తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫిక్స్‌డ్ డిపాజిట్​పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే! మిగతా టాప్-6 ఏవంటే? - FIXED DEPOSIT INTEREST RATES

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకుల వివరాలు

Fixed Deposit Interest Rates
Fixed Deposit Interest Rates (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : 11 hours ago

Fixed Deposit Interest Rates In Banks :ఎన్ని పెట్టుబడి సాధనాలు ఉన్నా ఎటువంటి రిస్క్‌ లేకుండా రాబడి వస్తుందని చాలా మంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (FD)పైనే మక్కువ చూపుతారు. రిస్క్‌కు దూరంగా ఉండేవారికి, ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లకు మెరుగైన పెట్టుబడి ఎంపికగా కొనసాగుతున్నాయి. సాధారణ డిపాజిటర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లు 0.50% వరకు అదనపు వడ్డీ రేటును పొందొచ్చు. మార్కెట్‌ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా సీనియర్‌ సిటిజన్లు తమ పెట్టుబడి మొత్తాన్ని రక్షించుకోవడానికి ఎఫ్‌డీల మీదనే అధిక ఆసక్తి చూపుతారు. అదే సమయంలో బ్యాంకులు కూడా ఎఫ్‌డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందిస్తున్నాయి.

బ్యాంకుల వడ్డీ రేట్లలో వ్యత్యాసం పెద్దగా లేనప్పటికీ, 10-20 బేసిస్ పాయింట్ల చిన్న తేడా మొత్తం రాబడిలో గణనీయమైన వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు రూ.10 లక్షల ఎఫ్డీపై 20 బేసిస్ పాయింట్ల వ్యత్యాసంతో ఏడాదిలో రూ.2,000 అదనపు వడ్డీ లభిస్తుంది. మీరు డబ్బును మూడేళ్ల పాటు ఉంచితే, ఈ అదనపు ఆదా రూ.6,000లకు పెరుగుతుంది. డిపాజిట్ మరో రూ.10 లక్షలు పెరిగితే మొత్తం పొదుపు రూ.12,000కు పెరగవచ్చు. దీనికి కారణం అదనంగా లభించే 20 బేసిస్ పాయింట్ల వడ్డీ మాత్రమే. అందుకే బ్యాంకుల్లో ఎవరైనా ఎఫ్‌డీలు చేసే ముందు వడ్డీ రేట్లను సరిపోల్చుకోవడం ముఖ్యం. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ రేట్లు అందిస్తున్న టాప్​-7 బ్యాంకుల వివరాలు మీకోసం!

బ్యాంకు పేరు

సాధారణ పౌరులకు

ఇచ్చే వడ్డీ రేటు

సీనియర్ సిటిజన్లకు

ఇచ్చే వడ్డీ రేటు

హెచ్​డీ​ఎఫ్​​సీ బ్యాంక్ 7 7.5 ఐసీఐసీఐ బ్యాంక్ 7 7.5 యాక్సిస్ బ్యాంక్​ 7 7.75 యెస్ బ్యాంక్ 7.25 8 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.5 7.5 బ్యాంక్ ఆఫ్ బరోడా 6.8 7.4 పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.5 7
  • పైన అందించిన వివరాల ప్రకారం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ సాధారణ పౌరులకు, సీనియర్ సిటిజన్లకు ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతం, 7.5 శాతం వడ్డీని అందిస్తుంది.
  • ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఐదేళ్ల డిపాజిట్లపై అదే వడ్డీ రేట్లను అందిస్తుంది.
  • యాక్సిస్ బ్యాంక్ తన ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లపై సాధారణ, సీనియర్ సిటిజన్లకు 7 శాతం, 7.75 శాతం అందిస్తుంది.
  • యెస్ బ్యాంక్ సాధారణ పౌరులకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 8 శాతం అందిస్తుంది.
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు సంవత్సరాల FDలపై సాధారణ పౌరులకు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం అందిస్తుంది.
  • 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన రేట్ల ప్రకారం PNB సాధారణ పౌరులకు 6.5 శాతం సీనియర్ సిటిజన్లకు 7 శాతం అందిస్తుంది.
  • బ్యాంక్ ఆఫ్ బరోడా, సాధారణ పౌరులకు కొంచెం ఎక్కువ (6.8 శాతం), సీనియర్ సిటిజన్లకు 7.4 శాతం అందిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details