తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెరికాలో గూగుల్ పే బంద్! మరి భారత్​ సంగతేంటి? మన డబ్బు భద్రమేనా? - google Pay India

G Pay App Exit United States : ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్​ 'గూగుల్-పే' సేవలను అమెరికాలో నిలిపివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇందుకు కారణాలను వివరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే భారత్​లో 'గూగుల్-పే' యూజర్ల సంగతేంటి? గూగుల్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? మన డబ్బు సేఫేనా? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

G Pay App Exit United States
G Pay App Exit United States

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 6:10 PM IST

Updated : Feb 23, 2024, 6:26 PM IST

G Pay App Exit United States :ప్రస్తుతమున్న ఆన్​లైన్​ పేమెంట్​ యాప్స్​లో 'గూగుల్-పే' ముందువరుసలో ఉంటుంది. వినియోగదారులు సులభంగా ఉపయోగించేందుకు వీలుగా చాలా రకాల ఫీచర్లు ఈ యాప్​ అందిస్తోంది. ప్రస్తుతం 'గూగుల్-పే' 180 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే 'గూగుల్-పే' సేవలను అమెరికాలో 2024 జూన్​ 4 నుంచి నిలిపివేసేందుకు గూగుల్ సిద్ధమైంది. గూగుల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలేంటి? భారత్​ సహా ఇతర దేశాల్లో ఈ 'గూగుల్-పే' సేవలు ఉపయోగించుకునే యూజర్ల పరిస్థితేంటి? అని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కారణం అదే!
అమెరికా మార్కెట్​లో 'గూగుల్-పే' సేవలు నిలిపివేయడానికి, గూగుల్ సంస్థకు చెందిన 'గూగుల్ వాలెట్​' యాప్​ కారణం. ఈ వాలెట్​ను అమెరికా వాసులు విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ యాప్​ ద్వారా పేమెంట్ కార్డులు యాడ్​ చేసుకోవచ్చు. షాపింగ్​ చేసినప్పుడు 'ట్యాప్​ అండ్ పే' పద్ధతిలో సులువుగా పేమెంట్​ చేసుకోవచ్చు. అంతేకాకుండా ట్రాన్సిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు వంటి ఐడీ కార్డులతో సహా తదితర డిజిటల్ డాక్యుమెంట్లను ఈ గూగుల్ వాలెట్​లో పొందుపరుచుకోవచ్చు. ఇక ఈ వాలెట్ అమెరికా మార్కెట్​లో 'గూగుల్-పే' కన్నా ఐదు రెట్లు ప్రజాదరణ పొందింది. అంతేకాకుండా 'గూగుల్-పే'లో ఉన్న ఫీచర్లన్నీ ఈ వాలెట్​లో ఉన్నాయి. ఈ కారణాల వల్ల 'గూగుల్-పే'ను అమెరికాలో 2024 జూన్​ 4 నుంచి నిలిపివేస్తున్నట్లు గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. సేవలు పూర్తిగా నిలిపివేసేవరకు యూజర్లు 'గూగుల్-పే'ను అలాగే వినియోగించుకోవచ్చని తెలిపింది.

2024 జూన్​ 4 వరకు యూజర్లు వారి 'గూగుల్-పే' బ్యాలన్స్​ను చూసుకోవచ్చని, బ్యాంక్​కు ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చని వెల్లడించింది. ఇవే సేవలను గడువు తర్వాత గూగుల్ పే వెబ్​సైట్​ ద్వారా పొందవచ్చని చెప్పింది. 2024 జూన్​ 4 నాటికి అమెరికా వెర్షన్​ 'గూగుల్-పే' యాప్​లో యూజర్లు డబ్బులను సెండ్, రిక్వెస్ట్​ / రిసీవ్​ చేసుకోలేరని చెప్పింది. దీంతోపాటు వివిధ డీల్స్​ను యాక్టివేట్​ చేసుకోలేరని తెలిపింది.

భారత్​లో 'గూగుల్-పే' సంగతేంటి?
అయితే భారత్​, సింగపూర్​లో 'గూగుల్-పే' సేవల్లో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొంది. ఈ దేశాల్లో 'గూగుల్-పే' ఉపయోగించే లక్షలాది మంది యూజర్ల కోసం, ఆయా దేశాల ప్రత్యేక అవసరాల కోసం యాప్​ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపింది.

హ్యుందాయ్ క్రెటా ఎన్​ లైన్​ లాంఛ్ డేట్​ ఫిక్స్డ్​ - కియా & టయోటా కార్స్​ రీకాల్​ - ఎందుకంటే?

సైబర్ నేరగాళ్ల​​ నుంచి రక్షణ కావాలా? అయితే ఆ 'బీమా' తీసుకోవడం తప్పనిసరి!

Last Updated : Feb 23, 2024, 6:26 PM IST

ABOUT THE AUTHOR

...view details