కస్టమర్లకు ఎయిర్‌టెల్ షాక్- రీఛార్జ్ టారిఫ్‌లు పెంపు- అప్పటి నుంచే కొత్త ధరలు! - Airtel Revised Mobile Tariffs
Airtel Revised Mobile Tariffs : ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ టారిఫ్ రేట్లను పెంచనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రిలయన్స్ జియో రీఛార్జి రేట్లను 12-15 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. తాజాగా ఎయిర్‌టెల్ కూడా టారిఫ్‌లపై 11-21 శాతం పెరుగుదల ఉంటుందని పేర్కొంది. జులై 3 నుంచి పెంపు వర్తించనుంది.
Airtel Revised Mobile Tariffs :ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ టారిఫ్ రేట్లను పెంచనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రిలయన్స్ జియో రీఛార్జి రేట్లను 12-15 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. తాజాగా ఎయిర్‌టెల్ కూడా టారిఫ్‌లపై 10-21 శాతం పెరుగుదల ఉంటుందని పేర్కొంది. జులై 3 నుంచి పెంపు వర్తించనుంది.
ఒక్కో వినియోగదారుడిపై వచ్చే ఆదాయం (ARPU) రూ.300కు పైగా ఉండాల్సిన అవసరం ఉందని ఎయిర్ టెల్ వెల్లడించింది. అందులోభాగంగానే టారిఫ్‌లను పెంచుతున్నట్లు తెలిపింది. పెంపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగిస్తామని పేర్కొంది. పెంపు రోజుకు 70 పైసల కంటే తక్కువే ఉందని వివరించింది.
ప్రీపెయిడ్ సహా పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను సైతం ఎయిర్‌టెల్ సవరించింది. అందులో 3 ప్రీపెయిడ్ అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్లు, 9 ప్రీపెయిడ్ డెయిలీ డేటా ప్లాన్లు, 3 ప్రీపెయిడ్ డేటా యాడ్-ఆన్ ప్లాన్లు, 4 పోస్ట్ పెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. అయితే ఈ ప్లాన్లతో వచ్చే కాల్ మినిట్స్, ఫ్రీ డేటా వంటి బెనిఫిట్స్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. సవరించిన టారిఫ్
కొత్త/పాత ధరలు ఇవే :
అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్
ప్లాన్/ పాత ధర
వ్యాలిడిటి
బెనిఫిట్స్
సవరించిన ధర
రూ.179
28(రోజులు)
2GB data, UL Calling, 100 SMS/day
199
రూ.455
84
6GB data, UL calling, 100SMS/day
509
రూ.1799
365
24GB data, UL calling, 100 SMS/day
1999
డెయిలీ ప్లాన్స్
ప్లాన్/ పాత ధర
వ్యాలిడిటి
బెనిఫిట్స్
సవరించిన ధర
రూ. 265
28(రోజులు)
1GB/day, UL Calling, 100 SMS/day
రూ.299
రూ.299
28
1.5GB/day, UL Calling, 100 SMS/day
రూ.349
రూ.359
28
2.5GB/day, UL Calling, 100 SMS/day
రూ.409
రూ.399
28
3GB/day, UL Calling, 100 SMS/day
రూ.449
రూ.479
56
1.5GB/day, UL Calling, 100 SMS/day
రూ.579
రూ.549
56
2GB/day, UL Calling, 100 SMS/day
రూ.649
రూ.719
84
1.5GB/day, UL Calling, 100 SMS/day
రూ.859
రూ.839
84
2GB/day, UL Calling, 100 SMS/day
రూ.979
రూ.2999
365
2GB/day, UL Calling, 100 SMS/day
రూ.3599
డేటా యాడ్-ఆన్స్
ప్లాన్/ పాత ధర
వ్యాలిడిటి
బెనిఫిట్స్
సవరించిన ధర
రూ.19
1(రోజులు)
1GB
రూ.22
రూ.29
1
2GB
రూ.33
రూ.65
ప్లాన్ వ్యాలిడిటీ
4GB
రూ.77
పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు
రూ.449 ప్లాన్: ఈ ప్లాన్ రోల్‌ఓవర్, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో 40GB డేటాను అందిస్తుంది.
రూ.549 ప్లాన్: ఇది రోల్‌ఓవర్‌తో 75GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం, 12 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్, 6 నెలలు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
రూ.699 ప్లాన్: కుటుంబాల కోసం, ఈ ప్లాన్‌లో 105GB డేటా రోల్‌ఓవర్, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం, 12 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్, 6 నెలలు అమెజాన్ ప్రైమ్, 2 కనెక్షన్‌ల కోసం వింక్ ప్రీమియం ఉన్నాయి.
రూ.1,199 ప్లాన్: పెద్ద కుటుంబాలకు, ఈ ప్లాన్ రోల్‌ఓవర్‌తో 190GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్ 12 నెలల పాటు, అమెజాన్ ప్రైమ్ 4 కనెక్షన్‌లకు అందిస్తుంది.
ఈ కొత్త టారిఫ్‌లు భారతి హెక్సాకామ్ లిమిటెడ్‌తో సహా అన్ని సర్కిళ్లకు వర్తిస్తాయి. సవరించిన ధరలు జూలై 3 నుంచి ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.