తెలంగాణ

telangana

ETV Bharat / business

అది ఫేక్ న్యూస్​ - అస్సలు నమ్మవద్దు - అనంత్ అంబానీ వివాహ వేడుకలపై లండన్​ స్టార్​ హోటల్ ప్రకటన - Anant Ambani Radhika Post Wedding - ANANT AMBANI RADHIKA POST WEDDING

Anant Ambani Radhika Post Wedding: అనంత్ అంబానీ - రాధిక మర్చంట్​ లండన్​లోని సెవెన్ స్టార్ స్టోక్ పార్క్ హోటల్‌లో పెళ్లి వేడుకల కోసం రిజర్వేషన్ చేసుకున్నారని వచ్చిన వార్తలు ఫేక్ అని తేలింది. ప్రిన్స్ హ్యారీ, యూకే మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ వంటి ప్రముఖ వ్యక్తులు వీరి వివాహ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందనే వార్తలు కూడా నిరాధారణమైనవి స్పష్టం అయ్యింది. పూర్తి వివరాలు ఇవే!

Anant Radhika Post Wedding
Anant Radhika Post Wedding (Source: ANI - ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 25, 2024, 8:56 PM IST

Updated : Jul 26, 2024, 1:36 PM IST

Anant Ambani Radhika Post Wedding:అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ దంపతులు లండన్​లోని ప్రతిష్ఠాత్మక 7 స్టార్​ హోటల్​లో వివాహ వేడుకలు చేసుకున్నారన్న వార్తలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టమైంది. ఇప్పటికే లండన్‌లోని సెవెన్ స్టార్ స్టోక్ పార్క్ హోటల్‌ ఈ ఫేక్ న్యూస్​ను ఖండించింది. సాధారణంగా తాము ప్రైవేట్ వ్యవహారాల గురించి మాట్లాడమని, కానీ మీడియాలో తప్పుడు వార్తలు వచ్చిన నేపథ్యంలో, దీనిపై క్లారిటీ ఇస్తున్నామని పేర్కొంది. తమ హోటల్​లో అనంత్-రాధిక దంపతులు ఎలాంటి వేడుకలు చేసుకోలేదని స్పష్టం చేసింది. అంబానీ కుటుంబ సన్నిహితులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

ఇది ఫేక్ న్యూస్​
బిలియనీర్ ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడైన అనంత్ అంబానీ - రాధిక మర్చంట్​ పోస్ట్ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ కోసం లండన్‌లోని సెవెన్ స్టార్ స్టోక్ పార్క్ హోటల్‌లో ఎక్స్‌క్లూజివ్‌ రిజర్వేషన్స్‌ పొందినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి తోడు ప్రిన్స్ హ్యారీ, యూకే మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ వంటి ప్రముఖ వ్యక్తులు వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని రాశాయి. కానీ ఇవేవీ వాస్తవం కాదని స్వయంగా అంబానీ కుటుంబ వర్గాలు తెలిపాయి.

కనీవినీ ఎరుగుని రీతిలో పెళ్లివేడుకలు
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ ఈ నెల 12న ఓ ఇంటి వాడయ్యారు. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్- శైల దంపతుల కుమార్తె రాధిక మర్చంట్‌ మెడలో మూడు ముళ్లు వేశారు. ముంబయిలో అనంత్​, రాధిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి దేశ, విదేశాల నుంచి సినీ తారలు, క్రీడాకారులు, వ్యాపార ప్రముఖులు సహా అన్ని రంగాలకు చెందిన అతిరథ, మహారథులు హాజరయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లికి ఏకంగా రూ.5వేల కోట్లు ఖర్చైనట్లు ప్రచారం సాగుతోంది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్​ అయ్యాయి.

వేరే లెవెల్​లో అనంత్ బరాత్- అంబానీ ఇంట పెళ్లా మజాకా! - Anant Radhika Wedding

అనంత్-రాధిక పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా? కొడుకు కోసం అంబానీ చేసింది అంతేనా! - Anant Ambani Radhika Wedding

Last Updated : Jul 26, 2024, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details