Best Cars In India 2024 : ఇండియన్ మార్కెట్లో కార్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ మార్కెట్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ 2024లో తమ బెస్ట్ మోడల్స్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఇయర్ ఎండ్ సేల్‌లో వాటిపై మంచి ఆఫర్స్, డిస్కౌంట్స్ కూడా లభిస్తున్నాయి. కనుక వాటిలోని టాప్-10 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Maruti Dzire :భారతదేశంలోని టాప్ సెల్లింగ్ సబ్‌కాంపాక్ట్ సెడాన్ కార్లలో మారుతి డిజైర్ ఒకటి. ఈ కారు 4 వేరియంట్లలో, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 2024 మోడల్ కారులో Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ కారులో సీఎన్జీ వేరియంట్ కూడా ఉంది. దీనికి 5 స్టార్ GNCAP రేటింగ్ కూడా ఉంది. కనుక కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి ఇది ఎంతో అనువుగా ఉంటుంది. తక్కువ ధరలో మంచి కారు కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
- ఇంజిన్ : 1197 సీసీ
- పవర్ : 69 - 80 bhp
- టార్క్ : 101.8 - 111.7 Nm
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్/ ఆటోమేటిక్
- మైలేజ్ : 24.49 - 25.71 కి.మీ/లీటర్
- ఫ్యూయెల్ : పెట్రోల్ / సీఎన్జీ
Maruti Dzire Price : మార్కెట్లో ఈ మారుతి డిజైర్ కారు ధర సుమారుగా రూ.6.79 లక్షలు - రూ.10.14 లక్షల (ఎక్స్-షోరూం ప్రైస్) వరకు ఉంటుంది.
2. Honda Amaze :హోండా కంపెనీ ఇండియాలో విడుదల చేసిన థర్డ్-జనరేషన్ కార్ ఇది. ఇండియాలోని మోస్ట్ పాపులర్ సబ్‌కాంపాక్ట్ సెడాన్లలో ఇది ఒకటి. ఈ కారు 3 వేరియంట్లలో, 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 2024 మోడల్ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. మీడియం బడ్జెట్లో మంచి కారు కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
- ఇంజిన్ : 1199 సీసీ
- పవర్ : 89 bhp
- టార్క్ : 110 Nm
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్/ ఆటోమేటిక్
- మైలేజ్ : 18.65 - 19.46 కి.మీ/లీటర్
- ఫ్యూయెల్ : పెట్రోల్
Honda Amaze Price : మార్కెట్లో ఈ హోండా అమేజ్ కారు ధర సుమారుగా రూ.8 లక్షలు - రూ.10.90 లక్షల (ఎక్స్-షోరూం ప్రైస్) వరకు ఉంటుంది.
3. Tata Punch : భారతదేశంలో అతి తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ కార్లలో టాటా పంచ్ ఒకటి. ఈ కారు 4 వేరియంట్లలో, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారులో సీఎన్జీ వెర్షన్ కూడా ఉంది. దీనికి 5 స్టార్ GNCAP రేటింగ్ కూడా ఉంది. కనుక కుటుంబంతో కలిసి సురక్షితంగా ప్రయాణించడానికి ఇది ఎంతో అనువుగా ఉంటుంది.
- ఇంజిన్ : 1199 సీసీ
- పవర్ : 72 - 87 bhp
- టార్క్ : 103 - 115 Nm
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్/ ఆటోమేటిక్
- మైలేజ్ : 18.8 - 20.09 కి.మీ/లీటర్
- ఫ్యూయెల్ : పెట్రోల్ / సీఎన్జీ
Tata Punch Price : మార్కెట్లో ఈ టాటా పంచ్ కారు ధర సుమారుగా రూ.6 లక్షలు - రూ.10.15 లక్షల (ఎక్స్-షోరూం ప్రైస్) వరకు ఉంటుంది.
4. Maruti Swift :మారుతి సుజుకి స్విఫ్ట్ ఒక మిడ్‌సైజ్ హ్యాచ్‌బ్యాక్. ఈ కారులో 1.2 లీటర్, Z సిరీస్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఈ కారు 5 వేరియంట్లలో, 9 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారులో సీఎన్జీ వెర్షన్ కూడా ఉంది. తక్కువ బడ్జెట్లో మంచి కారు కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
- ఇంజిన్ : 1197 సీసీ
- పవర్ : 68.8 - 80.46 bhp
- టార్క్ : 101.8 - 111.7 Nm
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్/ ఆటోమేటిక్
- మైలేజ్ : 24.8 - 25.75 కి.మీ/లీటర్
- ఫ్యూయెల్ : పెట్రోల్ / సీఎన్జీ
Maruti Swift Price :మార్కెట్లో ఈ మారుతి స్విఫ్ట్ కారు ధర సుమారుగా రూ.6.49 లక్షలు - రూ.9.59 లక్షల (ఎక్స్-షోరూం ప్రైస్) వరకు ఉంటుంది.
5. Mahindra Thar Roxx : మహీంద్రా థార్ రోక్స్ ఒక 5-డోర్ వెర్షన్ ఇది. ఇది ఆఫ్-రోడ్ ఎస్యూవీ. ఇది 4వీల్ డ్రైవ్ కార్. దీనిలో సీఎన్జీ వెర్షన్ కూడా ఉంది. ఈ కారు 2 వేరియంట్లలో, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టగలిగేవారు దీనిపై ఓ లుక్కేయవచ్చు.
- ఇంజిన్ : 1197 - 2184 సీసీ
- పవర్ : 150 - 174 bhp
- టార్క్ : 330 - 380 Nm
- మైలేజ్ : 12.4 - 15.2 కి.మీ/లీటర్
- డ్రైవ్ టైప్ : 4WD/RWD
Mahindra Thar Roxx Price : మార్కెట్లో ఈ మహీంద్రా థార్ రోక్స్ కారు ధర సుమారుగా రూ.12.99 లక్షలు - రూ.22.49 లక్షల (ఎక్స్-షోరూం ప్రైస్) వరకు ఉంటుంది.