Bank Holidays In January 2025 :రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2025 జనవరి నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 13 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం మంచిది.
List Of Bank Holidays In January 2025
2025 జనవరి నెలలో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే!
జనవరి 1 (బుధవారం) : న్యూ ఇయర్ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
జనవరి 2 (గురువారం) : కొత్త సంవత్సరం సందర్భంగా మిజోరంలో; మన్నం జయంతి సందర్భంగా కేరళలోని బ్యాంకులకు సెలవు.
జనవరి 6 (సోమవారం) : గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా హరియాణా, పంజాబ్‌ల్లోని బ్యాంక్‌లకు సెలవు.
జనవరి 11 (శనివారం) : మిషనరీ డే సందర్భంగా మిజోరంలో; గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా రాజస్థాన్‌లోని బ్యాంకులకు సెలవు.
జనవరి 12 (ఆదివారం) : ఆదివారం బ్యాంకులు సెలవు. అయితే ఆ రోజు స్వామీ వివేకనంద జయంతి, గాన్-నగై (మణిపుర్) కూడా ఉన్నాయి.
జనవరి 14 (మంగళవారం) : మకర సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు; పొంగల్ సందర్భంగా తమిళనాడులోని బ్యాంకులకు హాలీడే ఉంటుంది.