Best Scooters Under 70000 : నేడు మన దేశంలో స్కూటర్లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. అమ్మాయిలు, అబ్బాయిలు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ చాలా సులువుగా నడపగలగడమే ఇందుకు కారణం. పైగా హెవీ ట్రాఫిక్‌లోనూ, చిన్నచిన్న సందుల్లోనూ చాలా ఈజీగా స్కూటీతో వెళ్లిపోవచ్చు. అందుకే చాలా మంది స్కూటీలు కొనడానికి ఇష్టపడతారు. అందుకే ఈ ఆర్టికల్‌లో రూ.70,000 బడ్జెట్లో లభిస్తున్న టాప్-9 ఈవీ స్కూటర్స్ గురించి తెలుసుకుందాం.
1. IVOOMi S1 Features :ఈ ఐవూమీ ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తే 80 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. దీనిపై గంటకు 55 కి.మీ స్పీడ్‌తో ప్రయాణం చేయవచ్చు. ఇది 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
IVOOMi S1 Features :మార్కెట్లో ఈ ఐవూమీ ఎస్1 స్కూటర్ ధర సుమారుగా రూ.69,999 నుంచి రూ.1,21,000 వరకు ఉంటుంది.
2. Okinawa R30 Features : ఈ ఒకినావా ఆర్30 ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యాక్స్ పవర్ 250 వాట్స్. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 60 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. దీనిపై గంటకు 25 కి.మీ స్పీడ్‌తో ప్రయాణం చేయవచ్చు. ఇది 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Okinawa R30 Price : మార్కెట్లో ఈ ఒకినావా ఆర్30 స్కూటర్ ధర సుమారుగా రూ.61,534 ఉంటుంది.
3. Benling Falcon Features : ఈ బెన్లింగ్ ఫాల్కన్ ఎలక్ట్రిక్ స్కూటీ మ్యాక్స్ పవర్ 250 వాట్స్. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 70-75 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. దీనిపై గంటకు 25 కి.మీ స్పీడ్‌తో ప్రయాణం చేయవచ్చు. ఇది 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Benling Falcon Price :మార్కెట్లో ఈ బెన్లింగ్ ఫాల్కన్ ఎలక్ట్రిక్ స్కూటీ ధర సుమారుగా రూ.60,923 ఉంటుంది.
4. Techo Electra Emerge Features : ఈ టెకో ఎలక్ట్రా ఎమర్జ్ స్కూటర్ మ్యాక్స్ పవర్ 250 వాట్స్. దీని రేంజ్ 60 కి.మీ. దీనిపై గంటకు 25 కి.మీ స్పీడ్‌తో ప్రయాణం చేయవచ్చు. ఇది 3 అందమైన రంగుల్లో లభిస్తుంది.
Techo Electra Emerge Price : మార్కెట్లో ఈ టెకో ఎలక్ట్రా ఎమర్జ్ స్కూటర్ ధర సుమారుగా రూ.68,286 ఉంటుంది.
5. Lectrix SX25 Features :ఈ లెక్ట్రిక్స్ ఎస్ఎక్స్25 స్కూటీ మ్యాక్స్ పవర్ 250 వాట్స్. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 60 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కి.మీ. ఇది 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.