తెలంగాణ

telangana

ETV Bharat / business

2025లోని స్టాక్ మార్కెట్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - STOCK MARKET HOLIDAYS IN 2025

2025లో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్ఈ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే!

BSE & NSE
BSE & NSE (ANI)

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2024, 4:05 PM IST

Stock Market Holidays In 2025 : మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే. 2025లో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్‌ (BSE), జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ (NSE)లకు శని, ఆదివారాలు కాకుండా, మరో 14 రోజులపాటు సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని పండుగలు, ప్రాంతీయ, జాతీయ సెలవులు ఉంటాయి. స్టాక్ మార్కెట్‌ ట్రేడింగ్ చేసేవారు, ఈ సెలవుల జాబితా గురించి తెలుసుకోవడం వల్ల తమ పెట్టుబడి వ్యూహాలను చక్కగా మెరుగుపరుచుకోవడానికి వీలవుతుంది.

Stock Market Holidays List In 2025

  • ఫిబ్రవరి 26(బుధవారం) : మహాశివరాత్రి
  • మార్చి 14 (శుక్రవారం) : హోలీ
  • మార్చి 31 (సోమవారం) : ఈద్‌-ఉల్‌-ఫితర్‌ (రంజాన్‌)
  • ఏప్రిల్ 10 (గురువారం) : శ్రీ మహవీర్‌ జయంతి
  • ఏప్రిల్ 14(సోమవారం) : డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి
  • ఏప్రిల్‌ 18 (శుక్రవారం) : గుడ్‌ ఫ్రైడే
  • మే 1(గురువారం) : మహారాష్ట్ర డే
  • ఆగస్టు 15 (శుక్రవారం) : భారత స్వాతంత్ర్యం దినోత్సవం
  • ఆగస్టు 27(బుధవారం) : వినాయక చవితి
  • అక్టోబర్‌ 2 (గురువారం) : మహాత్మా గాంధీ జయంతి/ దసరా
  • అక్టోబర్ 21(మంగళవారం) : దీపావళి లక్ష్మీ పూజ
  • అక్టోబర్ 22 (బుధవారం) : దీపావళి బలిప్రతిపాద
  • నవంబర్‌ 5 (బుధవారం) : ప్రకాశ్ గురుపూర్బ్‌ శ్రీ గురునానక్ దేవ్‌
  • డిసెంబర్‌ 25 (గురువారం) : క్రిస్మస్‌

2025లో శని, ఆదివారాల్లో వచ్చిన పండుగలు

  • జనవరి 26 (ఆదివారం) : గణతంత్ర దినోత్సవం
  • ఏప్రిల్ 6 (ఆదివారం) : శ్రీరామ నవమి
  • జూన్‌ 7(శనివారం) : బక్రీద్‌
  • జులై 6 (ఆదివారం) : మొహర్రం

మూరత్ ట్రేడింగ్ :2025 అక్టోబర్‌ 21న దీపావళి ఉంది. ఆ రోజున మూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. స్టాక్ ఎక్స్ఛేంజీలు ఈ మూరత్‌ టైమింగ్స్‌ను నిర్ణయించి చెబుతాయి.

నోట్‌ : జనవరి, జూన్‌, జులై, సెప్టెంబర్‌ నెలల్లో ట్రేడింగ్ హాలీడేస్‌ లేవు. ఫిబ్రవరి, మే, నవంబర్‌, డిసెంబర్లలో ఒక్కో సెలవు దినం ఉంది. మార్చి, ఆగస్టు నెలల్లో రెండేసి సెలవులు ఉన్నాయి. అక్టోబర్‌, ఏప్రిల్‌ నెలల్లో మూడేసి సెలవులు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details