Best Bike Rental Apps Of India In 2024 :ఇండియాలో గత పదేళ్లలో అద్దెకు బైక్‌లు తీసుకోవడం బాగా పెరిగింది. సొంతంగా బైక్ కొనలేనివాళ్లు, అత్యవసరంగా ప్రయాణం చేయాలనుకునే వాళ్లు, అద్దెకు బైక్‌లను తీసుకోవడం ఎక్కువగా జరుగుతోంది. ఇందుకోసం ప్రస్తుతం చాలా బైక్ రెంటింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలోని టాప్-5 యాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ బైక్ రెంటల్ యాప్‌ల్లో 24 గంటలు, 48 గంటలు, 72 గంటలు, ఒక వారం, ఒక నెల, ఇలా ఎంత కాలానికైనా బైక్‌ను అద్దెకు తీసుకోవచ్చు.
బైక్ రెంటల్ యాప్ ఎలా పని చేస్తుంది?
బైక్ రెంటల్ యాప్స్ ఉపయోగించడానికి చాలా ఈజీగా ఉంటాయి. తక్కువ రుసుముతోనే అత్యుత్తమ బైక్‌లను అందిస్తూ, వినియోగదారులకు ఎలాంటి అడ్డంకులు లేని, మంచి ఎక్స్‌పీరియన్స్ అందించడమే లక్ష్యంగా బైక్ రెంటల్ యాప్స్ పనిచేస్తాయి. ఐఓఎస్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు రెండింటికీ మెజారిటీ యాప్‌లు సపోర్ట్ చేస్తాయి. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ యాప్స్ ద్వారా సేఫ్‌గా పేమెంట్స్ కూడా చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
- స్టెప్ 1: యాప్‌లో రిజిస్టర్ చేసుకొని, లాగిన్ కావాలి.
- స్టెప్ 2: బుకింగ్ తేదీ, పికప్ లొకేషన్‌ను ఎంటర్ చేయాలి.
- స్టెప్ 3: బైక్స్ లిస్ట్‌లోని మీ నచ్చిన టూ-వీలర్‌ను ఎంచుకోవాలి.
- స్టెప్ 4: మీ లొకేషన్‌ను ఎంటర్ చేసి, బైక్‌ను రిజర్వ్ చేసుకోవాలి.
- స్టెప్ 5: పేమెంట్ చేసే ముందు, రివ్యూ కార్ట్ పేజీలోని మొత్తం సమాచారాన్ని ఒకసారి సరిచూసుకోవాలి.
- స్టెప్ 6: చివరగా, రిజర్వేషన్‌ను కన్ఫార్మ్ చేసుకోవాలి.
- స్టెప్ 7: ఈ విధంగా బైక్‌ను రెంట్‌కు తీసుకోవచ్చు.
- స్టెప్ 8: లేదా అదనపు రుసుము చెల్లించి మీ చిరునామాకు డెలివరీ కూడా పెట్టుకోవచ్చు.
- స్టెప్ 9: మీ పని పూర్తైన తరువాత, కంపెనీకి మీ బైక్‌ను అప్పగిస్తే సరిపోతుంది.
ఇప్పుడు ఇండియాలో ఉన్న టాప్-5 బైక్ రెంటల్ యాప్స్ గురించి తెలుసుకుందాం.
1. Drivezy :మీరు కొద్దిపాటి సెక్యూరిటీ డిపాజిట్ కట్టి, డ్రైవ్జీ నుంచి బైక్‌ని అద్దెకు తీసుకోవచ్చు. భారతదేశంలోని 5 ప్రధాన నగరాల్లో ఈ బైక్ రెంటల్ యాప్ సేవలు అందిస్తోంది. అవి: బెంగళూరు, హైదరాబాద్, పుణె, ముంబయి, దిల్లీ. ఈ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు అందరికీ అందుబాటులో ఉంటుంది.
సర్వీసెస్ :
- హోమ్ పికప్ & డ్రాప్ ఆప్షన్.
- మొదటిసారి కారు, బైక్, స్కూటర్ - ఏది బుక్ చేసినా 10% డిస్కౌంట్.
- కార్లలో ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ లాంటి సేఫ్టీ ఫీచర్స్
- ప్రస్తుతం ఈ యాప్ రేటింగ్: 2.4
2. Rent a Bike Howdy :మీరే స్వయంగా బైక్ డ్రైవ్ చేయాలనుకుంటే, ఈ రెంట్ ఏ బైక్ హౌడీ యాప్‌లో టూ-వీలర్‌ను బుక్ చేసుకోవచ్చు.
ఈ యాప్ “కమ్యూట్ మోడ్ ఫంక్షన్” ద్వారా మీ సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చు. అలాగే మీకు కావాల్సిన లొకేషన్‌లోనే బండి తీసుకొని, మరొక చోట దానిని తిరిగి కంపెనీకి అప్పగించవచ్చు. ఛార్జీలు ప్రయాణించిన దూరం, గడిపిన సమయం ఆధారంగా ఉంటాయి మరీ ముఖ్యంగా మీకు ఇచ్చిన వాహనానికి హెల్మెట్ కూడా ఇస్తారు.
సర్వీసెస్ :
- రోజు, వారం లేదా నెలకు చొప్పున బైక్స్, స్కూటర్స్ అద్దెకు తీసుకోవచ్చు.
- ప్రస్తుతం ఈ యాప్ రేటింగ్ : 3.1