Best Bikes Under 70000 : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ ఇండియన్ మార్కెట్లో తమ సరికొత్త బైక్‌లను విడుదల చేస్తున్నాయి. వాటిలో రూ.70,000 రేంజ్‌లోని టాప్-10 బైక్స్ & స్కూటీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Hero HF Deluxe Features :ఈ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్‌లో 97.2సీసీ ఇంజిన్ ఉంది. ఇది 8.02 పీఎస్ పవర్, 8.05 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. దీనిపై గరిష్ఠంగా గంటకు 85 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. ఇది 70 kmpl మైలేజ్ ఇస్తుంది.
Hero HF Deluxe Price : హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ధర మార్కెట్లో రూ.59,998 నుంచి రూ.68,768 వరకు ఉంటుంది.
2. Honda Shine 100 Features : ఈ హోండా షైన్ 100 బైక్‌లో 98.98సీసీ ఇంజిన్ ఉంది. ఇది 7.38 పీఎస్ పవర్, 8.05 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 55 kmpl మైలేజ్ ఇస్తుంది.
Honda Shine 100 Price :మార్కెట్లో ఈ హోండా షైన్ 100 బైక్ ప్రారంభ ధర సుమారుగా రూ.64,900 ఉంటుంది.
3. Hero Passion Pro Features : ఈ హీరో ప్యాషన్ ప్రో బైక్‌లో 109.15సీసీ ఇంజిన్ ఉంది. ఇది 9.3 బీహెచ్పీ పవర్, 9 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 56.5 kmpl మైలేజ్ ఇస్తుంది.
Hero Passion Pro Price :మార్కెట్లో ఈ హీరో ప్యాషన్ ప్రో బైక్ ధర సుమారుగా రూ.65,740 నుంచి రూ.75,400 వరకు ఉంటుంది.
4. Bajaj Platina 100 Features : ఈ బజాజ్ ప్లాటినా 100 బైక్‌లో 102సీసీ ఇంజిన్ ఉంది. ఇది 7.9 పీఎస్ పవర్, 8.3 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 70 kmpl మైలేజ్ ఇస్తుంది.
Bajaj Platina 100 Price : మార్కెట్లో ఈ బజాజ్ ప్లాటినా 100 బైక్ ధర సుమారుగా రూ.67,808 ఉంటుంది.
5. TVS Scooty Pep Plus Features : ఈ టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్‌లో 87.8 సీసీ ఇంజిన్ ఉంది. ఇది 5.4 పీఎస్ పవర్, 6.5 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. దీనిపై లీటర్ పెట్రోల్‌తో 50 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.
TVS Scooty Pep Plus Price :మార్కెట్లో ఈ టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ స్కూటర్ ధర సుమారుగా రూ.65,514 నుంచి రూ.68,414 ఉంటుంది.