Best Commercial Car In 2024 :దేశంలో ట్యాక్సీ, క్యాబ్ లాంటి కమర్షియల్ కార్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ప్రజలను గమ్యస్థానానికి చేరుస్తూ, స్వయం ఉపాధి పొందడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ట్యాక్సీల్లో వస్తువులు, సామాన్లను కూడా సులువుగా తరలించవచ్చు. అందుకే ట్యాక్సీ, క్యాబ్ వ్యాపారం చేయాలని అనుకునేవారు మంచి బూట్ స్పేస్ కలిగి ఉండి, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఆర్టికల్‌లో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్-10 కమర్షియల్ కార్ల గురించి తెలుసుకుందాం.
1. Toyota Innova Crysta :దేశంలోని ఎక్కువ మంది ట్యాక్సీ ఆపరేటర్లు టయోటా ఇన్నోవా క్రిస్టాను బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. ఈ కారు శక్తివంతమైన 2.4 లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ట్యాక్సీ కార్ల రంగంలో టయాటా ఇన్నోవా క్రిస్టా ఒక ట్రెండ్‌ను సెట్ చేసింది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
- ఇంజిన్ : 2.4 లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్
- ట్రాన్స్మిషన్ : 5 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ : 15.60 కి.మీ/ లీటర్
- మ్యాక్స్ పవర్ : 148 bhp
- మ్యాక్స్ టార్క్ : 343 Nm
- ఫ్యూయల్ టైప్ : డీజిల్
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 55 లీటర్లు
- సీటింగ్ కెపాసిటీ : 7
- బాడీ టైప్ : ఎంపీవీ
- బూస్ట్ స్పేస్ : 300 లీటర్లు
- ఫీచర్లు : మల్టీ ఫంక్సన్ స్టీరింగ్ వీల్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ విండోస్, పుష్ బటన్ స్టార్ట్
- ధర : మార్కెట్లో ఈ టయోటా ఇన్నోవా క్రిస్టా కారు ధర సుమారుగా రూ.19.99 లక్షల వరకు ఉంటుంది.
2. Mahindra Marazzo :మహీంద్రా మరాజో కారులో ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. ఈ కారు విశాలమైన ఇంటీరియర్‌తో లభిస్తుంది. ట్యాక్సీగా తిప్పాలనుకున్నా, రోజువారి వ్యాపార కార్యక్రమాలకు వాడాలని అనుకున్నా, ఈ కారు బాగా ఉపయోగపడుతుంది.
- ఇంజిన్ : 1.5 లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్
- ట్రాన్స్మిషన్ : 6 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ : 17.30 కి.మీ/లీటర్
- మ్యాక్స్ పవర్ : 120 bhp
- మ్యాక్స్ టార్క్ : 300 Nm
- ఫ్యూయల్ టైప్ : డీజిల్
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 45 లీటర్లు
- సీటింగ్ కెపాసిటీ : 7
- బాడీ టైప్ : ఎంపీవీ
- బూస్ట్ స్పేస్ : 100 లీటర్లు
- ఫీచర్లు : టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యాపిల్ కార్ప్లే, రియర్ పార్కింగ్ కెమెరాలు
- ధర : మార్కెట్లో ఈ మహీంద్రా మరాజో కారు ధర రూ.13.41 లక్షల నుంచి రూ.15.70 లక్షల వరకు ఉంటుంది.
3. Maruti Suzuki XL6 :టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యాపారం చేసేవారికి మారుతి సుజుకి ఎక్స్ఎల్6 బాగా ఉపయోగపడుతుంది. ఈ కారు మంచి మైలేజ్‌ను ఇస్తుంది.
- ఇంజిన్ : 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్
- ట్రాన్స్మిషన్ : 5 స్పీడ్ మాన్యువల్ / 6 స్పీడ్ ఆటోమేటిక్
- మైలేజ్ : 20.51 కి.మీ/ లీటర్
- మ్యాక్స్ పవర్ : 101.65 bhp
- మ్యాక్స్ టార్క్ : 300 Nm
- ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 45 లీటర్లు
- సీటింగ్ కెపాసిటీ : 6
- బాడీ టైప్ : ఎంపీవీ
- బూస్ట్ స్పేస్ : 209 లీటర్లు
- ఫీచర్లు : కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, ఫాగ్ ల్యాంప్స్
- ధర : మార్కెట్లో మారుతి సుజుకి ఎక్స్ఎల్6 కారు ధర రూ.11.57 లక్షల నుంచి రూ.14.82 లక్షల వరకు ఉంటుంది.
4. Renault Triber :రెనో ట్రైబర్ కారు 7 సీటింగ్ సామర్థ్యంతో లభిస్తుంది. అలాగే ట్యాక్సీగా ఈ కారును వాడుకోవాలన్నా బాగుంటుంది. బడ్జెట్లో కారు కొనాలనుకునేవారికి మంచి ఆప్షన్ అవుతుంది.
- ఇంజిన్ : 1.5 లీటర్ పెట్రోల్
- ట్రాన్స్మిషన్ : 5 స్పీడ్ మాన్యువల్ / 5 స్పీడ్ ఆటోమెటిక్
- మైలేజ్ : 18.2 - 20.0 కి.మీ/ లీటర్
- మ్యాక్స్ పవర్ : 71 bhp
- మ్యాక్స్ టార్క్ : 136 Nm
- ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 40 లీటర్లు
- సీటింగ్ కెపాసిటీ : 7
- బాడీ టైప్ : ఎంపీవీ
- బూస్ట్ స్పేస్ : 84 లీటర్లు
- ఫీచర్లు : 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 4 ఎయిర్ బ్యాగులు
- ధర : మార్కెట్లో రెనో ట్రైబర్ కారు ధర రూ.6.33 లక్షల నుంచి రూ.8.97 లక్షల వరకు ఉంటుంది.
5. Maruti Suzuki Ciaz :మారుతి సుజుకి సియాజ్ కారు విశాలంగా ఉంటుంది. అందుకే ఈ కారు ట్యాక్సీగా ఉపయోగించుకోవడానికి బాగుంటుంది. దీనిలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ కారుకు తక్కువ మెయింటెనెస్స్ అవుతుంది.
- ఇంజిన్ : 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్
- ట్రాన్స్మిషన్ : 5 స్పీడ్ మాన్యువల్ / 4 స్పీడ్ ఆటోమెటిక్
- మైలేజ్ : 20.04 - 20.65 కి.మీ/లీటర్
- మ్యాక్స్ పవర్ : 103 bhp
- మ్యాక్స్ టార్క్ : 138 Nm
- ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 43 లీటర్లు
- సీటింగ్ కెపాసిటీ : 5
- బాడీ టైప్ : సెడాన్
- బూస్ట్ స్పేస్ : 510 లీటర్లు
- ఫీచర్లు : డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ కెమెరా, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్
- ధర : మార్కెట్లో మారుతి సుజుకి సియాజ్ కారు ధర రూ.9.30 లక్షల నుంచి రూ.12.29 లక్షల వరకు ఉంటుంది.