తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శ్రీవారి భక్తులకు శుభవార్త - స్వామివారి కానుకల వేలం - లిస్ట్​లో ఏమేం ఉన్నాయో తెలుసా? - TTD Auction Mobiles and Watches - TTD AUCTION MOBILES AND WATCHES

TTD Auctions: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్​న్యూస్​ చెప్పింది. స్వామి వారికి భక్తులు సమర్పించిన పలు కానుకలను వేలం వేయనున్నట్లు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

TTD Auctions
TTD Auctions (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 8, 2024, 3:38 PM IST

TTD Auction the Mobile phones and Watches Donated by Devotees: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో కొలువైన ఆ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఆ స్వామి రూపాన్ని కనులారా వీక్షించి ధన్యులు అవుతారు. అంతేకాకుండా.. ముడుపులు, మొక్కుబడుల రూపంలో స్వామి వారికి కానుకలు కూడా సమర్పిస్తారు. కొద్దిమంది తలనీలాలు సమర్పిస్తే, మరికొద్దిమంది డబ్బులు, బంగారం, ఫోన్లు, వాచీలు వంటివి హూండీలో వేస్తుంటారు. ఈ క్రమంలోనే స్వామి వారికి భక్తులు సమర్పించిన పలు కానుకలను వేలం వేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంతకీ ఆ కానుకలు ఏంటి? వేలం ఏ రోజున నిర్వహిస్తారు? వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో భక్తులు హుండీలలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు. నగదుతోపాటుగా సెల్‌ఫోన్లు, వాచీలను కానుకలుగా సమర్పించుకుంటుంటారు. ఇలా వచ్చిన ఫోన్లు, వాచీలను టీటీడీ ప్రతినెలా వేలం వేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఆగస్టులో కూడా కానుకలను వేలం వేయనున్నట్లు తెలిపింది. టెండర్ కమ్ వేలం(ఆఫ్ లైన్) ద్వారా వేలం వేయనున్నట్లు ప్రకటించింది.

తిరుమల వెళ్లేవారికి అలర్ట్: ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు - భక్తులకు TTD సూచన!

బ్రాండ్లు ఇవే:శ్రీవారి భక్తులు సమర్పించిన ఫోన్లలో అనేక రకాల కంపెనీలకు చెందనవి ఉన్నాయి. అవి.. సోనీ, ఎల్‌జీ, మోటరోలా, రెడ్ మీ, ఐటెల్, ఎంఐ, పోకో, రియల్ మీ, ఆనర్, నోకియా, మైక్రోమాక్స్, లావా, కార్బన్, జియో, ఆసస్, సెల్ కాన్, వంటి పలు సంస్థల ఫోన్లు ఉన్నాయి. వీటిని వేలం వేస్తున్నారు. అదే విధంగా టైటాన్, ఫాస్ట్ ట్రాక్, సొనాటా, హెచ్ఎంటీ, టైమెక్స్, కాసియో, స్మార్ట్, సిటిజెన్ , టైమ్స్, టైమ్ వెల్, ఫోస్సిల్ వంటి బ్రాండెడ్ వాచీలను కూడా వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు.

వీటిని రెండు కేటగిరీలుగా విభజించి వేలంలో పెట్టనున్నట్లు ప్రకటించింది. వాటిలో ఉపయోగించిన ఫోన్లు, వాచీలు, పాక్షికంగా దెబ్బ తిన్న ఫోన్లు, వాచీలు అనే కేటగిరీలుగా విభజించినట్లు తెలిపింది. వీటిలో ఉపయోగించిన లేదా పాక్షికంగా దెబ్బతిన్న ఫోన్లు 22 లాట్లు, అదే విధంగా వీటిలో ఉపయోగించిన లేదా పాక్షికంగా దెబ్బతిన్న వాచ్​లు 13 లాట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ టెండర్​ కమ్​ వేలం(ఆఫ్​లైన్​)ను ఆగస్టు 12(సోమవారం), 13(మంగళవారం) నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఆసక్తి కలిగిన వారు.. ఇతర వివరాలు తెలుసుకునేందుకు తిరుపతిలోని హరేకృష్ణ మార్గ్‌లో ఉన్న టీటీడీ ఆఫీసులో జనరల్ మేనేజర్‌/ఏఈఓ ను సంప్రదించాలని ప్రకటనలో తెలిపింది.

స్వామివారి భక్తులకు గుడ్​న్యూస్​ - ఇక నుంచి అక్కడ కూడా టికెట్​ కౌంటర్​!

శ్రీవారి భక్తులకు శుభవార్త - వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ప్రకటించిన టీటీడీ

ABOUT THE AUTHOR

...view details