తెలంగాణ

telangana

ETV Bharat / business

BSNL బంపర్ ఆఫర్​​ - ఇలా చేస్తే 3 నెలలు బ్రాడ్​బ్యాండ్ ఫ్రీ! - BSNL FESTIVE OFFER

BSNL యూజర్లకు గుడ్​ న్యూస్​​ - ఆ రీఛార్జ్ ప్లాన్స్​పై ఫ్రీ ఇంటర్నెట్​ - మరికొద్ది రోజులే ఛాన్స్​!

BSNL
BSNL (IANS)

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2024, 5:25 PM IST

BSNL Festive Offer : బీఎన్​ఎన్​ఎల్​ వినియోగదారులకు గుడ్ న్యూస్​. ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ తమ యూజర్ల కోసం మంచి ఫెస్టివ్ ఆఫర్ ప్రకటించింది. రూ.500 లేదా అంత కంటే తక్కువ ధర ఉండే రీఛార్జ్ ప్లాన్స్​ సబ్​స్క్రైబ్ చేసుకుంటే, నెల రోజుల పాటు పూర్తి ఉచితంగా ఇంటర్నెట్ అందిస్తోంది. అయితే ఈ బంపర్ ఆఫర్​ 2024 డిసెంబర్​ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరెందుకు ఆ ఆలస్యం ఈ ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.

బ్రాడ్​బ్యాండ్​ ప్లాన్స్​
బీఎస్​ఎన్​ఎల్​ వాస్తవానికి కొన్ని ఎంపిక చేసిన బ్రాడ్​బ్యాండ్ ప్లాన్స్​పై ఫెస్టివ్ ఆఫర్​ కింద ఒక నెల రోజులపాటు పూర్తి ఉచితంగా ఇంటర్నెట్ అందించనుంది. అంటే అత్యంత తక్కువ ధరకే హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని తమ యూజర్లకు అందించనుంది. దీని ద్వారా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న​ జియో, ఎయిర్​టెల్​, వీఐ లాంటి టాప్​ టెలికాం కంపెనీలకు బీఎస్​ఎన్​ఎల్​ గట్టి ఛాలెంజ్ విసిరినట్లు అయ్యింది.

BSNL Fiber Neo Plan :బీఎస్​ఎన్​ఎల్​ ఫైబర్ నియో ప్లాన్​ ధర రూ.499. ఈ ప్లాన్​ను సబ్​స్క్రైబ్ చేసుకున్న యూజర్లకు ఒక నెల రోజులపాటు 3.3 టీబీ (3300 జీబీ) హై-స్పీడ్ ఇంటర్నెట్​ పూర్తి ఉచితంగా అందిస్తారు. 30Mbps స్పీడ్​తో వచ్చే ఈ ఇంటర్నెట్​ - బ్రౌజింగ్ చేయడానికి, వీడియో స్ట్రీమింగ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ డేటా లిమిట్ అయిపోయిన తరువాత 4 Mbps స్పీడ్​తో ఇంటర్నెట్​ వాడుకోవచ్చు. ఆన్​లైన్ క్లాసులు, వీడియో స్ట్రీమింగ్, రిమోట్ వర్కింగ్ చేసేవారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ తీసుకున్నవారు అన్​లిమిటెడ్ కాల్స్​ చేసుకోవచ్చు. అంతేకాదు 3 నెలల సబ్​స్క్రిప్షన్ తీసుకుంటే రూ.50 వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

BSNL Fiber Basic Plan : ఈ ప్లాన్​లో 50Mbps స్పీడ్​తో 3.3 టీబీ ఫ్రీ మంత్లీ డేటా ఇస్తారు. ఈ డేటా లిమిట్ అయిపోయిన తరువాత 4 Mbps స్పీడ్​తో ఇంటర్నెట్​ వాడుకోవచ్చు. 3నెలల సబ్​స్క్రిప్షన్ తీసుకుంటే రూ.100 వరకు డిస్కౌంట్ ఇస్తారు. మల్టీ టాస్కింగ్, గేమింగ్​, హెవీ స్ట్రీమింగ్ చేసేవారికి ఈ ప్లాన్ చాలా బాగుంటుంది.

ABOUT THE AUTHOR

...view details