UP Woman Fight With Wolf :ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లా వాసులను కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ తల్లి తన బిడ్డ ప్రాణాల కోసం ఏకంగా తోడేలుతో పోరాడింది. కుమారుడి కోసం మృత్యువుకు ఎదురు నిలిచిన ఆ తల్లి ధైర్యసాహసాల ముందు తోడేలు తోక ముడవక తప్పలేదు.
ఇదీ జరిగింది
యూపీలోనిహర్ది ప్రాంతంలో ఓ తల్లి తన ఐదేళ్ల బిడ్డ పరాస్‌ను పక్కన పెట్టుకుని నిద్రపోయింది. అయితే ఆదివారం తెల్లవారుజామున వింత శబ్దం విని ఆ తల్లి ఒక్కసారిగా మేల్కొంది. కళ్లు తెరిచి చూసే సరికి తన కుమారుడి మెడ పట్టుకుని ఓ తోడేలు ఈడ్చుకెళుతోంది. దీంతో ఆ తల్లి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, మంచంపై నుంచి దూకి తోడేలను పట్టుకుంది. ఏమాత్రం భయపడకుండా ఆ జంతువు మెడ చుట్టూ రెండు చేతులు గట్టిగా బిగించింది. వెంటనే సహాయం కోసం పెద్దగా కేకలు వేసింది. దీంతో ఆ తోడేలు చిన్నారిని వదిలి పెట్టేసి, అక్కడి నుంచి పారిపోయింది. ఈ దాడిలో గాయపడిన బాలుడిని కుటుంబసభ్యులు సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడు క్రమంగా కోలుకుంటున్నాడు. ప్రాణాలకు తెగించి బిడ్డను రక్షించుకున్న ఆ మాతృమూర్తి ధైర్య సాహసాలను ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు.