BSNL 395 Days Plan :ప్రభుత్వరంగ టెలికాం సంస్థబీఎస్‌ఎన్‌ఎల్ (BSNL)కస్టమర్లను ఆకర్షించేందుకు 395 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్‌ను తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైన బీఎస్‌ఎన్‌ఎల్, కొత్త యూజర్లను ఆకర్షించేందుకే ఈ 13 నెలల ప్లాన్‌ను లాంఛ్ చేసింది.
జియో, ఎయిర్‌టెల్ మొదలైన ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్‌లను పెంచిన నేపథ్యంలో, చాలా మంది యూజర్లు ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్లపై దృష్టి సారిస్తున్నారు. దీనినే ఆసరాగా చేసుకుని, తాజాగా 395 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకువచ్చింది. మరెందుకు ఆలస్యం ఈ ప్లాన్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
BSNL 395 Days Plan Benefits :
- వ్యాలిడిటీ - 395 రోజులు
- డేటా - రోజుకు 2జీబీ
- ఎస్ఎంఎస్లు - రోజుకు 100
- అపరిమిత కాలింగ్
- దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్
- జింగ్ మ్యూజిక్, బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్
- హర్డీ గేమ్స్, ఛాలెంజర్ అరీనా గేమ్స్, గేమ్‌ఆన్ ఆస్ట్రోటెల్
- ప్లాన్ ధర రూ.2,399
BSNL 365 Days Plan Benefits
బీఎస్‌ఎన్‌ఎల్ 365 రోజుల (ఒక సంవత్సరం) వ్యాలిడిటీతో మరొక ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా రోజువారీ పరిమితి లేకుండా 600 జీబీ డేటాను అందిస్తోంది. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉంటాయి. అపరిమిత కాలింగ్ సౌలభ్యం ఉంటుంది. ఈ ప్లాన్‌లోనూ జింగ్ మ్యూజిక్, బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్, హర్డీ గేమ్స్, ఛాలెంజర్ అరీనా గేమ్స్, గేమ్‌ఆన్ ఆస్ట్రోటెల్ వంటి అదనపు ప్రయోజనాలు ఉంటాయి.
రిలయన్స్ జియో తమ మొబైల్ సేవల టారిఫ్‌లను 12-27 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. ఈ పెంచిన రేట్లు జులై 3 నుంచి అమల్లోకి వచ్చాయి. దీనితో జియో బాటలోనే భారతీ ఎయిర్‌టెల్ తమ మొబైల్ సేవల టారిఫ్‌లను 10-21 శాతం వరకు పెంచింది. వొడాఫోన్ ఐడియా కూడా తమ మొబైల్ టారిఫ్‌లను జులై 4 నుంచి 11-24 శాతం వరకు పెంచింది. ఈ నేపథ్యంలోనే పలువురు యూజర్లు తక్కువ ధరకే మంచి బెనిఫిట్స్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం చూస్తున్నారు. అందుకే ఇలాంటి వారిని ఆకర్షించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా 395 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను తీసుకువచ్చింది.
SBI షాకింగ్ న్యూస్ - సడెన్‌గా వడ్డీ రేట్లు పెంపు - ఇకపై మరింత ప్రియంకానున్న లోన్స్! - SBI Raises Lending Rates
జొమాటో & స్విగ్గీ ప్లాట్‌ఫామ్ ఫీజులు పెంపు - హైదరాబాద్‌లో ఎంతంటే? - Zomato Swiggy Raise Platform Fee