Gold Rate Today April 9th 2024 :దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.73,555 ఉండగా, మంగళవారం నాటికి రూ.175 తగ్గి రూ.73,380కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.84,091 ఉండగా, మంగళవారం నాటికి రూ.66 తగ్గి రూ.84,025కు చేరుకుంది.
- Gold Price In Hyderabad April 9th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.73,380గా ఉంది. కిలో వెండి ధర రూ.84,025గా ఉంది.
- Gold Price In Vijayawada April 9th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.73,380గా ఉంది. కిలో వెండి ధర రూ.84,025గా ఉంది.
- Gold Price In Vishakhapatnam April 9th 2024 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.73,380గా ఉంది. కిలో వెండి ధర రూ.84,025గా ఉంది.
- Gold Price In Proddatur April 9th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.73,380గా ఉంది. కిలో వెండి ధర రూ.84,025గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price April 9th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,345 డాలర్లు ఉండగా, మంగళవారం కూడా అదే ధరలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 27.85 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News April 9th 2024 :మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మిశ్రమంగా కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.56,33,442 |
ఇథీరియం | రూ.2,74,500 |
టెథర్ | రూ.80.6 |
బైనాన్స్ కాయిన్ | రూ.47,505 |
సొలోనా | రూ.14,200 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today April 9th 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన సూచీలకు ఆరంభంలో దన్నుగా నిలిచాయి.
Stock Market Opening Bell : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 108 పాయింట్లు నష్టపోయి 74,118 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 54 పాయింట్లు కోల్పోయి 22,459 వద్ద కొనసాగుతోంది.