Buying Gold With A Credit Card For Reward Points Right Or Wrong : ఆకాశమే హద్దుగా పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.72 వేలకు చేరువలోకి వచ్చేసింది. అయితే భారతీయులకు బంగారం అంటే ఎనలేని మక్కువ. అందుకే ఇంట్లో జరిగే వివాహాది శుభాకార్యాలకు, పండుగలకు పసిడి ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. కానీ నేడు ధరలు పెరుగుతుండడం వల్ల, బంగారం కొనుగోలు చేయాలంటే సామాన్యులు జంకుతున్నారు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టి కొనడం ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది. అందుకే చాలా మంది క్రెడిట్ కార్డు ఉపయోగించి, నెలవారీగా ఈఎంఐల రూపంలో బిల్లులు చెల్లిస్తూ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలా క్రెడిట్ కార్డు ఉపయోగించి బంగారం కొనడం సురక్షితమేనా?
క్రెడిట్ కార్డుతో బంగారం కొనుగోళ్లు!
క్రెడిట్ కార్డు ఉపయోగించి ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించలేనివారు ఈఎంఐ పద్ధతిలోనూ గోల్డ్ కొనవచ్చు. అయితే క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నప్పుడు, కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
వడ్డీ రేటు :క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించాలి. లేకపోతే అధిక వడ్డీ రేట్లు చెల్లించాల్సి వస్తుంది. అందుకే బంగారం కొనుగోలు చేసే ముందు, మీ క్రెడిట్ కార్డ్‌పై వసూలు చేసే వడ్డీ రేట్ల గురించి పూర్తిగా తెలుసుకోండి.
క్రెడిట్ పరిమితి :మీ క్రెడిట్ కార్డుకు బంగారం కొనడానికి తగినంత క్రెడిట్ లిమిట్ ఉందో, లేదో చెక్ చేసుకోండి. మరీ ముఖ్యంగా మీ క్రెడిట్ కార్డ్ లిమిట్లో కేవలం 30 శాతం వరకే వాడుకోండి.