Amazon launches AI Bot Rufus :దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, తమ వినియోగదారుల షాపింగ్ అనుభూతిని మెరుగుపరచడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏఐ-ఆధారిత షాపింక్ టూల్ 'రూఫస్' (Rufus AI Shoping Assistant)ను ఆవిష్కరించింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ రూఫస్‌ను డిజైన్ చేసినట్లు తెలిపింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో దాదాపు అన్ని పరిశ్రమలు తమ వ్యాపారాలను ఏఐతో అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో రిటైల్ మార్కెట్లో అమెజాన్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ కారణాల వల్ల పోటీ తట్టుకుని నిలబడేలా, మార్కెట్లో తమ షేర్‌ను నిలబెట్టుకునేలా అమెజాన్ రూఫస్‌ను తీసుకొచ్చింది.
అమెజాన్ రూఫస్తో కీవర్డ్ సెర్చ్ లేకుండా షాపింగ్ చేయొచ్చు. రూఫస్‌ను వివిధ ప్రశ్నలు అడిగి షాపింగ్ గురించి సలహాలు తీసుకోవచ్చు. వినియోగదారులకు మంచి షాపింగ్ ఎక్స్‌పీరియెన్స్ కలిగించడానికి రూఫస్ ఏఐకి- అమెజాన్ షాపింగ్ కాటలాగ్, కస్టమర్ రివ్యూస్, కమ్యూనిటీ క్వశ్చన్ & ఆన్సర్స్‌పై శిక్షణ ఇస్తున్నారు. తద్వారా రూఫస్ వినియోగదారులకు ప్రొడక్ట్ రికమెండేషన్స్, కంపారిజన్ వంటి సేవలు సులభంగా అందిస్తుంది.