Bank Holidays In February 2024 : బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను ప్రకటించింది. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకోవడం మంచిది. లేకుంటే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఆర్బీఐ ప్రతి నెలా బ్యాంక్ సెలవుల (Bank Holidays) జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా 2024 ఫిబ్రవరి నెలలోని సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. ఈ సెలవుల్లో జాతీయ సెలవులు సహా, కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. అందుకే ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
2024 ఫిబ్రవరి నెలలో బ్యాంక్ సెలవుల జాబితా
List of Bank Holidays In February 2024 :
- ఫిబ్రవరి 4 (ఆదివారం)
- ఫిబ్రవరి 10 (రెండో శనివారం)
- ఫిబ్రవరి 11 (ఆదివారం)
- ఫిబ్రవరి 14 (బుధవారం) : వసంత పంచమి/ సరస్వతి పూజ సందర్భంగా త్రిపుర, ఒడిశా, బంగాల్ల్లోని బ్యాంకులకు సెలవు.
- ఫిబ్రవరి 15 (గురువారం):లుయి-న్గై-ని పండుగ సందర్భంగా మణిపుర్‌లోని బ్యాంక్‌లకు సెలవు.
- ఫిబ్రవరి 18 (ఆదివారం)
- ఫిబ్రవరి 19 (సోమవారం) : ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- ఫిబ్రవరి 20 (మంగళవారం) : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అరుణాచల్‌ప్రదేశ్, మిజోరంల్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- ఫిబ్రవరి 24 (నాల్గో శనివారం)
- ఫిబ్రవరి 25 (ఆదివారం)
- ఫిబ్రవరి 26 (సోమవారం) : న్యోకుమ్ పర్వదినం సందర్భంగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని బ్యాంకులకు సెలవు.