Car AC Maintenance Tips :ఈ ఏడాది సమ్మర్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోత, వడగాలులు, ఎండవేడి కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో పని మీద బయటకు వెళ్లిన వారు అధిక ఉష్ణోగ్రతలతో పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. కారులో ట్రిప్‌కు వెళ్లినవారు కూడా ఏసీ సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏసీ ఎంత పెంచినా కానీ, కారు క్యాబిన్లో ఉక్కపోతగానే ఉంటోందని కొంత మంది చెబుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి కొన్నిటిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో మీకు తెలుసా?
ఈ టిప్స్ పాటించండి :
- మీరు కారులో ఎక్కడికైనా వెళ్లినప్పుడు వీలైనంత వరకూ కారును చెట్టు నీడలో లేదా ఏదైనా నీడ ఉండే ప్రదేశంలో పార్క్ చేయండి.
- ఎందుకంటే ఎండలో కారును పార్క్ చేస్తే మీరు కారులో ఎంత ఏసీ పెంచుకున్నా కూడా వేడిగానే ఉంటుంది.
- అలాగే కారులో ప్రయాణించే ముందు డోర్‌లు అన్ని ఒక రెండు నిమిషాలు ఓపెన్ చేయండి. ఒకవేళ మీ కారుకు సన్‌రూఫ్ ఉంటే దానిని కూడా ఓపెన్ చేయండి.
- ఇలా చేయడం వల్ల లోపల ఉన్న వేడి మొత్తం బయటకు వెళ్తుంది. తర్వాత ఏసీ వేసుకుని హాయిగా ఉండవచ్చు.
- ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల సన్‌షేడ్స్ లేదా విండో విజర్లు దొరుకుతున్నాయి. వీటిని మీరు జర్నీలో ఉన్నప్పుడు ఉపయోగించండి.
- దీనివల్ల సూర్యకిరణాలు లోపలికి రావు. కాబట్టి, కారు లోపల క్యాబిన్ కూల్‌గా ఉంటుందని నిపుణులంటున్నారు.
- కారులో మీరు ఒక్కరే ప్రయాణిస్తున్నప్పుడు ఏసీ వెంట్లు మీ వైపే ఉండేలా సెట్ చేసుకోండి.