Types Of EPFO Pensions : ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కీలకంగా పని చేస్తోంది. ఉద్యోగులు తమ జీతంలో 12 శాతాన్ని ఈపీఎఫ్ఓ ఖాతాలో జమ చేస్తారు. కంపెనీ యజమాన్యం కూడా ప్రతి నెలా అంతే మొత్తాన్ని ఉద్యోగి ఖాతాలో డిపాజిట్ చేస్తుంది. ఇలా పోగైన డబ్బును ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్ రూపంలో అందిస్తారు. అయితే ఈపీఎఫ్ఓ 7 రకాల పెన్షన్లు అందిస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఈ ఆర్టికల్లో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
ఈపీఎఫ్ పింఛను పొందేందుకు అర్హతలు ఏమిటి?
ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు 58 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేస్తే వారు ఈపీఎఫ్ పెన్షన్ పొందేందుకు అర్హులు. అయితే ముందస్తు పెన్షన్ పొందడానికి కనీసం 50 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. లేదా 10 ఏళ్ల సర్వీసును పూర్తి చేయాలి. అయితే ఉద్యోగి సర్వీసు 10 ఏళ్లు లేకపోతే అతనికి పింఛను రాదా? భార్యా, పిల్లలు ఉన్న ఉద్యోగి 50 ఏళ్లలోపు మరణిస్తే వారికి పెన్షన్ అందుతుందా? ఇలాంటి అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. వాటికి సరైన సమాధానం ఇప్పుడు చూద్దాం.
1. సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ : 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి లేదా 58 ఏళ్లు నిండి రిటైర్ అయిన ఉద్యోగులకు ఈ పెన్షన్ అందిస్తారు.
2. ముందస్తు పింఛను : 50 ఏళ్లు పైబడినవారు, 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసినవారు ముందస్తు పెన్షన్పొందడానికి అర్హులు. కనుక ఈపీఎఫ్ చందాదారులు 50 ఏళ్ల నుంచే ముందస్తు పెన్షన్ను పొందొచ్చు. ముందస్తు పెన్షన్ విషయంలో చందాదారులు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. మీరు కనుక ముందస్తు పెన్షన్ను ఎంచుకుంటే, ప్రతి సంవత్సరం 4 శాతం తక్కువగా పెన్షన్ అందుకుంటారు. ఉదాహరణకు 58 ఏళ్లు నిండిన వారికి రూ.10వేలు పెన్షన్ అందుతుంది అనుకుందాం. అప్పుడు 57 ఏళ్లు ఉన్నవారికి రూ.9,600 మాత్రమే పెన్షన్ వస్తుంది. అంటే 4 శాతం పెన్షన్ తక్కువగా వస్తుంది. 56 ఏళ్ల వయస్సు ఉన్నవారికి అయితే రూ.9,216 మాత్రమే పెన్షన్ వస్తుంది. అంటే ఇతనికి వచ్చే పెన్షన్ మరో 4 శాతం తక్కువగా ఉంటుంది. ఈ విధంగా వివిధ వయస్సుల వారికి ఇచ్చే పెన్షన్ మారుతూ ఉంటుంది.
3. డిజేబుల్డ్ పెన్షన్ : తమ సర్వీస్ కాలంలో టెంపరరీగా లేదా శాశ్వతంగా అంగవైకల్యం పొందిన ఈపీఎఫ్ చందాదారులు పెన్షన్ పొందడానికి అర్హులు అవుతారు. ఈ పెన్షన్ తీసుకోవడానికి కనీస వయసు 50 ఏళ్లు లేదా 58 ఏళ్లు నిండి ఉండాల్సిన పనిలేదు. 10 ఏళ్ల సర్వీసు ఉండాల్సిన అవసరం లేదు. చందాదారుడు కేవలం ఒక నెల ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ చెల్లించినా ఈ డిజేబుల్డ్ పెన్షన్ పొందవచ్చు.