Gold Rate Today January 7th, 2025 :దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి రేట్లు భారీగా పెరిగాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.79,470 ఉండగా, మంగళవారం నాటికి రూ.20 పెరిగి రూ.79,490కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.90,020 ఉండగా, మంగళవారం నాటికి రూ.1,300 పెరిగి రూ.91,320గా ఉంది.
- Gold Price In Hyderabad January 7th, 2025 : హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.79,490గా ఉంది. కిలో వెండి ధర రూ.91,320గా ఉంది.
- Gold Price In Vijayawada January 7th, 2025 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.79,490గా ఉంది. కిలో వెండి ధర రూ.91,320గా ఉంది.
- Gold Price In Visakhapatnam January 7th, 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.79,490గా ఉంది. కిలో వెండి ధర రూ.91,320గా ఉంది.
- Gold Price In Proddatur January 7th, 2025 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.79,490గా ఉంది. కిలో వెండి ధర రూ.91,320గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price January 7th, 2025 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2,640 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 2 డాలర్లు తగ్గి 2,638డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.07 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ న్యూస్
Stock Market Today January 7th, 2025: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. వైరస్ ఆందోళనల మధ్య సోమవారం భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు, మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ లాభాలతో ప్రారంభం కావడం గమనార్హం. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్లూ- చిప్ స్టాక్స్ లాభాల్లోకి దూసుకెళ్తుండడం వల్ల మార్కెట్లకు మంచి ఊతం లభించింది.