Best Scooters Under 2 Lakh : మీ ఇంటిల్లపాదికీ ఉపయోగపడే మంచి స్కూటర్ కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.2 లక్షలు మాత్రమేనా? అయితే ఇది మీ కోసమే. రూ.2 లక్షల బడ్జెట్లో అదిరిపోయే డిజైన్‌తో, మంచి ఫీచర్స్, స్పెక్స్ కలిగి ఉండి, ఎక్కువ మైలేజ్/ రేంజ్ ఇచ్చే టాప్-10 స్కూటర్లపై ఓ లుక్కేద్దాం రండి.
1. TVS Jupiter : టీవీఎస్ కంపెనీకి చెందిన బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లలో జూపిటర్ ఒకటి. దీనిలో న్యూ హైబ్రిడ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది మంచి మైలేజ్‌ను, బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. ఇది 4 వేరియంట్లలో, 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- ఇంజిన్ : 113.3 సీసీ
- పవర్ : 8.02 పీఎస్
- టార్క్ : 9.8 ఎన్‌ఎమ్
- మైలేజ్ : 48 కి.మీ/ లీటర్
- కెర్బ్ వెయిట్ : 105 కేజీ
- బ్రేక్స్ : డ్రమ్
TVS Jupiter Price : మార్కెట్లో ఈ టీవీఎస్ జూపిటర్ ధర సుమారుగా రూ.74,691 - రూ.87,791 (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
2. Honda Activa 125 : ఫ్యామిలీ కోసం మంచి స్కూటర్ కొనాలని అనుకునేవారికి హోండా యాక్టివా 125 మంది ఛాయిస్ అవుతుంది. ఈ స్కూటీలో చాలా మంచి ఫీచర్లు ఉన్నాయి. ఇది 6 వేరియంట్లలో, 10 రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 123.92 సీసీ
- పవర్ : 8.42 పీఎస్
- టార్క్ : 10.5 ఎన్‌ఎమ్
- మైలేజ్ : 47 కి.మీ/ లీటర్
Honda Activa 125 Price : మార్కెట్లో ఈ హోండా యాక్టివా 125 ధర సుమారుగా రూ.94,422 - రూ.97,146 (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
3. Suzuki Access 125 : సుజుకి యాక్సెస్ 125 భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మొదటి ఐదు స్కూటర్లలో ఒకటి. అంతగా ఈ మోడల్ స్కూటీ పాపులర్ అయ్యింది. ఈ స్కూటీ 4 వేరియంట్లలో, 16 అందమైన రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ కెపాసిటీ : 124 సీసీ
- టార్క్ : 10 ఎన్ఎం
- కెర్బ్ వెయిట్ : 104 కేజీలు
- పవర్ : 8.7 పీఎస్
- మైలేజ్ : 45 కి.మీ/లీటర్
- బ్రేక్స్ : డ్రమ్
Suzuki Access 125 Price : మార్కెట్లో ఈ సుజుకి యాక్సెస్ 125 ధర సుమారుగా రూ.80,700 - రూ.91,800 (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
4. Ola S1 Pro : ఓలా ఎస్1 ప్రో సింగిల్ వేరియంట్, 5 కలర్స్‌లో లభిస్తుంది. ఎల్ఈడీ లైటింగ్, 7 అంగుళాల టచ్ స్క్రీన్ టీఎఫ్టీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. యాంటీ-థెఫ్ట్ అలర్ట్, జియో ఫెన్సింగ్, గెట్ హోమ్ మోడ్, రివర్స్ మోడ్, లింప్ హోమ్ మోడ్ లాంటి ఫీచర్లతో ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటీ లభిస్తుంది.
- రేంజ్ : 195 కి.మీ
- కెర్బ్ వెయిట్ : 116 కేజీలు
- యాక్సిలరేషన్ : 4.3 సెకన్లు
- బ్యాటరీ : 4 కిలోవాట్ అవర్స్
- టాప్ స్పీడ్ : 120 కి.మీ/ గంట
- బ్యాటరీ వారంటీ : 8 సంవత్సరాలు
Ola S1 Pro Price : మార్కెట్లో ఈ ఓలా ఎస్1 ప్రో ధర సుమారుగా రూ.1.35 లక్షలు (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
5. Bajaj Chetak : ఇండియాలోని మోస్ట్ పాపురల్ స్కూటీల్లో బజాజ్ చేతక్ ఒకటి. ఈ ఈవీ స్కూటర్ 3 వేరియంట్లలో, 5 కలర్స్‌లో లభిస్తుంది. బజాజ్ చేతక్ స్కూటీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 123 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు.
- ఛార్జింగ్ టైమ్ : 4 గంటలు
- బ్యాటరీ కెపాసిటీ : 2.88 కిలోవాట్ అవర్
- టాప్ స్పీడ్ : 63 కి.మీ/ గంట
- రేంజ్ : 123 కి.మీ
- కెర్బ్ వెయిట్ : 134 కేజీలు
- మోటార్ పవర్ : 4.2 కిలోవాట్
Bajaj Chetak Price : మార్కెట్లో ఈ బజాజ్ చేతక్ ధర సుమారుగా రూ.1.20 లక్షలు - రూ.1.32 లక్షలు (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
6. Hero Electric Optima : తక్కువ బడ్జెట్లో మంచి స్కూటీ కొనాలని అనుకునేవారికి హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా చాలా బాగుంటుంది. ఈ స్కూటీ 2 వేరియంట్లలో, 2 రంగుల్లో లభిస్తుంది.
- రేంజ్ : 89 కి.మీ/ఛార్జ్
- బ్యాటరీ కెపాసిటీ : 2 కిలోవాట్ అవర్స్
- కెర్బ్ వెయిట్ : 93 కేజీలు
- టాప్ స్పీడ్ : 48 కి.మీ/గంట
- బ్యాటరీ వారెంటీ : 4 సంవత్సరాలు
- మోటార్ పవర్ : 1.2 కిలోవాట్
Hero Electric Optima Price : మార్కెట్లో ఈ హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా ధర సుమారుగా రూ.83,300 - రూ.1.04 లక్షలు (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
7. Ather 450X : ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటీ 2 వేరియంట్లలో, 6 రంగుల్లో లభిస్తుంది. దీని డిజైన్ మంచి లుక్‌లో ఉంటుంది. ఆటో ఆఫ్టర్న్ ఇండికేటర్స్, గైడ్ మీ హోమ్ లైట్స్, లొకేషన్ ట్రాకింగ్, ట్రిప్ ప్లానర్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లతో ఈ బైక్ వస్తుంది.
- ఛార్జింగ్ టైమ్ : 6 గంటల 36 నిమిషాలు
- బ్యాటరీ కెపాసిటీ : 2.9 కిలోవాట్ అవర్
- టాప్ స్పీడ్ : 90 కి.మీ/ గంట
- రేంజ్ : 111 కి.మీ
- కెర్బ్ వెయిట్ : 108 కేజీలు
- బ్యాటరీ వారంటీ : 3 ఏళ్లు లేదా 30,000 కి.మీ
Ather 450X Price : మార్కెట్లో ఈ ఏథర్ 450ఎక్స్ ధర సుమారుగా రూ.1.43 లక్షలు - రూ.1.57 లక్షలు (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
8. Vespa VXL 125 : వెస్పా వీఎక్స్ఎల్ 125 స్కూటర్ 2 వేరియంట్లలో, 6 అందమైన రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అండర్ సీట్ స్టోరేజ్ ల్యాంప్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఈ స్కూటీలో ఉంటాయి.
- ఇంజిన్ కెపాసిటీ : 124.45 సీసీ
- టార్క్ : 10.11 ఎన్ఎం
- కెర్బ్ వెయిట్ : 115 కేజీలు
- పవర్ : 9.77 పీఎస్
- మైలేజ్ : 45 కి.మీ/లీటర్
- బ్రేక్స్ : డిస్క్
Vespa VXL 125 Price : మార్కెట్లో ఈ వెస్పా వీఎక్స్‌ఎల్ 125 ధర సుమారుగా రూ.1.31 లక్షలు - రూ.1.33 లక్షలు (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
9. Yamaha Aerox 155 : యమహా ఎయిరోక్స్ 155 అనేది ఒక మాక్సీ-స్టైల్ స్కూటర్. మంచి పవర్‌ఫుల్ స్కూటర్ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది 3 వేరియంట్లలో, 4 డిఫరెంట్ కలర్స్‌లో లభిస్తుంది.
- ఇంజిన్ : 155 సీసీ
- పవర్ : 15 పీఎస్
- టార్క్ : 13.9 ఎన్‌ఎమ్
- మైలేజ్ : 48.62 కి.మీ/ లీటర్
- కెర్బ్ వెయిట్ : 126 కేజీ
- బ్రేక్స్ : డిస్క్
Yamaha Aerox 155 Price : మార్కెట్లో ఈ యమహా ఏయిరోక్స్ 155 ధర సుమారుగా రూ.1.49 లక్షలు - రూ.1.51 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
10. Simple One : మంచి రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని అనుకునేవారికి సింపుల్ వన్ ఒకటి. ఈ స్కూటీ సింగిల్ వేరియంట్‌లో, 6 అందరమైన రంగుల్లో లభిస్తుంది.
- రైడింగ్ రేంజ్ : 212 కి.మీ
- టాప్ స్పీడ్ : 105 కి.మీ/గంట
- కెర్బ్ వెయిట్ : 137 కేజీ
- ఛార్జింగ్ టైమ్ : 4 గంటలు
- రేటెడ్ పవర్ : 4.5 కిలోవాట్స్
Simple One Price : మార్కెట్లో ఈ సింపుల్ వన్ ధర సుమారుగా రూ.1,66,142 (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
న్యూ ఇయర్‌కి కొత్త బైక్/ స్కూటీ కొనాలా? రూ.2లక్షల బడ్జెట్లోని టాప్-10 మోడల్స్ ఇవే!
న్యూ ఇయర్‌లో మంచి 7-సీటర్ కార్ కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్-6 మోడల్స్ ఇవే!