తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.1 లక్ష బడ్జెట్లో మంచి బైక్ కొనాలా? టాప్‌-10 ఆప్షన్స్ ఇవే!

అదిరే డిజైన్, స్టన్నింగ్ ఫీచర్లతో మంచి మైలేజ్ ఇచ్చే టాప్​-10 బైక్స్ ఇవే!

Bikes
Bikes (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2024, 5:09 PM IST

Best Bikes Under 1 Lakh :ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు తమకంటూ ఒక మంచి బైక్ కొనుక్కోవాలని ఆశపడతారు. అందుకే తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే టూ-వీలర్స్ కోసం చూస్తుంటారు. వీరిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ టూ-వీలర్ తయారీ కంపెనీలు తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్స్, స్పెక్స్, బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్​లను మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటిలో రూ.1 లక్ష బడ్జెట్లో లభించే టాప్-10 బైక్స్ గురించి ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

1. Honda SP 125 :రోజువారి ప్రయాణాలు చేసేవారికి హోండా ఎస్​పీ 125 బాగా ఉపయోగపడుతుంది. మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలని అనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

  • ఇంజిన్‌ - 124 సీసీ
  • మైలేజ్‌ - 65 కి.మీ/ లీటర్‌
  • కెర్బ్ వెయిట్ - 117 కేజీలు
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 11.2 లీటర్లు
  • సీట్ హైట్ - 790 మిల్లీ మీటర్లు
  • పవర్ -10.72 bhp @ 7500 rpm
  • టార్క్ -10.9 Nm @ 6000 rpm
  • ధర - రూ.87,468 - రూ.91,468

2. Honda Shine :రూ.90వేలు బడ్జెట్లో లభిస్తున్న బెస్ట్ టూ-వీలర్స్​లో హోండా షైన్ ఒకటి. ఇది అత్యంత పాపులర్ బైక్. దీని డిజైన్ చాలా బాగుంటుంది.

  • ఇంజిన్‌ - 125 సీసీ
  • మైలేజ్‌ - 55 కి.మీ/ లీటర్‌
  • కెర్బ్ వెయిట్ - 114 కేజీలు
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 10.5 లీటర్లు
  • సీట్ హైట్ - 791 మిల్లీ మీటర్లు
  • పవర్ -10.59 bhp @ 7500 rpm
  • టార్క్ -11 Nm @ 6000 rpm
  • ధర - రూ.81,251 -రూ.85,251

3. TVS Raider 125 : టీవీఎస్ రైడర్ 125 అనేది స్పోర్టీ లుక్​లో ఉంటుంది. ఎల్ఈడీ హెడ్‌ ల్యాంపులు, ఎల్​సీడీ ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్​బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లతో ఈ బైక్ లభించనుంది.

  • ఇంజిన్‌ - 124.8 సీసీ
  • మైలేజ్‌ - 56.7 కి.మీ/ లీటర్‌
  • కెర్బ్ వెయిట్ - 123 కేజీలు
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు
  • సీట్ హైట్ - 780 మిల్లీ మీటర్లు
  • పవర్ - 11.2 bhp @ 7500 rpm
  • టార్క్ - 11.2 Nm @ 6000 rpm
  • ధర - రూ.84,869 - రూ.1.04 లక్షలు

4. Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ ఒక లీటర్ పెట్రోల్​కు 80 కి.మీలకు పైగా మైలేజ్ ఇస్తుంది. దీని మెయింటెన్స్​ ఖర్చు చాలా తక్కువ.

  • ఇంజిన్‌ - 97.2 సీసీ
  • మైలేజ్‌ - 80.6 కి.మీ/ లీటర్‌
  • కెర్బ్ వెయిట్- 112 కేజీలు
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 9.8 లీటర్లు
  • సీట్ హైట్ - 785 మిల్లీ మీటర్లు
  • పవర్ - 7.91 bhp @ 8000 rpm
  • టార్క్ - 8.05 Nm @ 6000 rpm
  • ధర - రూ.76,676 - రూ.79,426

5. Bajaj Pulsar 125 :బజాజ్ పల్సర్ 125 అనేది స్పోర్ట్స్ బైక్. ఇది 2 వేరియంట్లు, 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్​లో ఫ్రంట్ డిస్క్​ బ్రేక్, రియర్ డ్రమ్​ బ్రేక్ ఉంటాయి.

  • ఇంజిన్‌ - 124.4 సీసీ
  • మైలేజ్‌ - 50 కి.మీ/ లీటర్‌
  • కెర్బ్ వెయిట్ - 140 కేజీలు
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 11.5 లీటర్లు
  • సీట్ హైట్ - 780 మిల్లీ మీటర్లు
  • పవర్ - 11.64 bhp @ 8500 rpm
  • టార్క్ - 10.8 Nm @ 6500 rpm
  • ధర - రూ.92,883 - రూ.97,133

6. Hero Xtreme 125R : ఈ బైక్ మంచి లుక్​లో ఉంటుంది. మంచి మైలేజ్ ఇచ్చే బైకుల్లో ఇదొకటి.

  • ఇంజిన్‌ -124.6 సీసీ
  • మైలేజ్‌ - 66 కి.మీ/ లీటర్‌
  • కెర్బ్ వెయిట్ - 136 కేజీలు
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు
  • సీట్ హైట్ - 794 మిల్లీ మీటర్లు
  • పవర్ - 11.4 bhp @ 8250 rpm
  • టార్క్ - 10.5 Nm @ 6000 rpm
  • ధర - రూ.95,000 - రూ.99,500

7. Bajaj Freedom 125 :బజాజ్ ఫ్రీడమ్ 125 అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్​జీ మోటార్‌ సైకిల్. ఎల్‌ఈడీ హెడ్​లైట్లు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఎల్​సీడీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కాల్ రిసీవింగ్ బటన్ వంటి ఫీచర్లు ఈ బైక్​లో ఉంటాయి.

  • ఇంజిన్‌ - 125 సీసీ
  • మైలేజ్‌ - 65 కి.మీ/ లీటర్‌
  • కెర్బ్ వెయిట్ - 147.8 కేజీలు
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 2 లీటర్లు
  • పవర్ - 9.5 Ps @ 8000 rpm
  • టార్క్ - 9.7 Nm @ 5000 rpm
  • ధర - రూ.89,997 - రూ.1.10 లక్షలు

8. Hero Glamour : హీరో గ్లామర్ 2 వేరియంట్లు, 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది రోజువారీ ప్రయాణాలు చేసేవారికి సౌకర్యవంతంగా ఉంటుంది.

  • ఇంజిన్‌ - 124.7 సీసీ
  • మైలేజ్‌ - 55 కి.మీ/ లీటర్‌
  • కెర్బ్ వెయిట్ - 122.5 కేజీలు
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు
  • సీట్ హైట్ - 790 మిల్లీ మీటర్లు
  • పవర్ - 10.53 PS @ 7500 rpm
  • టార్క్ - 10.4 Nm @ 6000 rpm
  • ధర - రూ. 82,598 - రూ.86,598

9. Revolt Motors RV1 :రివోల్ట్ మోటార్స్ ఆర్​వీ1 ఈవీ స్కూటర్ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తుంది. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 160 కి.మీల రేంజ్ వరకు ప్రయాణించవచ్చు.

  • రేంజ్ - 100 కి.మీ/ఛార్జ్
  • ఛార్జింగ్ టైమ్ - 2.15 గంటలు
  • బ్యాటరీ కెపాసిటీ - 2.2 kwh
  • ఇన్​స్ట్రూమెంట్ కన్సోల్ - డిజిటల్
  • ధర - రూ.84,990 - రూ.99,990

10. Atumobile Atum Vader :ఈ బైక్ సింగిల్​ వేరియంట్​లో, 5 కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిపై గంటకు 65 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. ఈ బైక్ సీటు ఎత్తు 809 మిల్లీమీటర్లు.

  • రేంజ్- 82 కి.మీ/ఛార్జ్​
  • మ్యాక్స్ స్పీడ్ - 65 కి.మీ/గంట
  • ఛార్జింగ్ టైమ్ - 3-4 గంటలు
  • ధర - రూ.99,999

ABOUT THE AUTHOR

...view details