తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కావాలా? ఆ 'బీమా పాలసీ' తీసుకోవడం మస్ట్​! - Critical Illness Insurance Benefits

Critical Illness Insurance Benefits : నేటి ఆధునిక జీవన శైలి వల్ల ప్రాణాంతక వ్యాధులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్​, గుండె సమస్యలు, పక్షవాతం, కాలేయ వ్యాధులు లాంటివి బాగా ఎక్కువ అవుతున్నాయి. అందుకే ఇలాంటి వాటి చికిత్సకు తగిన పరిహారం అందించే బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

What is covered under critical illness insurance?
Benefits of Critical Illness Health Insurance (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 11:46 AM IST

Critical Illness Insurance Benefits : నేటి ఆధునిక జీవన శైలి మనుషుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా క్యాన్సర్​, గుండె జబ్బులు, పక్షవాతం, కాలేయ సమస్యలు లాంటి ప్రాణాంతక వ్యాధులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి ఇలాంటి తీవ్రవ్యాధుల బారిన మనం పడితే పరిస్థితి ఏమిటి? మన ప్రాణాలకు ముప్పు రావడం సహా, మనల్ని నమ్ముకున్న కుటుంబ సభ్యులపై మోయలేనంత ఆర్థిక భారం పడుతుంది. అందుకే ఇలాంటి వ్యాధులకు పరిహారం అందించే 'క్రిటికల్ ఇల్​నెస్ పాలసీలు' తీసుకోవడం ఎంతైనా అవసరం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

సాధారణ ఆరోగ్య బీమా పాలసీలు, ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నప్పుడు మాత్రమే ఉపయోగపడతాయి. ఆ తరువాత అయ్యే వైద్య ఖర్చులకు, ఇతర వ్యయాలకు అవి పరిహారం అందించవు. కనుక దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులు వచ్చినప్పుడు చికిత్సలకు అయ్యే ఆర్థిక వ్యయాలను అందించే క్రిటికల్ ఇల్​నెస్​ పాలసీలు తీసుకోవడం మంచిది.

ప్రయోజనాలు ఇవే!
ప్రాణాంతకమైన, దీర్ఘకాలిక వ్యాధులను ప్రాథమికంగా నిర్ధరించినప్పుడు, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీలు, పాలసీదారులకు పరిహారం అందిస్తాయి. వాస్తవానికి ఇవి ఒకేసారి పాలసీ మొత్తాన్ని చెల్లిస్తాయి. ఈ క్రిటికల్ ఇల్​నెస్​ పాలసీలు కనీసం రూ.5 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. బీమా సంస్థలను బట్టి గరిష్ఠ పరిమితి అనేది మారుతూ ఉంటుంది. ఈ పాలసీలు అందించే పరిహారంతో, ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక అయ్యే వైద్య ఖర్చులను, ఇతర వ్యయాలను తట్టుకునేందుకు వీలవుతుంది.

వ్యాధులు - విభాగాలు
సాధారణంగా ఇన్సూరెన్స్​ కంపెనీలు తీవ్ర వ్యాధులను కొన్ని విభాగాలుగా వర్గీకరిస్తాయి. ఒక్కో విభాగం కింద 100% వరకు బీమా మొత్తాన్ని క్లెయిమ్​ చేసుకోవచ్చు. క్యాన్సర్, గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు ఇలా ఒక్కో వ్యాధికంటూ ప్రత్యేకంగా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీలు ఉంటాయి. అయితే ఈ పాలసీలు తీసుకునేటప్పుడు, ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి, మీకు ఏది అనుకూలంగా ఉంటుందో, అదే తీసుకోవాలి.

క్రిటికల్ ఇల్​నెస్ పాలసీలు ఎప్పుడు తీసుకోవాలి?

  • కుటుంబంలో వంశపారంపర్య వ్యాధులు ఉంటే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీని తప్పనిసరిగా తీసుకోవడం మంచిది. ఒత్తిడితో కూడిన పని వాతావరణంలో ఉన్నవారు కూడా వీటిని తీసుకోవాలి.
  • సాధారణ ఆరోగ్య బీమా పాలసీలు ఉన్నప్పటికీ, క్రిటికల్ ఇల్​నెస్ పాలసీలు తీసుకోవడం ఎంతైనా మంచిది. ఎందుకంటే, క్లిష్టమైన, దీర్ఘకాలిక వ్యాధులకు ఎప్పుడూ చికిత్స తీసుకుంటూనే ఉండాలి. ఇలాంటప్పుడు ఈ పాలసీలు కచ్చితంగా తోడ్పడతాయి.
  • తీవ్ర, ప్రాణాంతక వ్యాధులకు వర్తించే పాలసీలకు తక్కువ నిరీక్షణ (వెయిటింగ్ పీరియడ్​) సమయం ఉంటుంది. నేడు చాలా బీమా సంస్థలు పాలసీ తీసుకున్న 90 రోజుల నుంచే అన్ని విభాగాల్లోని వ్యాధులకు పరిహారం చెల్లిస్తున్నాయి.

షరతులు వర్తిస్తాయి!
బీమా సంస్థలు క్రిటికల్ ఇల్​నెస్ పాలసీలు ఇచ్చేటప్పుడు కొన్ని షరతులు కూడా విధిస్తాయి. వీటిని ఉల్లంఘిస్తే, మీకు పరిహారం లభించదు. అందుకే పాలసీ తీసుకునేటప్పుడు కచ్చితంగా మీ ఆరోగ్య వివరాలు, ఉద్యోగం/పని, ఇతర అంశాలను చెప్పాలి. దీని వల్ల కాస్త అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయినా ఫర్వాలేదు, చెప్పడమే మంచిది. ఎందుకంటే, పాలసీని క్లెయిం చేసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం ఇవ్వకపోతే, అప్పుడు మీరే చిక్కుల్లో పడతారు.

హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్​!
సాధారణహెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండడం ఎప్పుడూ అవసరమే. కానీ తీవ్రమైన, దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులు వచ్చినప్పుడు, మనం, మన కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ఉండాలంటే, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ఇన్సూరెన్స్ పాలసీ​ తీసుకోవడమే ఉత్తమం.

TCS షేర్​ హోల్డర్స్​కు గుడ్​ న్యూస్​- ఈసారి డివిడెండ్​ ఎంతో తెలుసా?

UPI PIN మర్చిపోయారా? ఈ సింపుల్ స్టెప్స్​తో రీసెట్​ చేయండిలా! - How To Reset UPI Pin

ABOUT THE AUTHOR

...view details