Bank Holidays In March 2024 :ఆర్బీఐ ఈ2024 మార్చి నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 14 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఈ సెలవుల్లో జాతీయ సెలవులు సహా, కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం మంచిది.
2024 మార్చి నెలలో బ్యాంక్ సెలవుల జాబితా
List of Bank Holidays In March 2024 :
- మార్చి 1 (శుక్రవారం) : చాప్‌చార్ కుట్ (మిజోరాంలోని బ్యాంకులకు సెలవు)
- మార్చి 3 (ఆదివారం)
- మార్చి 8 (శుక్రవారం) :మహాశివరాత్రి (దిల్లీ, బిహార్, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, బంగాల్, మిజోరాం, అసోం, మణిపుర్, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, ఇటానగర్, గోవా రాష్ట్రాలు మినహాయించి మిగతా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు)
- మార్చి 9 (రెండో శనివారం)
- మార్చి 10 (ఆదివారం)
- మార్చి 17 (ఆదివారం)
- మార్చి 22 (శుక్రవారం) : బిహార్ దివస్ (బిహార్‌లోని బ్యాంకులకు సెలవు)
- మార్చి 23 (నాల్గో శనివారం)
- మార్చి 24 (ఆదివారం)
- మార్చి 25 (సోమవారం) : హోలీ (కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపుర్, కేరళ, నాగాలాండ్, బిహార్, శ్రీనగర్ మినహాయించి మిగతా రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
- మార్చి 26 (మంగళవారం) :యోసాంగ్ వేడుక/ హోలీ (ఒడిశా, మణిపుర్, బిహార్‌లోని బ్యాంకులకు సెలవు)
- మార్చి 27 (బుధవారం) : హోలీ (బిహార్‌లోని బ్యాంకులకు సెలవు)
- మార్చి 29 (శుక్రవారం) :గుడ్ ఫ్రైడే (త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు)
- మార్చి 31 (ఆదివారం)