Best Bikes Under 2 Lakh :ఇండియాలో బైక్స్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ యువతను ఆకర్షించేందుకు సూపర్ స్టైలిష్ లుక్స్ తో, బెస్ట్ పెర్ఫార్మెన్స్, రైడింగ్ ఎక్స్పీరియన్స్, మైలేజ్ ఇచ్చే బైక్‌లను మార్కెట్లోకి దింపుతున్నాయి. వాటిలో రూ.2 లక్షల బడ్జెట్లో లభించే టాప్-10 బైక్స్ పై ఓ లుక్కేద్దాం.
1. Royal Enfield Hunter 350 :యూత్ లో మంచి క్రేజ్ ఉన్న టూ-వీలర్ బ్రాండ్ రాయల్ ఎన్ ఫీల్డ్. ఈ బ్రాండ్‌లోనే రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 వచ్చింది. ఈ బైక్ 3 వేరియంట్లు, 8 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- ఇంజిన్ కెపాసిటీ - 349.34 సీసీ
- కెర్బ్ వెయిట్ - 177 కేజీలు
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 13 లీటర్లు
- మ్యాక్స్ పవర్ - 20.4 PS @ 6100 rpm
- మ్యాక్స్ టార్క్ - 27 Nm @ 4000 rpm
- మైలేజ్ - 36.2 కి.మీ/లీటర్
- ధర - రూ.1.5 లక్షలు - రూ.1.75 లక్షలు
2. Yamaha MT 15 :యమహా ఎమ్టీ 15 వీ2 బైక్ డిజైన్ యూత్‌ను ఆకట్టుకుంటుంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంపుల ప్రత్యేకమైన డిజైన్ చాలా బాగుంటుంది. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో ఒకటిగా నిలిచింది. ఇది వై-బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. 3 వేరియంట్లు, 8 కలర్ ఆప్షన్లలో ఈ బైక్ లభిస్తుంది.
- ఇంజిన్ కెపాసిటీ - 155 సీసీ
- కెర్బ్ వెయిట్ - 141 కేజీలు
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు
- మ్యాక్స్ పవర్ - 18.4 PS @ 10000 rpm
- మ్యాక్స్ టార్క్ - 14.1 Nm @ 7500 rpm
- మైలేజ్ - 56.87 కి.మీ/లీటర్
- ధర - రూ.1.69 లక్షలు - రూ.1.74 లక్షలు
3. TVS Apache RTR 160 :టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 బైక్ రియర్ డిస్క్‌బ్రేక్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో లభిస్తుంది. అలాగే ఇది 5వేరియంట్లు, 7 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
- ఇంజిన్ కెపాసిటీ - 159.7 సీసీ
- కెర్బ్ వెయిట్ - 137 కేజీలు
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 12 లీటర్లు
- మ్యాక్స్ పవర్ - 16.04 PS @ 8750 rpm
- మ్యాక్స్ టార్క్ - 13.85 Nm @ 7000 rpm
- మైలేజ్ - 47 కి.మీ/లీటర్
- ధర - రూ.1.2 లక్షలు - రూ.1.3 లక్షలు
4. TVS Raider :మంచి లుక్‌తో పాటు మైలేజ్ ఇచ్చే బైక్ కావాలనుకునేవారికి టీవీఎస్ రైడర్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది స్పోర్టీ డిజైన్, మోడ్రన్ ఫీచర్లతో లభిస్తుంది. 6 వేరియంట్లు, 8 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- ఇంజిన్ కెపాసిటీ - 124.8 సీసీ
- కెర్బ్ వెయిట్ - 123 కేజీలు
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు
- మ్యాక్స్ పవర్ - 11.38 PS @ 7500 rpm
- మ్యాక్స్ టార్క్ - 11.2 Nm @ 6000 rpm
- మైలేజ్ - 71.94 కి.మీ/లీటర్
- ధర - రూ.85,010 - రూ.1.04 లక్షలు
5. Honda SP125 :హోండా ఎస్పీ125 బైక్ రెండు వేరియంట్లు, 5 కలర్ ఆప్షన్లలో ఉంటుంది. యూఎస్బీ- సీ ఛార్జింగ్ పోర్ట్, ఎల్ఈడీ హెడ్ లైట్ వంటి ఫీచర్లతో లభిస్తుంది.
- ఇంజిన్ కెపాసిటీ - 125 సీసీ
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 11.2 లీటర్లు
- మ్యాక్స్ పవర్ - 10.87 PS
- మ్యాక్స్ టార్క్ - 10.9 Nm
- మైలేజ్ - 60 కి.మీ/లీటర్
- ధర - రూ.91,771 - రూ.94,627