తెలంగాణ

telangana

ETV Bharat / business

క్యాబ్​/ ట్యాక్సీ నడపాలని అనుకుంటున్నారా? రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్​-8 కార్స్‌ ఇవే! - BEST COMMERCIAL CARS IN 2024

రూ.10 లక్షల బడ్జెట్లో లభించే టాప్‌-8 కమర్షియల్ కార్స్ ఇవే!

Best Commercial Cars
Best Commercial Cars (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2024, 11:22 AM IST

Best Commercial Cars In 2024 :మీరు క్యాబ్‌/ ట్యాక్సీ సర్వీసెస్‌ కోసం మంచి కమర్షియల్ కార్​ను కొనాలని అనుకుంటున్నారా?మ బడ్జెట్‌ రూ.10 లక్షలు మాత్రమేనా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం ఇండియాలో లభిస్తున్న టాప్‌-8 కమర్షియల్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియాలోని టాప్​-10 కమర్షియల్ కార్స్​ ఇవే!
ఇండియన్ మార్కెట్లో చాలా రకాల కార్లు ఉన్నాయి. అయితే కమర్షియల్ యుసేజ్ కోసం హ్యాచ్​బ్యాక్స్​, సెడాన్స్​, ఎస్​యూవీలు బాగుంటాయి. అందుకే ఈ ఆర్టికల్​లో తక్కువ బడ్జెట్లో, మంచి మైలేజ్​, ఫీచర్స్, స్పెక్స్​ సహా విశాలమైన బూట్​స్పేస్​ ఉన్న టాప్​-10 కార్ల గురించి తెలుసుకుందాం.

1. Maruti Suzuki Celerio :మారుతి సుజుకి సెలెరియో మంచి మైలేజ్ ఇస్తుంది. పైగా దీనిని మెయింటైన్ చేయడం చాలా తేలిక. లాంగ్ డ్రైవ్ చేయడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. కనుక దూరప్రాంతాలకు ట్రిప్​నకు వెళ్లేవారికి దీనిని అద్దెకు ఇవ్వవచ్చు. దీని డిజైన్​ కూడా అద్భుతంగా ఉంటుంది.

Maruti Suzuki Celerio Specs :

  • ఇంజిన్ డిస్​ప్లేస్​మెంట్​ - 998 సీసీ
  • మ్యాక్స్ పవర్​ - 65.71 bhp@5500rpm
  • మ్యాక్స్ టార్క్ - 89 Nm@3500rpm
  • సీటింగ్ కెపాసిటీ - 5
  • బాడీ టైప్​ - హ్యాచ్​బ్యాక్​

Maruti Suzuki Celerio Price : మార్కెట్లో ఈ మారుతి సుజుకి సెలెరియో కారు ధర సుమారుగా రూ.6.32 లక్షల నుంచి రూ.8.31 లక్షలు ఉంటుంది.

2. Tata Tiago :మారుతి టియాగో ఒక ఆల్​-రౌండర్​ కార్​. ఇది స్టైలిష్​ డిజైన్​, విశాలమైన ఇంటీరియర్​, సుపీరియర్ కంఫర్ట్​, రిలయబుల్ సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. పైగా దీనిలోని పవర్​ఫుల్ ఇంజిన్​ ఎక్కువ మైలేజ్​ను, గ్రేట్​ డ్రైవింగ్ ఎక్స్​పీరియన్స్​ను ఇస్తుంది. దీనిలో చాలా మంచి సస్పెన్షన్​ సిస్టమ్ ఉంటుంది. కనుక ఎలాంటి గతుకుల రోడ్లపై అయినా చాలా ఈజీగా దీనిని డ్రైవ్ చేయవచ్చు.

Tata Tiago Specs :

  • ఇంజిన్ డిస్​ప్లేస్​మెంట్​ - 1199 సీసీ
  • మ్యాక్స్ పవర్​ - 72 bhp@6000rpm
  • మ్యాక్స్ టార్క్ - 95@3500rpm
  • సీటింగ్ కెపాసిటీ - 5
  • బాడీ టైప్​ - హ్యాచ్​బ్యాక్​

Tata Tiago Price :మార్కెట్లో ఈ టాటా టియాగో కారు ధర సుమారుగా రూ.6.73 లక్షల నుంచి రూ.9.33 లక్షలు ఉంటుంది.

3. Maruti Suzuki WagonR :తక్కువ బడ్జెట్లో చిన్న కమర్షియల్ వెహికల్ కొనాలని అనుకునేవారికి మారుతి సుజుకి వేగన్​ఆర్​ మంచి ఆప్షన్ అవుతుంది. దీని ధర తక్కువేగానీ, మైలేజ్ మాత్రం ఎక్కువ ఇస్తుంది. దీనిని మెయింటైన్ చేయడం చాలా ఈజీ. ప్రయాణికులు కూర్చోవడానికి అనువుగా దీని ఇంటీరియర్ ఉంటుంది.

Maruti Suzuki WagonR Specs :

  • ఇంజిన్ డిస్​ప్లేస్​మెంట్​ - 1197 సీసీ
  • మ్యాక్స్ పవర్​ - 88.50 bhp@6000rpm
  • మ్యాక్స్ టార్క్ - 113@4400rpm
  • సీటింగ్ కెపాసిటీ - 5
  • బాడీ టైప్​ - హ్యాచ్​బ్యాక్​

Maruti Suzuki WagonR Price :మార్కెట్లో ఈ మారుతి సుజుకి వేగన్ఆర్​ ధర సుమారుగా రూ.6.49 లక్షల నుంచి రూ.8.64 లక్షలు ఉంటుంది.

4. Renault Triber : రెనో ట్రైబర్​ బోల్డ్​ ఎక్స్​టీరియర్​తో, బ్యూటిఫుల్ ఇంటీరియర్​తో వస్తుంది. దీనిలో చాలా మంచి ఫీచర్లు, స్పెక్స్​ ఉన్నాయి. దీనిలో మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. అందువల్ల ప్రయాణికులు ఆనందించేలా మంచి సంగీతాన్ని మీరు వినిపించవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా ఇది ఎక్కువ మైలేజ్​ను ఇస్తుంది. ఈ బండి ఫెర్ఫార్మెన్స్​ చాలా బాగుంటుంది. స్మూత్ డ్రైవింగ్ ఎక్స్​పీరియన్స్​ ఇస్తుంది.

Renault Triber Specs :

  • ఇంజిన్ డిస్​ప్లేస్​మెంట్​ - 999 సీసీ
  • మ్యాక్స్ పవర్​ - 71.01 bhp@6250rpm
  • మ్యాక్స్ టార్క్ - 96 Nm@3500rpm
  • సీటింగ్ కెపాసిటీ - 7
  • బాడీ టైప్​ - ఎంయూవీ

Renault Triber Price : మార్కెట్లో ఈ రెనో ట్రైబర్ కారు ధర సుమారుగా రూ.7.04 లక్షల నుంచి రూ.10.49 లక్షల వరకు ఉంటుంది.

5. Maruti Suzuki Dzire :తక్కువ బడ్జెట్లో మంచి కమర్షియల్ కారు కొనాలని అనుకునేవారికి మారుతి సుజుకి డిజైర్​ మంచి ఛాయిస్ అవుతుంది. దీనిలో చాలా మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీని ఇంటీరియర్ చాలా విశాలంగా ఉంటుంది. కనుక ప్యాసింజర్లు కూర్చోవడానికి చాలా కంఫర్ట్​గా ఉంటుంది. పైగా ఇది ఎక్కువ మైలేజ్ కూడా ఇస్తుంది. దీనిని మెయింటైన్ చేయడం కూడా తేలిక. అన్నింటికంటే ప్రధానంగా దీని రీసేల్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది.

Maruti Suzuki Dzire Specs :

  • ఇంజిన్ డిస్​ప్లేస్​మెంట్​ - 1197 సీసీ
  • మ్యాక్స్ పవర్​ - 88.50 bhp@6000rpm
  • మ్యాక్స్ టార్క్ - 113 Nm@4400rpm
  • సీటింగ్ కెపాసిటీ - 5
  • బాడీ టైప్​ - సెడాన్​

Maruti Suzuki Dzire Price : మార్కెట్లో ఈ మారుతి సుజుకి డిజైర్​ కార్ ధర సుమారుగా రూ.7.65 లక్షల నుంచి రూ.10.94 లక్షలు ఉంటుంది.

6. Hyundai Aura : హ్యుందాయ్ ఆరాలో పవర్​ఫుల్ ఇంజిన్​ ఉంటుంది. ఈ కారు మంచి డ్రైవింగ్ ఎక్స్​పీరియన్స్​ను ఇస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లలో ఇది కూడా ఒకటి. దీనిని వాల్యూ ఫర్ మనీ కార్​గా చెప్పుకోవచ్చు.

Hyundai Aura Specs :

  • ఇంజిన్ డిస్​ప్లేస్​మెంట్​ - 1197 సీసీ
  • మ్యాక్స్ పవర్​ - 67.72 bhp@6000rpm
  • మ్యాక్స్ టార్క్ - 95.2@4000rpm
  • సీటింగ్ కెపాసిటీ - 5
  • బాడీ టైప్​ - సెడాన్​

Hyundai Aura Price :మార్కెట్లో ఈ హ్యుందాయ్​ ఆరా కారు ధర సుమారుగా రూ.7.66 లక్షల నుంచి రూ.10.46 లక్షలు ఉంటుంది.

7. Maruti Suzuki Eeco : తక్కువ మెయింటెనెన్స్​తో ఎక్కువ మైలేజ్ ఇచ్చే మినీవ్యాన్​ కొనాలని అనుకునేవారికి మారుతి సుజుకి ఈకో మంచి ఛాయిస్ అవుతుంది. దీని ఇంటీరియర్ చాలా విశాలంగా ఉంటుంది. కనుక ఫ్యామిలీతో వెళ్లడానికి, లేదా ప్యాసింజర్లను ఎక్కించుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది.

Maruti Suzuki Eeco Specs :

  • ఇంజిన్ డిస్​ప్లేస్​మెంట్​ - 1197 సీసీ
  • మ్యాక్స్ పవర్​ - 70.67 bhp@6000rpm
  • మ్యాక్స్ టార్క్ - 95@3000rpm
  • సీటింగ్ కెపాసిటీ - 5,7
  • బాడీ టైప్​ - మినీవ్యాన్​

Maruti Suzuki Eeco Price : మార్కెట్లో ఈ మారుతి సుజుకి ఈకో ధర సుమారుగా రూ.6.30 లక్షల నుంచి రూ.7.48 లక్షలు ఉంటుంది.

8. Honda Amaze : రూ.10 లక్షల్లోపు మంచి కారు కొనాలని అనుకునేవారికి హోండా అమేజ్​ చాలా బాగుంటుంది. దీని డిజైన్​ చాలా యూనిక్​గా ఉంటుంది. దీనితో సిటీలోని హైవీ ట్రాఫిక్​లోనూ దూసుకుపోవచ్చు. ట్యాక్సీగా, క్యాబ్​గా వాడుకోవడానికి ఇది చాలా బాగుంటుంది.

Honda Amaze Specs :

  • ఇంజిన్ డిస్​ప్లేస్​మెంట్​ - 1199 సీసీ
  • మ్యాక్స్ పవర్​ - 88.50 bhp@6000rpm
  • మ్యాక్స్ టార్క్ - 110 Nm@4800rpm
  • సీటింగ్ కెపాసిటీ - 5
  • బాడీ టైప్​ - సెడాన్​

Honda Amaze Price : మార్కెట్లో ఈ హోండా అమేజ్ కారు ధర సుమారుగా రూ.8.54 లక్షల నుంచి రూ.11.64 లక్షలు ఉంటుంది.

నోట్‌ :కమర్షియల్ వెహికల్స్​లో ట్యాక్సీల నుంచి పికప్ ట్రక్కుల వరకు చాలా రకాలు ఉంటాయి. అయితే వీటిలో దేనిని ఎంచుకోవాలనేదే అసలు ప్రశ్న. మీరు కనుక వస్తువులను బట్వాడా చేయాలని అనుకుంటే, పికప్ ట్రక్కులను ఎంచుకోవడం మంచిది. అలాకాకుండా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చి, డబ్బులు సంపాదించాలంటే క్యాబ్​, ట్యాక్సీలుగా పనికి వచ్చే ప్యాసింజర్ వెహికల్స్​ను (కార్స్​, వ్యాన్స్​) కొనుగోలు చేయాలి.

ఫస్ట్ టైమ్ కొత్త కారు కొన్నారా? డెలివరీకి ముందు కచ్చితంగా ఈ 5 అంశాలను చెక్‌ చేయాల్సిందే!

పెట్రోల్ కార్ Vs సీఎన్‌జీ కార్​ - వీటిలో ఏది బెటర్ ఆప్షన్​?

ABOUT THE AUTHOR

...view details