Best Cars Under 7 Lakh : కారు కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అవుతాయి. మరీ ముఖ్యంగా ఇండియన్ మార్కెట్లో మధ్యతరగతి ప్రజలే ఎక్కువ మంది ఉంటారు. అందుకే వీరిని ఆకర్షించేందుకు చాలా కంపెనీలు తక్కువ బడ్జెట్లోనే చాలా మంచి ఫీచర్లు ఉన్న కార్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. అలాంటి వాటిలో రూ.7 లక్షలకు కాస్త అటుఇటూగా ఉన్న టాప్-10 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Mahindra XUV 3XO : మహీంద్రా కంపెనీ విడుదల చేసిన బెస్ట్ ఎస్యూవీ కార్లలో XUV 3XO ఒకటి. దీని క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. సీట్లు కంఫర్టబుల్‌గా ఉంటాయి. ADAS ఫీచర్స్, సేఫ్టీ ఫీచర్లు కూడా చాలా బాగుంటాయి. దీనిలో మొత్తం 25 వేరియంట్లు ఉన్నాయి.
- ఇంజిన్ : 1197 సీసీ & 1497 సీసీ
- ఫ్యూయెల్ టైప్ : పెట్రోల్, డీజిల్
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ : 5
- మైలేజ్ : 18.06 - 21.2 కి.మీ/ లీటర్
- ధర : రూ.7.49 లక్షలు - రూ.15.49 లక్షలు
2. Maruti Suzuki Fronx : మారుతి కార్ లవర్స్‌కు నచ్చే మోడల్ ఈ ఫ్రాంక్స్. దీనిలో చాలా పవర్ఫుల్, ఎఫీషియెంట్ ఇంజిన్ ఉంటుంది. ఇది 16 వేరియంట్లలో లభిస్తుంది. దీనిలో సైడ్ & కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, ఆల్ 3-పాయింట్ సీట్ బెల్ట్స్ ఉంటాయి. భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేవారికి ఇది మంచి ఛాయిస్ అవుతుంది.
- ఇంజిన్ : 1197 సీసీ & 998 సీసీ
- ఫ్యూయెల్ టైప్ : పెట్రోల్, డీజిల్
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ : 5
- మైలేజ్ : 20.01 - 28.51 కి.మీ/ లీటర్
- ధర : రూ.7.52 లక్షలు - రూ.13.04 లక్షలు
3. Hyundai i20 : హ్యుందాయ్ ఐ20 అనేది ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. దీని డిజైన్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఈ కారులో సేఫ్టీ + ఫీల్ గుడ్ ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. కారు లోపల విశాలంగా ఉంటుంది. బూట్ స్పేస్ కూడా పెద్దగా ఉంటుంది. కనుక కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించడానికి ఇది ఎంతో అనువుగా ఉంటుంది. ఈ కారు మొత్తం 12 వేరియంట్లలో లభిస్తుంది.
- ఇంజిన్ : 1197 సీసీ
- ఫ్యూయెల్ టైప్ : పెట్రోల్
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ : 5
- సేఫ్టీ : 3 స్టార్ (గ్లోబల్ NCAP)
- మైలేజ్ : 15 - 20.3 కి.మీ/ లీటర్
- ధర : రూ.7.04 లక్షలు - రూ.11.21 లక్షలు
4. Tata Altroz : తక్కువ బడ్జెట్లో మంచి లుక్స్‌తో, సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కారు కొనాలని అనుకునే వారికి టాటా ఆల్ట్రోజ్ మంచి ఆప్షన్ అవుతుంది. ఇది ఏకంగా 37 వేరియంట్లలో లభిస్తుంది.
- ఇంజిన్ : 1199 సీసీ & 1497 సీసీ
- ఫ్యూయెల్ టైప్ : పెట్రోల్, సీఎన్జీ, డీజిల్
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ : 5
- సేఫ్టీ : 5 స్టార్ (గ్లోబల్ NCAP)
- మైలేజ్ : 19.16 - 26.2 కి.మీ/ లీటర్
- ధర : రూ.6.65 లక్షలు - రూ.10.99 లక్షలు
5. Toyota Glanza :టయోటా గ్లాంజా ఒక మంచి యూజర్ ఫ్రెండీ హ్యాచ్‌బ్యాక్. ప్రతి రోజూ కారు వాడేవారికి, కుటుంబ అవసరాల కోసం కారు కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఇది మొత్తం 9 వేరియంట్లలో లభిస్తుంది.
- ఇంజిన్ : 1197 సీసీ
- ఫ్యూయెల్ టైప్ : పెట్రోల్, సీఎన్జీ
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్, ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ : 5
- మైలేజ్ : 22.3 - 30.61 కి.మీ/ లీటర్
- ధర : రూ.6.86 లక్షలు - రూ.10 లక్షలు