Bajaj Bruzer CNG Bike Launch : బజాజ్ ఆటో కంపెనీ ప్రపంచంలోనే మొదటి సీఎన్జీ మోటార్ సైకిల్‌ను రూపొందించింది. దీనికి బ్రూజర్ (Burzer) అని పేరు పెట్టింది. ఈ జూన్ 18న దీనిని ఇండియన్ మార్కెట్లో దీనిని లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది.
జూన్ 18న లాంఛ్
బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ 2024 జూన్ 18న ఈ బ్రూజర్ సీఎన్జీ మోటార్‌సైకిల్‌ను లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే దీనిని నేరుగా బజాజ్ బ్రాండ్‌తో కాకుండా, బజాజ్ సబ్-బ్రాండ్ కింద తెస్తామని వెల్లడించారు.
Bajaj Bruzer CNG Bike Features :
ఈ బజాజ్ బ్రూజర్ను ఒక కమ్యూటర్ బైక్‌గా రూపొందించారు. భారీ స్థాయిలో అమ్మకాలు జరపడమే లక్ష్యంగా దీనిని తీసుకువచ్చారు. దీనిని వివిధ ప్రాంతాల్లో దశలవారీగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
- ఈ బజాజ్ సీఎన్జీ బైక్ 110 సీసీ -125 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్, 5-స్పీడ్ ట్రాన్స్మిషన్ అనుసంధానంతో వస్తుందని తెలుస్తోంది. దీనిలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ కూడా ఉంది. ఈ బ్రూజర్ బైక్‌లో ముందు వైపు డిస్క్ బ్రేక్స్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి.
- ఈ బజాజ్ బ్రూజర్ బైక్‌లో వృత్తాకార ఎల్ఈడీ హెడ్‌లైట్, చిన్న ఫ్లైస్క్రీన్, నిటారుగా ఉండే హ్యాండిల్ బార్, సంప్ గార్డ్, హాలోజన్ టర్న్ సిగ్నల్స్, నకిల్ గార్డ్లు అమర్చారు.
- ఈ బజాజ్ బ్రూజర్ బైక్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు, పొడవైన సీటు, ట్యూబులర్ గ్రాబ్ రైల్ ఉంటాయి. అలాగే దీనికి ప్రత్యేకంగా సైడ్-మౌంటెడ్ ఎగ్జాస్ట్ యూనిట్, బ్లాక్ ఫినిష్డ్ అల్లాయ్ వీల్స్ అమర్చారు. అలాగే దీనిలో మిడ్-మౌంటెడ్ ఫుట్‌పెగ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌లను ఇన్స్టాల్ చేశారు. సాధారణ ఫ్యూయెల్ ట్యాంక్ దిగువన సీఎన్జీ ట్యాంక్‌ను అమర్చారు. అందువల్ల ఈ బైక్ పెట్రోల్‌తోనూ, సీఎన్జీతోనూ నడపడానికి వీలుగా ఉంటుంది.
ఎక్కువ మైలేజ్!
చాలా మంది మంచి మైలేజ్ ఇచ్చే బైక్‌లు కొనాలని ఆశపడుతూ ఉంటారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే, బజాజ్ కంపెనీ ఈ నయా సీఎన్జీ బైక్‌ను రూపొందించింది. త్వరలో మరిన్ని సీఎన్జీ టూ-వీలర్స్ తీసుకువచ్చేందుకు కూడా కంపెనీ ప్లాన్ చేస్తోంది.