తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ కారును దొంగలు ఎత్తుకెళ్తే ఏం చేయాలి? - ఇలా చేశారంటే మొత్తం సొమ్ము పొందొచ్చు! - CAR THEFT INSURANCE - CAR THEFT INSURANCE

Car Theft Insurance : ప్రస్తుతం కార్ల వినియోగం విపరీతంగా పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని కంపెనీలూ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త కార్లను మార్కెట్​లోకి తీసుకొస్తున్నాయి. అయితే, ఎంత టెక్నాలజీతో వచ్చినా కార్ల దొంగతనాలు ఆగట్లేదు. అయితే, మీ కారు చోరీకి గురైనా ఇలా చేశారంటే.. దానికి సంబంధించిన మొత్తం సొమ్ము మీకు వచ్చేస్తుంది! ఎలాగో తెలుసా??

Car Theft Insurance
Car Theft Insurance

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 7:00 AM IST

Car Comprehensive Insurance Benefits : అత్యాధునిక టెక్నాలజీ, యాంటీ థెప్ట్ అలారం వంటి సదుపాయాలతో వస్తున్న కొత్త కార్లను లక్షలు పెట్టి కొంటున్నారు జనం. కానీ.. అవి 100 సేఫ్​గా ఉంటాయా అంటే.. 'నో' అనే మాటే వినిపిస్తోంది. ఎందుకంటే.. పెరిగిన టెక్నాలజీకి అనుగుణంగా దొంగలూ చాకచాక్యంగా వ్యవహరిస్తూ పార్క్​ చేసిన కార్లను ఈజీగా ఎత్తుకెళ్లిపోతున్నారు. పలు నివేదికల్లో వెల్లడైన సమాచారం ప్రకారం.. గత ఏడాది మన దేశంలోనే కార్లు(Cars) ఎక్కువగా దొంగతనానికి గురయ్యాయట. మరి.. ఇలా కారు చోరీకి గురైతే పరిస్థితి ఏంటి? అంటే.. టెన్షన్ అవసరం లేదు అంటున్నారు నిపుణులు. కొన్ని పనులు చేస్తే మొత్తం సొమ్మును బీమా ద్వారా పొందవచ్చంటున్నారు. అదేలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మీరు కొన్న కొత్త కారు చోరీకి గురైనా ఎలాంటి నష్టాన్ని ఎదుర్కోవద్దంటే.. కారు కొనేటప్పుడు కచ్చితంగా దానికి ఇన్సూరెన్స్ చేయించాలంటున్నారు నిపుణులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఏ వాహనానికైనా థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా ఉండాలి. అయితే, ప్రస్తుతం మోటారు వాహనాల చట్టం ప్రకారం.. నష్ట బీమా, సమగ్ర బీమా అనే రెండు రకాల ఇన్సూరెన్స్​లు ఉన్నాయి.

వీటిలో వాహనానికి తప్పనిసరిగా ఉండాలనే.. థర్డ్​ పార్టీ బీమా ఇన్సూరెన్స్​లు సహా మరికొన్ని రకాల బీమాలు నష్ట బీమా కిందకు వస్తాయి. ఈ బీమా కవరేజీ ఉన్న కారు వ్యక్తిని గాయపరిచినా, మరణించినా, ఆస్తికి నష్టం కలిగించినా.. ఆ సందర్భాల్లో కారు యజమాని చెల్లించాల్సిన ఆర్థిక నష్టానికి థర్డ్‌ పార్టీ ఇన్సరెన్స్‌ బాధ్యత వహిస్తుందంటున్నారు నిపుణులు. అంతేకానీ, కారు సొంత నష్టాన్ని చవి చూస్తే దానికి థర్డ్‌-పార్టీ బీమా ద్వారా ఎలాంటి కవరేజీ ఉండదనే విషయాన్ని వాహనదారులు గుర్తుంచుకోవాలంటున్నారు.

అదే.. మీరు కారు కొనుగోలు చేసేటప్పుడు సమగ్ర బీమాను సెలెక్ట్ చేసుకున్నారంటే.. అది కారు యాజమానిని ఆర్థికంగా కాపాడడమే కాకుండా.. కారు చోరీకి గురైనా ఎలాంటి నష్టమూ ఎదుర్కోకుండా మొత్తం బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అందుకే చాలా మంది సమగ్ర బీమా కవరేజ్ ఎంచుకుంటారని నిపుణులు అంటున్నారు. అయితే, సమగ్ర బీమా ఉండి.. కారు చోరీకి గురైతే ఏవిధంగా మొత్తం సొమ్మును క్లెయిమ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మీ కార్ ఇన్సూరెన్స్ ఎక్స్​పైర్ అయ్యిందా? సింపుల్​గా రెన్యువల్ చేసుకోండిలా!

సమగ్ర బీమా(Comprehensive Insurance) కింద మీరు కారును ఇన్సూర్ చేసినట్లయితే.. మీ వెహికల్ చోరీకి గురైన తర్వాత పోలీసు కేసు పెట్టాలి. దీంతో.. పోలీసులు మీ కారును గుర్తించడానికి చర్యలు చేపడతారు. ఒకవేళ.. మీ కారును పోలీసులు గుర్తించలేకపోతే, దానికి సంబంధించిన ప్రూఫ్​ను మీకు ఇస్తారు. దాంతో మీరు కారుకు సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్మును క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇలా మీరు క్లెయిమ్ చేసినప్పుడు సమగ్ర బీమాలో మీకు కేటాయించిన పూర్తి మొత్తాన్నీ పొందుతారని చెబుతున్నారు.

అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. సమగ్ర బీమా తీసుకునేటప్పుడు మీరు కనుక 'ఇన్‌వాయిస్ రిటర్న్' ఎంచుకుంటే మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అంటే.. మీరు కారు తీసుకునేటప్పుడు మీకు జారీ చేసిన 'ఇన్‌వాయిస్‌'లో పేర్కొన్న మొత్తానికి సమగ్ర బీమాను సంస్థ అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా మీరు కారు చోరీ లేదా ఏదైనా ప్రమాదాలకు గురైనప్పుడు మీకు ఎలాంటి నష్టమూ కలగకుండా మీరు ఇన్‌వాయిస్‌లో పేర్కొన్న మొత్తాన్ని రిటర్న్ పొందవచ్చంటున్నారు.

కాబట్టి.. మీ కారు చోరీకి గురైనా ఆర్థికంగా నష్టపోకుండా, బాధపడకుండా ఉండాలంటే.. కారు కొనేటప్పుడు సమగ్ర బీమాను ఎంచుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఆ టైమ్​లో 'రిట్టర్ ఆఫ్ ఇన్‌వాయిస్'ను సెలక్ట్ చేసుకోవడం.. వాహన బీమాలో బెస్ట్ ఆప్షన్​గా గుర్తుంచుకోవాలంటున్నారు. అయితే.. దీనికి ఇన్సూరెన్స్‌ ప్రీమియం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

ఎండా కాలంలో మీ వాహనం భద్రమేనా? - ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా? - లేదంటే ప్రమాదం గ్యారెంటీ!

ABOUT THE AUTHOR

...view details