ఉంటుంది.
- హెచ్ ఆకారంతో కూడిన ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉంటాయి.
- రెండు వైపులా డిస్క్‌బ్రేక్ ఉంటుంది.
- స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసేందుకు వీలుగా బ్లూటూత్ కనెక్టివిటీ
- బైక్ ముందువైపు 43mm టెలీస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది.
- ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 175mm ఉంది.
Mavrick 440 Price :ఈ మేవ్రిక్ 440 బైక్ ధర సుమారుగా రూ.1.99 లక్షల నుంచి రూ.2.24 లక్షల ప్రైస్ రేంజ్లో ఉంటుంది.