Best Bikes Under 2 Lakhs :మరికొద్ది రోజుల్లో న్యూ ఇయర్ మొదలుకానుంది. ఈ సందర్భంగా మంచి బైక్ లేదా స్కూటీ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం రూ.2 లక్షల బడ్జెట్లో లభిస్తున్న టాప్-10 బైక్స్ & స్కూటర్లపై ఓ లుక్కేద్దాం రండి.
1. Royal Enfield Hunter 350 :తక్కువ బడ్జెట్లో మంచి బైక్ కొనాలని అనుకునేవారికి రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మంచి ఆప్షన్ అవుతుంది. ఇది 3 వేరియంట్లలో, 8 డిఫరెంట్ కలర్స్‌లో లభిస్తుంది.
- ఇంజిన్ : 349.34 సీసీ
- పవర్ : 20.4 పీఎస్
- టార్క్ : 27 ఎన్‌ఎం
- మైలేజ్ : 36.2 కి.మీ/లీటర్
- బ్రేక్స్ : డిస్క్
- కెర్బ్ వెయిట్ : 177 కేజీ
Royal Enfield Hunter 350 Price :మార్కెట్లో ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ ధర సుమారుగా రూ.1.50 లక్షలు - రూ.1.75 లక్షల వరకు ఉంటుంది.
2. Yamaha MT 15 V2.0 :ఈ యమహా బైక్ ఒక ఎంట్రీ లెవల్ నేకెడ్ స్ట్రీట్ ఫైటర్. బిగినర్స్‌కు ఇది చాలా బాగుంటుంది. ఇది 3 వేరియంట్లలో, 8 రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 155 సీసీ
- పవర్ : 18.4 పీఎస్
- టార్క్ : 14.1 ఎన్‌ఎం
- మైలేజ్ : 56.87 కి.మీ/లీటర్
- బ్రేక్స్ : డబుల్ డిస్క్
- కెర్బ్ వెయిట్ : 141 కేజీ
Yamaha MT 15 V2.0 Price : మార్కెట్లో ఈ యమహా బైక్ ధర సుమారుగా రూ.1.68 లక్షలు - రూ.1.73 లక్షల వరకు ఉంటుంది.
3. TVS Apache RTR 160 : ఇండియాలోని మోస్ట్ పాపులర్ బైక్‌ల్లో టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 ఒకటి. ఇది 5 వేరియంట్లలో, 7 భిన్నమైన రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 159.7 సీసీ
- పవర్ : 16.04 పీఎస్
- టార్క్ : 13.85 ఎన్‌ఎం
- మైలేజ్ : 47 కి.మీ/లీటర్
- బ్రేక్స్ : డిస్క్
- కెర్బ్ వెయిట్ : 137 కేజీ
TVS Apache RTR 160 Price : మార్కెట్లో ఈ టీవీఎస్ బైక్ ధర సుమారుగా రూ.1.20 లక్షలు - రూ.1.30 లక్షల వరకు ఉంటుంది.
4. Hero Super Splendor :తక్కువ బడ్జెట్లోని బెస్ట్ బైక్స్‌లో హీరో సూపర్ స్ల్పెండర్ ఒకటి. ఇది 2 వేరియంట్లలో, 5 అందమైన రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 124.7 సీసీ
- పవర్ : 10.87 పీఎస్
- టార్క్ : 10.6 ఎన్‌ఎం
- మైలేజ్ : 60 కి.మీ/లీటర్
- బ్రేక్స్ : డ్రమ్
- కెర్బ్ వెయిట్ : 122 కేజీ
Hero Super Splendor Price : మార్కెట్లో ఈ హీరో సూపర్ స్ల్పెండర్ బైక్ ధర సుమారుగా రూ.80,848 - రూ.84,748 వరకు ఉంటుంది.
5. Honda SP 125 : భారతదేశంలోని మోస్ట్ పాపులర్ బైక్‌ల్లో హోండా ఎస్‌పీ 125 ఒకటి. ఈ బైక్ 2 వేరియంట్లలో, 5 భిన్నమైన రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 123.94 సీసీ
- పవర్ : 10.87 పీఎస్
- టార్క్ : 10.9 ఎన్‌ఎం
- మైలేజ్ : 60 కి.మీ/లీటర్
- బ్రేక్స్ : డ్రమ్
- కెర్బ్ వెయిట్ : 116 కేజీ
Honda SP 125 Price : మార్కెట్లో ఈ హోండా ఎస్‌పీ 125 బైక్ ధర సుమారుగా రూ.87,468 - రూ.91,468 వరకు ఉంటుంది.
6. Bajaj Pulsar NS200 :మంచి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ బైక్ కొనాలని అనుకునేవారికి బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్ 200 మంచి ఛాయిస్ అవుతుంది. ఈ బైక్ సింగిల్ వేరియంట్‌లో, 4 రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 199.5 సీసీ
- పవర్ : 24.5 పీఎస్
- టార్క్ : 18.74 ఎన్‌ఎం
- మైలేజ్ : 40.36 కి.మీ/లీటర్
- బ్రేక్స్ : డిస్క్
- కెర్బ్ వెయిట్ : 158 కేజీ
Bajaj Pulsar NS200 Price : మార్కెట్లో ఈ బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్200 బైక్ ధర సుమారుగా రూ.1.59 లక్షలు ఉంటుంది.
7. Suzuki Access 125 : భారత్‌లోని మోస్ట్ పాపులర్ స్కూటీల్లో సుజుకీ యాక్సెస్ 125 ఒకటి. ఈ స్కూటర్ 4 వేరియంట్లలో, 16 డిఫరెంట్ కలర్లలో లభిస్తుంది.
- ఇంజిన్ : 124 సీసీ
- పవర్ : 8.7 పీఎస్
- టార్క్ : 10 ఎన్‌ఎం
- మైలేజ్ : 45 కి.మీ/లీటర్
- బ్రేక్స్ : డ్రమ్
- కెర్బ్ వెయిట్ : 103 కేజీ
Suzuki Access 125 Price : మార్కెట్లో ఈ సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ధర సుమారుగా రూ.80,700 - రూ.91,300 వరకు ఉంటుంది.
8. Honda Activa 125 : డైలీ పర్పస్ కోసం మంచి స్కూటర్ కొనాలని అనుకునేవారికి హోండా యాక్టివా 125 మంచి ఛాయిస్ అవుతుంది. ఇంట్లో ఉన్న స్త్రీ, పురుషులు అందరూ దీనిని హాయిగా డ్రైవ్ చేయవచ్చు. ఈ స్కూటర్ 4 వేరియంట్లలో, 5 అందమైన రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 124 సీసీ
- పవర్ : 8.30 పీఎస్
- టార్క్ : 10.4 ఎన్‌ఎం
- మైలేజ్ : 51.23 కి.మీ/లీటర్
- బ్రేక్స్ : డ్రమ్
- కెర్బ్ వెయిట్ : 110 కేజీ
Honda Activa 125 Price : మార్కెట్లో ఈ హోండా యాక్టివా 125 స్కూటర్ ధర సుమారుగా రూ.80,256 - రూ.89,429 వరకు ఉంటుంది.
9. TVS NTORQ 125 :తక్కువ బడ్జెట్లో మంచి స్కూటీ కొనాలని అనుకునేవారికి టీవీఎస్ ఎన్‌టార్క్ 125 బాగుంటుంది. ఈ స్కూటీ 5 వేరియంట్లలో, 12 రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ : 124.8 సీసీ
- పవర్ : 9.5 పీఎస్
- టార్క్ : 10.6 ఎన్‌ఎం
- మైలేజ్ : 47 కి.మీ/లీటర్
- బ్రేక్స్ : డిస్క్
- కెర్బ్ వెయిట్ : 111 కేజీ
TVS NTORQ 125 Price : మార్కెట్లో ఈ టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ధర సుమారుగా రూ.86,841 - రూ.1.06 లక్షల వరకు ఉంటుంది.
10. Ola S1 Pro : ఇండియాలోని బెస్ట్ సెల్లింగ్ స్కూటీల్లో ఓలా ఎస్1 ప్రో ఒకటి. ఈ స్కూటీ సింగిల్ వేరియంట్‌లో, 5 డిఫరెంట్ కలర్లలో లభిస్తుంది.
- రేంజ్ : 195 కి.మీ/ ఛార్జ్
- బ్యాటరీ కెపాసిటీ : 4 కిలోవాట్స్
- టాప్ స్పీడ్ : 102 కి.మీ/గంట
- యాక్సిలిరేషన్ (0-60) : 4.5 సెకెన్స్
- బ్యాటరీ వారెంటీ : 8 సంవత్సరాలు
- కెర్బ్ వెయిట్ : 116 కేజీ
Ola S1 Pro Price :మార్కెట్లో ఈ ఓలా ఎస్1 ప్రో స్కూటర్ ధర సుమారుగా రూ.1.29 లక్షల వరకు ఉంటుంది.
ఇయర్ ఎండ్ సేల్‌లో మంచి బైక్ కొనాలా? ఆ మోడల్‌పై ఏకంగా రూ.20,000 డిస్కౌంట్ & రూ.25,000 క్యాష్ బ్యాక్!
వింటర్లో మీ బైక్‌కు సెల్ఫ్ స్టార్ట్ ప్రాబ్లమా? ఈ 5 టిప్స్ పాటిస్తే అంతా సెట్!