Best Sports Bikes In 2024 : భారతీయ యువతలో స్పోర్ట్స్ బైక్స్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ లేటెస్ట్ స్పోర్ట్స్ బైక్‌లను మార్కెట్లోకి తెస్తున్నాయి. అయితే వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక అందరూ వీటిని కొనే పరిస్థితి ఉండదు. అందుకే ఈ ఆర్టికల్‌లో తక్కువ బడ్జెట్ నుంచి హెవీ బడ్జెట్ వరకు లభిస్తున్న టాప్-5 స్పోర్ట్స్ బైక్‌ల గురించి తెలుసుకుందాం.
1. Yamaha MT 15 V4 :ఇండియాలోని బెస్ట్ ఎంట్రీ-లెవల్ 150 సీసీ స్పోర్ట్స్ బైక్స్‌లో యమహా ఎంటీ 15 వీ4 ఒకటి. ఇది స్పోర్టీ ఫుల్లీ-ఫెయిర్డ్ డిజైన్‌తో, అగ్రెసివ్ రైడింగ్ పోస్చర్తో వస్తుంది. తక్కువ ధరలో మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలని ఆశించేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
Yamaha MT 15 V4 Features :
- ఇంజిన్ - 155 సీసీ
- పవర్ - 18.4 పీఎస్
- టార్క్ - 14.2 ఎన్ఎం
- మైలేజ్ - 55.20 కి.మీ/ లీటర్
- కెర్బ్ వెయిట్ - 142 కేజీలు
- బ్రేక్స్ - డబుల్ డిస్క్
Yamaha MT 15 V4 Price : మార్కెట్లో ఈ యమహా బైక్ ధర సుమారుగా రూ.1.82 లక్షల నుంచి రూ.1.98 లక్షల వరకు ఉంటుంది.
2. TVS Apache RTR 160 :భారత్‌లోని మోస్ట్ పాపురల్ బైక్‌ల్లో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 ఒకటి. ఇది ఏడు భిన్నమైన రంగుల్లో లభిస్తుంది. కేవలం రూ.1.50 లక్షల బడ్జెట్లో మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలని అనుకునేవారికి ఇది మంచి ఛాయిస్ అవుతుంది.
TVS Apache RTR 160 Features :
- ఇంజిన్ - 159.7 సీసీ
- పవర్ - 16.04 పీఎస్
- టార్క్ - 13.85 ఎన్ఎం
- మైలేజ్ - 47 కి.మీ/ లీటర్
- కెర్బ్ వెయిట్ - 137 కేజీలు
- బ్రేక్స్ - డిస్క్
TVS Apache RTR 160 Price : మార్కెట్లో ఈ టీవీఎస్ బైక్ ధర సుమారుగా రూ.1.20 లక్షల నుంచి రూ.1.29 లక్షల వరకు ఉంటుంది.
3. Kawasaki Ninja ZX-10R : వరల్డ్ సూపర్‌బైక్ ఛాంపియన్‌షిప్‌లో 3 సార్లు గెలుపొందిన బైక్ కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్. ఇది చూడడానికి సూపర్ స్టైలిష్ లుక్‌లో ఉంటుంది. పెర్ఫార్మెన్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఇది రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
Kawasaki Ninja ZX-10R Features :
- ఇంజిన్ - 998 సీసీ
- పవర్ - 203 పీఎస్
- టార్క్ - 114.9 ఎన్ఎం
- మైలేజ్ - 12 కి.మీ/ లీటర్
- కెర్బ్ వెయిట్ - 207 కేజీలు
- బ్రేక్స్ - డబుల్ డిస్క్