Meerut Metro Namo Bharat Station : ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్‌లోని అతిపెద్ద ఆర్ఆర్టీఎస్ భూగర్భ రైల్వే స్టేషన్‌లో తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు నమో భారత్, మెట్రో ఒకే ట్రాక్‌పై పరుగులు పెట్టనున్నాయి. ఇది దేశంలోనే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. ఈ రైల్వే స్టేషన్‌లో నాలుగు ప్రవేశ, నిష్క్రమణ గేట్లను ఏర్పాటు చేశారు. ఈ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు సులువుగా బయటకు వెళ్లేందుకు, లోపలి వచ్చేందుకు అత్యాధునిక ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు.
వేగంగా కొనసాగుతున్న నిర్మాణ పనులు (ETV Bharat) 20 ఎస్కలేటర్లు ఏర్పాటు
బేగంపుల్ స్టేషన్ పొడవు 246 మీటర్లు కాగా, వెడల్పు 24.5 మీటర్లు. రైల్వే స్టేషన్ లోతు సుమారు 22 మీటర్లు. భూగర్భంలో రైల్వే స్టేషన్ ఉండడం వల్ల ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్‌లు సహా వేర్వేరు ప్రదేశాల్లో మొత్తం 20 ఎస్కలేటర్ లను ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే స్టేషన్‌లో మెట్లతో పాటు ఐదు లిఫ్టులు కూడా నిర్మించనున్నారు. అలాగే ప్రయాణికుల వైద్య సాయం కోసం ఎన్సీఆర్ టీసీ ప్రతిస్టేషన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్ట్రెచర్లను తీసుకెళ్లేందుకు అనువుగా లిఫ్ట్‌లను రూపొందించింది.
వేగంగా కొనసాగుతున్న నిర్మాణ పనులు (ETV Bharat) వేగంగా కొనసాగుతున్న నిర్మాణ పనులు (ETV Bharat) బేగంపుల్ భూగర్భ రైల్వే స్టేషన్‌లో రైల్వే ట్రాక్‌లపై రెండు వైపులా రైళ్లు వెళ్లే సౌకర్యం ఉంది. ఇప్పటికే బేగంపుల్ రైల్వే స్టేషన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఎయిర్ కండిషనింగ్ డక్ట్‌లను కూడా ఏర్పాటు చేశారు. బేగంపుల్‌తో పాటు మేరఠ్ సెంట్రల్, భైంసాలీలో భూగర్భ స్టేషన్‌లు ఉన్నాయి. అయితే వాటిలో బేగంపుల్ రైల్వే స్టేషన్‌కు ఉన్న సౌకర్యాలు లేవు.
4 ఎంట్రీ, ఎగ్జిట్ గేటులు
మేరఠ్‌లోని బేగంపుల్ ప్రాంతానికి సరకులను కొనుగోలు చేసేందుకు నిత్యం వేలాది మంది ప్రజలు వస్తుంటారు. దీంతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. నమో భారత్, మెట్రో రైలు ప్రారంభంతో అక్కడి ప్రజలకు ప్రయాణం మరింత సౌకర్యంగా మారనుంది. మేరఠ్‌లోని నమో భారత్ బేగంపుల్ భూగర్భ రైల్వే స్టేషన్ సహా మరికొన్నింటిలో ఆగుతుంది. ఈ రైల్వే స్టేషన్‌కు 4 ఎంట్రీ, ఎగ్జిట్ గేట్‌లు ఉన్నాయి. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని మొదటి ప్రవేశ/ఎగ్జిట్ గేట్ నిర్మించారు. సోటిగంజ్ వైపు నుంచి వచ్చే ప్రయాణికుల కోసం రెండో ద్వారాన్ని ఏర్పాటు చేశారు. నేషనల్ ఇంటర్ కాలేజ్ వైపునకు మూడో గేటు నిర్మించగా, మేరఠ్ కాంట్ వైపునకు నాలుగో గేటు ఏర్పాటు చేశారు.
నమో భారత్, మేరఠ్ మెట్రో రైళ్లు మేరఠ్ సౌత్, శతాబ్ది నగర్, బేగంపుల్, మోదీపురం స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి. మేరఠ్ మెట్రో కోసం నగరంలో 23 కిలోమీటర్ల వ్యవధిలో మొత్తం 13 స్టేషన్లను నిర్మిస్తున్నారు. వీటిలో మేరఠ్ సెంట్రల్, భైంసాలీ, బేగంపుల్ రైల్వే స్టేషన్లు భూగర్భంలో ఉన్నాయి. వచ్చే ఏడాది నాటికి ఆర్‌ఆర్ టీఎస్, మేరఠ్ మెట్రో మొత్తం ఈ ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.