Global NCAP 5 Star Rating Cars : దేశంలో రోజురోజుకూ ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వెహికల్ సేఫ్టీ అనేది కీలకంగా మారింది. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్న కార్లను రూపొందిస్తున్నాయి. వాటిలో గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ పొందిన టాప్-5 ఇండియన్ కార్ల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
1. Tata Nexon :పెద్దలు, చిన్నపిల్లలు అందరూ సురక్షితంగా ప్రయాణించడానికి టాటా నెక్సాన్ కార్ చాలా బాగుంటుంది. అందుకే గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో ఇది 5-స్టార్ రేటింగ్ పొందింది. టాటా నెక్సాన్ అడల్ట్ ఆక్యుపెన్సీ టెస్ట్‌లో 32.22 పాయింట్లు, చైల్డ్ అక్యుపెన్సీ టెస్ట్‌లో 44.52 పాయింట్లు సాధించి 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. వాస్తవానికి 2018 సేఫర్ కార్స్ ఇండియా ఇనీషియోటివ్‌లో భాగంగా 5-స్టార్ రేటింగ్ సాధించిన తొలి మోడల్‌గా టాటా నెక్సాన్ నిలిచింది.
Tata Nexon Standard Safety Features :
- 6 ఎయిర్‌బ్యాగ్స్ (డ్యూయెల్ ఫ్రంట్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, సైడ్ ఎయిర్‌బ్యాగ్స్)
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ)
- ISOFIX యాంకరేజెస్
- సీట్ బెల్ట్ రిమైండర్
- రివర్స్ పార్కింగ్ సెన్సార్స్
- సెంట్రల్ లాకింగ్
- టైర్ ప్రెజర్ మోనిటర్
- 360 డిగ్రీ కెమెరా
- బ్లైండ్-వ్యూ మోనిటర్
- ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్
- రియర్‌వ్యూ కెమెరా
Tata Nexon Price :మార్కెట్లో ఈ టాటా నెక్సాన్ కారు ధర సుమారుగా రూ.8 లక్షలు - రూ.15.80 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
2. Kia Carens :ఈ కియా కెరెన్స్ కారుకు ఈ ఏడాదిలో రెండుసార్లు జీఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ నిర్వహించారు. మొదటిసారి చేసిన టెస్ట్‌లో అడల్డ్ ఆక్యుపెన్సీకి '0' రేటింగ్, చైల్డ్ ఆక్యుపెన్సీకి 4-స్టార్ రేటింగ్ వచ్చింది. దీనితో కియా కంపెనీ ఈ ఎంపీవీ కారులో పలు సేఫ్టీ ఫీచర్లను జోడించింది. దీనితో రెండోసారి చేసిన టెస్ట్‌లో ఈ కారు అడల్డ్ ఆక్యుపెన్సీలో 3-స్టార్ రేటింగ్, చైల్డ్ ఆక్యుపెన్సీకి 5-స్టార్ రేటింగ్ సంపాదించింది.
Kia Carens Safety Features :
- 6 ఎయిర్‌బ్యాగ్స్
- ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజెస్
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
- వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్
- ఏబీఎస్ విత్ ఈబీడీ,
- హిల్ అసిస్ట్ కంట్రోల్
- డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్
Kia Carens Price :మార్కెట్లో ఈ కియా కరెన్స్ కారు ధర సుమారుగా రూ.10.52 లక్షలు - రూ.19.94 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
3. Tata Safari :టాటా కార్స్ అంటేనే సేఫ్టీకి మారుపేరుగా చెప్పుకుంటారు. ఈ ఏడాది టాటా సఫారీ గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొందింది. ఈ కారులో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (ఏఈబీ), స్పీడ్ అసిస్టెన్స్ అండ్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ (బీఎస్‌డీ) లాంటి సేఫ్టీ సిస్టమ్స్ ఉన్నాయి. కుటుంబ భద్రతే ముఖ్యం అనుకునేవాళ్లకు ఈ టాటా సఫారీ కారు బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
Tata Safari Safety Features :
- 7 ఎయిర్‌బ్యాగ్స్ (ఫ్రంట్ డ్యూయెల్, డ్రైవర్ నీ, సైడ్ కర్టెన్, సైడ్ చెస్ట్ ఎయిర్‌బ్యాగ్స్)
- సీట్ బెల్ట్ రిమైండర్స్
- బెల్ట్ ప్రీ-టెన్షనర్స్
- బెల్ట్ బోల్ట్-లిమిటర్
- ISOFIX యాంకరేజెస్
- ఏడీఏఎస్ (అడిషనల్)