తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.2 లక్షల బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే బైక్​ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే!

కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? - రూ.2లక్షల బడ్జెట్లో మంచి మైలేజ్, బెస్ట్​ ఫీచర్లతో లభించే బైక్స్ ఇవే!

Best Bikes Under 2 Lakh
Best Bikes Under 2 Lakh (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2024, 5:42 PM IST

Best Bikes Under 2 Lakh :ఇండియాలో బైక్స్​​కు ఎంత క్రేజ్​ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ యువతను ఆకర్షించేందుకు సూపర్​ స్టైలిష్​ లుక్స్​తో, బెస్ట్ పెర్ఫార్మెన్స్, రైడింగ్ ఎక్స్​పీరియన్స్, మైలేజ్​ ఇచ్చే బైక్​లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వాటిలో రూ.2 లక్షల బడ్జెట్లోని టాప్​-10 బైక్స్​ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. Yamaha MT 15 V2
యమహా ఎమ్​టీ 15 వీ2 బైక్ డిజైన్ యూత్​ను ఆకట్టుకుంటుంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంపుల ప్రత్యేకమైన డిజైన్ చాలా బాగుంటుంది. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్​లలో ఒకటిగా నిలిచింది. ఇది వై-బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది.

  • ఇంజిన్ కెపాసిటీ- 155 సీసీ
  • కెర్బ్ వెయిట్-141 కేజీలు
  • ట్రాన్స్​మిషన్- 6 స్పీడ్ మాన్యువల్
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ-10 లీటర్లు
  • సీటు ఎత్తు- 810 మిల్లీమీటర్లు
  • మ్యాక్స్ పవర్-18.1 bhp
  • మ్యాక్స్ టార్క్-14.1 Nm
  • మైలేజ్-48 కి.మీ/లీటర్
  • ధర-రూ.1,98,135

2. Yamaha FZS FI V4
యమహా ఎఫ్​జెడ్ఎస్ ఎఫ్ఐ వీ4 బైక్​ ఫ్రంట్, బ్యాక్ డిస్క్ బ్రేకులను కలిగి ఉంటాయి. లాంగ్ రైడ్​లకు ఈ బైక్ సదుపాయంగా ఉంటుంది. ఆరు కలర్ ఆప్షన్లలో ఈ బైక్ లభిస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ- 149 సీసీ
  • కెర్బ్ వెయిట్-136 కేజీలు
  • ట్రాన్స్​మిషన్- 5 స్పీడ్ మాన్యువల్
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ-13 లీటర్లు
  • సీటు ఎత్తు- 790 మిల్లీమీటర్లు
  • మ్యాక్స్ పవర్- 12.2 bhp
  • మ్యాక్స్ టార్క్- 13.3 Nm
  • మైలేజ్-60 కి.మీ/లీటర్
  • ధర-రూ.1,49,297

3. Hero Xtreme 160R 4V
ఈ బైక్ మంచి లుక్​లో ఉంటుంది. అలాగే స్ప్లిట్ సీటుతో లభిస్తుంది. ఈ బైక్​లో ఉండే మోనో షాక్ అబ్జార్బర్ షాకర్‌ రైడింగ్ ఎక్స్​పీరియన్స్​ను మెరుగుపరుస్తుంది. అలాగే ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్‌, పొజిషన్ ల్యాంప్​తో కూడిన ఎల్​ఈడీ హెడ్ లైట్, కేవైబీ అప్​సైడ్ డౌన్ ఫోర్క్స్ వంటి ఫీచర్లు ఈ బైక్​లో ఉంటాయి.

  • ఇంజిన్ కెపాసిటీ- 163.2 సీసీ
  • కెర్బ్ వెయిట్-144 కేజీలు
  • ట్రాన్స్ మిషన్- 5 స్పీడ్ మాన్యువల్
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ-12 లీటర్లు
  • సీటు ఎత్తు- 795 మిల్లీమీటర్లు
  • మ్యాక్స్ పవర్- 16.9 bhp
  • మ్యాక్స్ టార్క్- 14.6 Nm
  • మైలేజ్-45 కి.మీ/లీటర్
  • ధర-రూ. 1,51,459

4. Bajaj Pulsar N160
బజాజ్ పల్సర్ ఎన్​160 ఎల్ఈడీ షార్ప్ టైలాంప్​తో లభిస్తుంది. ఇది బైక్ మొత్తం లుక్​నే మార్చేస్తుంది. గుంతలు, కుదుపులు ఉన్న రోడ్డుపై ఈ బైక్​తో సాఫీగా ప్రయాణించవచ్చు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, టర్న్ ఇండికేటర్స్ సైన్, న్యూట్రల్ సైన్, క్లాక్, స్పీడ్ అండ్ గేర్ నంబర్ వంటి ఫీచర్లతో ఈ బైక్ లభిస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ- 164.82 సీసీ
  • కెర్బ్ వెయిట్-152 కేజీలు
  • ట్రాన్స్​మిషన్- 5 స్పీడ్ మాన్యువల్
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ-14 లీటర్లు
  • సీటు ఎత్తు- 795 మిల్లీమీటర్లు
  • మ్యాక్స్ పవర్- 16 bhp
  • మ్యాక్స్ టార్క్- 14.65 Nm
  • మైలేజ్- 51.5 కి.మీ/లీటర్
  • ధర-రూ. 1,44,766

5. Yamaha FZ X
యమహా ఎఫ్​జెడ్ ఎక్స్ బైక్​లో వై బ్లూటూత్ కనెక్టివిటీ, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ వంటి ఫీచర్లు ఉంటాయి.

  • ఇంజిన్ కెపాసిటీ- 149 సీసీ
  • కెర్బ్ వెయిట్-139 కేజీలు
  • ట్రాన్స్ మిషన్- 5 స్పీడ్ మాన్యువల్
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ-10 లీటర్లు
  • సీటు ఎత్తు- 810 మిల్లీమీటర్లు
  • మ్యాక్స్ పవర్- 12.4 bhp
  • మ్యాక్స్ టార్క్- 13.3 Nm
  • మైలేజ్- 48 కి.మీ/లీటర్
  • ధర-రూ. 1,57,951

6. Honda Hornet 2.0
హోండా హార్నెట్ 2.0 అనేది హార్నెట్ 160 రివైజ్డ్ మోడల్. ఈ బైక్ స్పోర్టీ లుక్​లో ఉంటుంది. ఇది మంచి రైడింగ్ ఎక్స్ పీరియన్స్​ను అందిస్తుంది. ఎల్ఈడీ హెడ్‌ లైట్లు, టెయిల్ ల్యాంప్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్, ఫ్యూయల్ గేజ్, గేర్ ఇండికేటర్ వంటి ఫీచర్లతో లభిస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ- 184.4 సీసీ
  • కెర్బ్ వెయిట్-149 కేజీలు
  • ట్రాన్స్​మిషన్- 5 స్పీడ్ మాన్యువల్
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ-12 లీటర్లు
  • సీటు ఎత్తు- 790 మిల్లీమీటర్లు
  • మ్యాక్స్ పవర్- 17.26 bhp
  • మ్యాక్స్ టార్క్- 15.9 Nm
  • మైలేజ్- 57.53 కి.మీ/లీటర్
  • ధర-రూ. 1,44,766

7. Suzuki Gixxer SF
సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ బైక్​తో హైవేపై సాఫీగా ప్రయాణం చేయవచ్చు. ఇది హైవేలపై మరింత శక్తిని, ట్రాక్షన్​ను అందిస్తుంది. ఇది స్పోర్ట్స్ బైక్ లుక్​లో ఉంటుంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, ఫ్యూయల్ గేజ్ ఇండికేషన్, గేర్ ఇండికేషన్, స్పీడోమీటర్, క్లాక్, ఓడోమీటర్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి.

  • ఇంజిన్ కెపాసిటీ- 155 సీసీ
  • కెర్బ్ వెయిట్-148 కేజీలు
  • ట్రాన్స్​మిషన్- 5 స్పీడ్ మాన్యువల్
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ-12 లీటర్లు
  • సీటు ఎత్తు- 795 మిల్లీమీటర్లు
  • మ్యాక్స్ పవర్- 13.6 bhp
  • మ్యాక్స్ టార్క్- 13.8 Nm
  • మైలేజ్- 45 కి.మీ/లీటర్
  • ధర-రూ. 1,44,766

8. TVS Apache RTR 160
టీవీఎస్ అపాచీ ఆర్​టీఆర్ 160 బైక్ ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయ్యింది. రైడర్ల భద్రతను మెరుగుపరచడానికి డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, స్పీడోమీటర్, ఓడోమీటర్, ఆర్​పీఎం మీటర్, ఫ్యూయల్ గేజ్ ఇండికేషన్, గేర్ షిఫ్టింగ్ వంటి ఫీచర్లతో లభిస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ- 159.7 సీసీ
  • కెర్బ్ వెయిట్-137 కేజీలు
  • ట్రాన్స్​మిషన్- 5 స్పీడ్ మాన్యువల్
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ-12 లీటర్లు
  • సీటు ఎత్తు- 790 మిల్లీమీటర్లు
  • మ్యాక్స్ పవర్- 16.04 bhp
  • మ్యాక్స్ టార్క్- 13.85 Nm
  • మైలేజ్- 47 కి.మీ/లీటర్
  • ధర-రూ. 1,43,177

9. Yamaha R15S
యమహా బైక్​ను యువత బాగా ఇష్టపడుతుంటారు. అందుకే దీనికి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇది ఫైబర్ బాడీతో లభిస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ- 155 సీసీ
  • కెర్బ్ వెయిట్-142 కేజీలు
  • ట్రాన్స్​మిషన్- 5 స్పీడ్ మాన్యువల్
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ-11 లీటర్లు
  • సీటు ఎత్తు- 815 మిల్లీమీటర్లు
  • మ్యాక్స్ పవర్- 18.4 bhp
  • మ్యాక్స్ టార్క్- 14.2 Nm
  • మైలేజ్- 43.5 కి.మీ/లీటర్
  • ధర-రూ. 1,95,335

10. Bajaj Pulsar NS160
ఈ బైక్ మంచి డిజైన్​తో మార్కెట్లోకి వచ్చింది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఈ బైక్​లో ఉన్నాయి.

  • ఇంజిన్ కెపాసిటీ- 160.3 సీసీ
  • కెర్బ్ వెయిట్-152 కేజీలు
  • ట్రాన్స్​మిషన్- 5 స్పీడ్ మాన్యువల్
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ-12 లీటర్లు
  • సీటు ఎత్తు- 805 మిల్లీమీటర్లు
  • మ్యాక్స్ పవర్- 17.2 bhp
  • మ్యాక్స్ టార్క్- 14.6 Nm
  • మైలేజ్- 52.2 కి.మీ/లీటర్
  • ధర-రూ. 1,52,717

ABOUT THE AUTHOR

...view details