Best Low Seat Height Bikes :యువతీ, యువకులకు బైక్స్, స్కూటీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. మంచి హైట్ ఉన్నవాళ్లు ఏ బైక్/ స్కూటర్ అయినా ఫర్వాలేదు. కానీ కాస్త హైట్ తక్కువగా ఉన్నవాళ్లకు మాత్రం ఇబ్బంది తప్పదు. అందుకే ఇలాంటి వారి కోసం ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ 'లో సీట్ హైట్' ఉన్న టూ-వీలర్స్‌ను రూపొందిస్తుంటాయి. అలాంటి వాటిలో టాప్-10 టూ-వీలర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Hero Splendor Plus :షార్ట్ రైడర్స్‌కు ఉపయోగపడే బెస్ట్ బైక్‌ల్లో హీరో స్ల్పెండర్ ప్లస్ ఒకటి. దీని సీట్ హైట్ 785 mm మాత్రమే. దీనిలోని బీఎస్-6 ఇంజిన్ 7.91 hp పవర్ జనరేట్ చేస్తుంది.
- టైప్ : కమ్యూటర్
- ఇంజిన్ : 97.2 సీసీ, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్
- మైలేజ్ : 65 కి.మీ/ లీటర్
- టాప్ స్పీడ్ : 87 కి.మీ/గంట
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 9.8 లీటర్లు
- కెర్బ్ వెయిట్ : 110 కేజీలు
- గ్రౌండ్ క్లియరెన్స్ : 165 mm
Hero Splendor Plus Price : మార్కెట్లో ఈ హీరో స్ల్పెండర్ ప్లస్ బైక్ ధర సుమారుగా రూ.60,310 నుంచి ప్రారంభమవుతుంది.
2. TVS Scooty Zest 110 :బాగా పొట్టిగా ఉండి, పెర్ఫెక్ట్ 'లో-సీట్ హైట్' ఉండే టూ-వీలర్ కొనాలని ఆశించేవారికి 'టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110' మంచి ఆప్షన్ అవుతుంది. దీనిలో 109.7సీసీ బీఎస్-6 ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 rpm వద్ద 7.71 bhp పవర్, 5500 rpm వద్ద 8.8 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ సీట్ హైట్ కేవలం 760 mm మాత్రమే. కనుక ఎత్తు తక్కువగా ఉన్న స్త్రీలు, పురుషులు అందరూ దీనిని హాయిగా డ్రైవ్ చేయవచ్చు.
- టైప్ : స్కూటర్
- ఇంజిన్ : 109 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్
- మైలేజ్ : 45 కి.మీ/ లీటర్
- టాప్ స్పీడ్ : 80 కి.మీ/గంట
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 5 లీటర్లు
- కెర్బ్ వెయిట్ : 103 కేజీలు
- గ్రౌండ్ క్లియరెన్స్ : 150 mm
TVS Scooty Zest 110 Price :మార్కెట్లో ఈ టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 ధర సుమారుగా రూ.87,362 (ఆన్-రోడ్ ప్రైస్) నుంచి ప్రారంభమవుతుంది.
3. Royal Enfield Meteor 350 :రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అంటే ఇష్టపడేవారికి 'మెటోర్ 350' బైక్ చాలా బాగుంటుంది. దీని సీట్ హైట్ కేవలం 765 mm మాత్రమే. కనుకు కాస్త హైట్ తక్కువ ఉన్నవాళ్లు కూడా కంఫర్టబుల్‌గా దీనిని డ్రైవ్ చేయగలుగుతారు. దీనిలో సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది.
- టైప్ : క్రూయిజర్
- ఇంజిన్ : 349 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్సీ
- మైలేజ్ : 35 కి.మీ/లీటర్
- టాప్ స్పీడ్ : 120 కి.మీ/గంట
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 15 లీటర్లు
- కెర్బ్ వెయిట్ : 191 కేజీలు
- గ్రౌండ్ క్లియరెన్స్ : 170 mm
Royal Enfield Meteor 350 Price : మార్కెట్లో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మెటోర్ 350 ధర సుమారుగా రూ.2.33 లక్షలు (ఆన్‌రోడ్ ప్రైస్) నుంచి ప్రారంభమవుతుంది.
4. Honda Activa 6G : ఇండియాలోని మోస్ట్ పాపులర్, బెస్ట్ సెల్లింగ్ స్కూటీల్లో హోండా యాక్టివా 6జీ ఒకటి. పైగా ఇది మంచి మైలేజ్ కూడా ఇస్తుంది. ఈ హోండా యాక్టివా 6జీ సీట్ హైట్ కేవలం 765 mm మాత్రమే. కనుక స్త్రీ, పురుషులు ఇద్దరూ దీనిని చాలా ఈజీగా డ్రైవ్ చేయవచ్చు. ఈ స్కూటీలో బీఎస్-6 ఇంజిన్ ఉంటుంది. ఇది 7.6 bhp పవర్, 8.8 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.
- టైప్ : స్కూటర్
- ఇంజిన్ : 109.51 సీసీ, ఫ్యాన్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఐ ఇంజిన్
- మైలేజ్ : 50-60 కి.మీ/ లీటర్
- టాప్ స్పీడ్ : 85 కి.మీ/గంట
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 5.3 లీటర్లు
- కెర్బ్ వెయిట్ : 105 కేజీలు
- గ్రౌండ్ క్లియరెన్స్ : 162 mm
Honda Activa 6G Price :మార్కెట్లో ఈ హోండా యాక్టివా 6జీ స్కూటీ ధర సుమారుగా రూ.74,536 నుంచి ప్రారంభమవుతుంది.
5. TVS Jupiter 125 : ఈ స్కూటీ సీట్ హైట్ కేవలం 765 mm మాత్రమే. కనుక యావరేజ్ హైట్ ఉన్నవాళ్లకు ఈ టీవీఎస్ జూపిటర్ 125 చాలా బాగుంటుంది. దీనిలో బీఎస్-6 ఇంజిన్ 8.04 bhp పవర్, 10.5 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ టీవీఎస్ స్కూటర్ 3 వేరియంట్లలో, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- టైప్ : స్కూటర్
- ఇంజిన్ : 124 సీసీ, ఎయిర్-కూల్డ్, ఫ్యూయెల్ ఇంజక్షన్
- మైలేజ్ : 52.91 కి.మీ/ లీటర్
- టాప్ స్పీడ్ : 95 కి.మీ/గంట
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 5.1 లీటర్లు
- కెర్బ్ వెయిట్ : 108 కేజీలు
- గ్రౌండ్ క్లియరెన్స్ : 163 mm
TVS Jupiter 125 Price : మార్కెట్లో ఈ టీవీఎస్ జూపిటర్ 125 స్కూటీ ధర సుమారుగా రూ.86,405 నుంచి ప్రారంభమవుతుంది.