Best Sports Bike Under 2 Lakh :యువతకు బైక్స్ అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ స్పోర్ట్స్ బైక్స్ అంటే మరీనూ. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ కాస్త తక్కువ ధరలో ఉండే స్పోర్ట్స్ బైక్లను కూడా మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటిలో రూ.2 లక్షల బడ్జెట్లో వచ్చే టాప్-5 బైక్స్పై ఓ లుక్కేద్దాం.
1. Yamaha R15 V4 Features :తక్కువ ధరలో మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలని ఆశించేవారికి ఈ యమహా బైక్ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ టూ-వీలర్ 5 వేరియంట్లలో, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ముందు, వెనుక డిస్క్ బ్రేకులు ఉంటాయి.
- ఇంజిన్ సామర్థ్యం - 155 సీసీ
- మ్యాక్స్ పవర్ - 18.1 బీహెచ్పీ @ 10000 ఆర్పీఎం
- మ్యాక్స్ టార్క్ - 14.2 ఎన్ఎం @ 7500 ఆర్పీఎం
- ట్రాన్స్మిషన్ - 6 స్పీడ్ మాన్యువల్
- ప్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 11 లీటర్లు
- మైలేజ్ - 51.4 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 141 కేజీలు
Yamaha R15 V4 Price : మార్కెట్లో ఈ యమహా ఆర్15 వీ4 బైక్ ధర సుమారుగా రూ.1,83,154 నుంచి రూ.1,98,531 (ఎక్స్-షోరూం) ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
2. Bajaj Pulsar RS 200 Features :ఈ బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 బైక్ సింగిల్ వేరియంట్లో, 3 అందమైన రంగుల్లో లభిస్తుంది. దీనిలో కూడా ముందు, వెనుక డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఇది ఒక కాంపాక్ట్ స్పోర్ట్స్ బైక్.
- ఇంజిన్ సామర్థ్యం - 199.5 సీసీ
- మ్యాక్స్ పవర్ - 24.1 బీహెచ్పీ @ 9750 ఆర్పీఎం
- మ్యాక్స్ టార్క్ - 18.7 ఎన్ఎం @ 8000 ఆర్పీఎం
- ట్రాన్స్మిషన్ - 6 స్పీడ్ మాన్యువల్
- ప్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 13 లీటర్లు
- మైలేజ్ - 35 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 166 కేజీలు
Bajaj Pulsar RS 200 Price :మార్కెట్లో ఈ బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 బైక్ ధర సుమారుగా రూ.1,72,247 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
3. Suzuki Gixxer SF Features : తక్కువ ధరలో మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలని అనుకునేవారు ఈ సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్పై ఓ లుక్కేయవచ్చు. ఇది 2 వేరియంట్లలో, 6 రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ సామర్థ్యం - 155 సీసీ
- మ్యాక్స్ పవర్ - 13.4 బీహెచ్పీ @ 8000 ఆర్పీఎం
- మ్యాక్స్ టార్క్ - 13.8 ఎన్ఎం @ 6000 ఆర్పీఎం
- ట్రాన్స్మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- ప్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 12 లీటర్లు
- మైలేజ్ - 45 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 148 కేజీలు